మెడ మీదకు చేతులు..
సీన్ 1: ఏదో తప్పు చేస్తున్నామన్న గిల్ట్ ఫీలింగ్… ఒక చేతిని అప్రయత్నంగా మెడ మీదకు తీసుకు వెళ్తుంది.. సరిగ్గా అప్పుడే సూటిగా కళ్లల్లోకి చూడకుండా తల క్రిందక దించి మాట్లాడడం జరుగుతుంది.
ఈ భంగిమలో చాలావరకూ రెండో చేయి జేబులో పెడతారు… కాన్ఫిడెంట్‌గానే ఉన్నామని తమకి తాము ధైర్యాన్ని మూటగట్టుకునే ప్రయత్నమిది…
అంటే “నేను తప్పు చేసి ఉండొచ్చు.. కానీ నేను చేసింది కరెక్టే” అని ఓ సిట్యుయేషన్ని మనస్సులో బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం అన్నమాట!
సీన్ 2: ఓ సిట్యుయేషన్ నచ్చలేదనుకుందాం… ఎదురుగా కూర్చోబెట్టి ఓ వ్యక్తి వాయిస్తున్నాడనుకుందాం… 😛 అక్కడి నుండి తప్పించుకోవడానికి అస్సలు వీలే లేనప్పుడు…ఆ కోపాన్నీ, ప్రస్టేషన్నీ నేరుగా మొహంలో చూపించలేక ఇలా మెడ మీదకు చెయ్యి తీసుకు వెళ్లడం జరుగుతుంది… అలాగే ఎదుర్కొంటున్న వత్తిడిని బట్టి మెడపై చేతిని నిమురుకోవడమూ జరుగుతుంది…
ఇలా మెడపై చేయి నిమురుకోవడాన్ని చూసి.. తమ ఫీలింగ్స్‌ని ఎదుటి వ్యక్తి గెస్ చేస్తారేమోనని కొంతమంది చేయి మెడ వరకూ వెళ్తుంది.. వెంటనే వెనక్కి తెచ్చేస్తారు… అంటే బాడీ లాంగ్వేజ్‌ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నమన్నమాట.. 😛 కానీ మరో ఎక్స్ప్రెషన్లో ఎటూ ఆ అసహనం బయటపడుతూనే ఉంటుంది.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply