ఎక్కడ పుట్టారో తెలీదు.. ఇంతకాలం ఎవరి లైఫ్ ఎలా గడిపారో తెలీదు..
ఎక్కడో యాక్సిడెంటల్‌గా కలుస్తారు…. లైఫ్‌లో ఏదో సాధించాలన్న కసి… ఆ కసే ఆ ఇద్దరి మొహాల్లోనూ చాలా పవర్‌ఫుల్‌గా కన్పిస్తుంటుంది.. ఎవరికి వారు ఎదుగుతుంటారు.. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు.. ఒకరి విజయాన్ని మరొకరు సెలబ్రేట్ చేసుకోవడానికి ఎలాంటి కుళ్లులూ, ఇగోలూ ఉండవు…
యెస్.. ఇలాంటి wonderful కంపానియన్షిప్లు నేను లైఫ్‌లో చాలామందిలో చూశాను.. నాకూ ఇలాంటి కొన్ని కంపానియన్షిప్లు ఉన్నాయి..
మట్టిలో కొట్టుకుపోయిన బాల్యమే ఉండనీయ్.. కొట్టుకు తిట్టుకు బ్రతికే తల్లిదండ్రులే ఉండనీయ్.. కాసింతైన జాలైనా లేని ప్రపంచమే చిన్నచూపు చూడనీయ్….. అవన్నీ ఒకప్పుడు…. అప్పుడు డిసైడింగ్ ఫేక్టర్ మనం కాదు…
కానీ…………………. “ఇప్పుడు మనమే డిసైడింగ్ ఫేక్టర్”…………………
ఏం కావాలనుకుంటున్నామో డిసైడ్ చేసుకునే సత్తా ఉందీ… సాధించే దమ్మూ ఉంది… వందమంది విచిత్రంగా చూసినా సైలెంట్‌గా చేసుకుపోయే కమిట్మెంటూ ఉంది… సరిగ్గా ఇలాంటి మనుషులే Google Mapsలో విసిరేయబడినట్లు అక్కడక్కడ తారసపడుతుంటారు… అలాంటోళ్లు ఒకళ్లు పరిచయం అయితే ఇంకాస్త దమ్మూ, థైర్యమూ.. ఇంకేం కావాలి… ప్రపంచాన్ని శాసించే శక్తిగా మారడానికి?
అంత మన వల్ల కాదులే… ఇంత మన వల్ల కాదులే… ఏదో అలా అలా బ్రతికితే చాలు.. అని సర్ధుకుపోయి ఓ మూలన జాగా చూసుకుని ఇరుక్కుపోవడానికి కాదు ఈ ప్రపంచం కళ్ల ముందు కన్పిస్తోంది…
పక్క మనిషిని మనకు శత్రువు కాడు.. పక్క మనిషి మన జీవితాన్ని లాక్కోట్లేదు.. కాళ్ల క్రింద భూమిని లాగేసుకోవట్లేదు.. ఇది విశాల ప్రపంచం… టాలెంట్ ఉన్న వాడికి దున్నుకున్నంత జాగా… ఇంకెందుకు భయపడాలి? ఎందుకు ప్రతీ ఒక్కరినీ ఇన్ సెక్యూర్డ్ గా చూడాలి?
“యెస్.. నేను కమిట్ అయ్యాను… సమ్‌థింగ్ లైఫ్‌లో సాధించాలని!!”
ఈ ఒక్క మాటా గర్వంగా అనలేని బ్రతుకెందుకు? పొద్దుట్నుండీ సాయంత్రం వరకూ అందరూ తింటారు, కబుర్లు చెప్పుకుంటారు, కాలక్షేపం చేస్తారూ.. కళ్ల నిండా నిద్రపోతారూ…!! ఆ మాత్రానికే మనమూ పుట్టినట్లయితే….. ఫినిష్డ్ గర్వపడడానికి ఓ స్పెషల్ లైఫ్ అంటూ ఏం లేదు!!
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply