ఎక్కడ తిరస్కరించబడతామో అన్న భయం నుండి బలవంతులుగా కన్పించడానికి ప్రయత్నిస్తారు చాలామంది…
పబ్లిక్ ప్లేసెస్‌లో తరచూ నేను అబ్జర్వ్ చేసే సైకాలజీ ఇది…
మొహాలు చాలా సాలిడ్‌గా ఉంటాయి… "తమని తాము కాన్ఫిడెంట్‌గా నమ్మించుకోవడానికి" ఆ మొహాలు కనురెప్పలు కూడా వాల్చకుండా గంభీరంగా దృష్టి సారిస్తుంటాయి….
ఉన్నది ఓ కొత్త ప్లేస్.. అక్కడ ఉన్న వాళ్లందరూ కొత్త వాళ్లే… మనకు తెలుసు ఆ కొత్త ప్లేస్‌లో మనం గడిపే ఆ కొద్దిసేపు మనల్ని గమనించే ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక ఇంప్రెషన్ కలుగుతుంది… ఆ ఇంప్రెషన్ వీలైనంత బెటర్‌గా ఉండాలన్న తాపత్రయం…
మనం కాలు పెట్టే ప్రతీచోటా… మెరుగైన ఉనికి కోసం నిరంతర పోరాటమే మనకు…
ఈ పోరాటం నరాల్ని బిగదీస్తోంది…. దవడల్ని బిగుతుగా పెడుతోంది… భుజాల్ని స్టిఫ్‌గా పెడుతోంది.. కళ్లతో లోతుగా చూస్తోంది… బ్రెయిన్‌తో అరక్షణంలో అరవై ఆలోచనలు చేసి.. next second plan of action డిసైడ్ చేస్తోంది….
అందుకే సినిమా థియేటర్ కెళ్తే.. చాలామంది సంతోషంగా ఉన్నట్లు నటిస్తారు.. నిజమైన సంతోషం కన్నా కొన్ని రెట్లు నటన ఎలివేట్ అయి కన్పిస్తుంది….
అలాగే గొడవ తప్పదన్నచోట… బలం లేకపోయినా దృఢంగా కన్పించడానికి మాటలతోనూ, ఎక్స్ప్రెషన్లతోనూ కుస్తీపడతారు…
బలవంతుడిగా..
తెలివిగల వాడిగా..
సున్నిత మనస్కుడిగా….
రొమాంటిక్ ఫెలోగా…
కేరింగ్ పర్సన్‌గా…
సోషల్ రెస్పాన్సిబులిటీ ఉన్న వ్యక్తిగా…
ఇలా.. చాలానే హీరోయిజం లక్షణాలతో మనం రిలేషన్లనూ, సొసైటీనీ గెలవాలని కోరుకుంటాం…
చాలా సందర్భాల్లో మనం అవసరం లేకపోయినా తెలివితేటలు ప్రదర్శించడానికీ.. బలప్రదర్శన అంత సీన్ లేకపోయినా రొమ్ములు విరుచుకోవడానికీ.. తల్లినీ, చెల్లినీ సరిగ్గా చూసుకోలేకపోయినా… చాలా కేరింగ్ పర్సన్‌గా కబుర్లు ఒలకబోయడానికీ… ఇలా చాలా విషయాల్లో డ్రామాలు మాత్రమే ఆడతాం.. మనలో వాస్తవమైన ఎమోషన్ ఉన్నా లేకపోయినా! "ఇవన్నీ డ్రామాలు మాత్రమే" అని నాలాంటి వాడు ఎవడైనా ఇలా రాసినా, మాట్లాడినా మనస్సులో నాలుగు తిట్టుకుని దూరంగా పెడతాం.. కారణం ఏదోలా ఎస్టాబ్లిష్ అవ్వడానికి మన తంటాలేవో మనం పడుతుంటే మధ్యలో ఈ అనాలసిస్‌లు ఏమిటి అని!
ఏ మూమెంట్ అయితే సొసైటీ మనల్ని "ఫలానా విధంగానే అర్థం చేసుకోవాలని" తాపత్రయపడడం మొదలెడతామో ఆ క్షణమే మనపై నియంత్రణ కోల్పోతాం….
ఆర్టిఫీషియల్ ఎమోషన్లు పుట్టుకొస్తాయి…
ధైర్యమే లేని వ్యక్తికి ధైర్యమూ వస్తుంది… జాలీ లేని వ్యక్తి చాలా జాలి ప్రదర్శిస్తూనూ ఉంటారు… సొసైటీలోని మనుషులందరూ ప్రదర్శించే ఇలాంటి ఆర్టిఫీషియల్ ఎమోషన్ల వల్ల ఎంత భారీ నష్టం జరుగుతుందో మన ఊహకు అందదు…
సొసైటీ ఎలా ఉన్నా మనల్ని accept చేస్తుంది… ఒకవేళ చెయ్యకపోనూ వచ్చు… it’s not a big deal…
ఈ ఒక్క మెంటల్ ట్రాప్ నుండి భయపడితే చాలా నేచురల్‌గా బ్రతకొచ్చు…
నటించడం కష్టం కానీ ఉన్నదున్నట్లు జీవితం చాలా సులభం… సో నరాలూ, కండరాలూ బిగదీయబడవు.. మొహాలు ఎమోషన్లు పోగొట్టుకుని కళ పోగొట్టుకోబడవు…. మనుషుల్ని చూస్తున్నట్లు ఉండాలి గానీ డిస్ ప్లేలో బొమ్మల్ని చూస్తున్నట్లు ఉంటే ఏం బాగుంటుంది?
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
నటించడం కష్టం కానీ ఉన్నదున్నట్లు జీవితం చాలా సులభం…Well Said.