పార్టీలో కూర్చోవడమంటే చాలామందికి మంచి సరదా… సరంజామా అన్నీ సమకూర్చుకుని తాపీగా సోది చెప్పుకుంటూ లాగించేసే కొద్దీ బాటిళ్లు బాటిళ్లు ఖాళీ అయిపోతుంటాయి..
తాగడం పదేళ్ల క్రితం వరకూ పెద్ద తప్పుగానే భావించబడుతూ వచ్చేది. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం 2005లో నేను లాస్ట్ టైమ్ డ్రింక్ చేశాను.. డ్రింక్ అంటే బీర్ మాత్రమే. “ఇక లైఫ్‌లో డ్రింక్ చెయ్యకూడదు” అని డిసైడ్ చేసుకుని మానేసి ఇప్పటికి 9 సంవత్సరాలైపోయింది.
ఇప్పుడు తాగడం తల్లిదండ్రులకు తెలిసినా పెద్దగా సీరియస్‌గా ఎవరూ తీసుకోవట్లేదు. ఓ రకంగా చెప్పాలంటే అది acceptable habit అయిపోయింది. ఇక FBలో అయితే చాలామంది చాలా దర్జాగా మందు గ్లాసులు పట్టుకుని చెల్లాచెదురుగా పడున్న బాటిళ్లతో ఫొటోలు కూడా పెట్టేస్తున్నారు.. “అందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాం” అని! అదో గొప్పగా చెప్పుకుంటూ!!
———————-
తాగడం ఎంజాయ్‌మెంటా కాదా అన్న దానికన్నా అది ఎంత డేంజరస్ హాబిటో చాలామందికి అర్థం కాదు. కొంతమందైతే నెలకో, 15 రోజులతో జస్ట్ టేస్ట్ చేస్తున్నాం.. సో పెద్దగా మాకు అలవాటు కూడా లేదంటూ తమకి తాము క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ ఉంటారు.
బాడీ మెటబాలిజాన్ని కొన్ని గంటల పాటు అస్థవ్యస్థం చేసే హాబిట్ డ్రింకింగ్. ఆ కొద్ది గంటలే ఎఫెక్ట్ అనుకుంటే తప్పే.. బాడీలోని ప్రతీ ఆర్గానూ పరోక్షంగా ఎఫెక్ట్ అయ్యే హాబిట్ ఇది. ప్రత్యక్షంగా దారుణంగా డామేజ్ అయ్యేది లివర్. ఆకలి పుట్టాలన్నా, తిన్నది అరగాలన్నా, అరిగాక అది శరీరంలోని అన్ని అవయువాలకూ, కణాలకూ పోషకాల రూపంలో అందాలన్నా లివర్ ఎంత ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుందో దాదాపు అందరికీ తెలిసిందే…
అయినా తాగుతారు… “ఆ ఏముందిలే.. కొద్దిగానే కదా.. ఇప్పుడు గాక ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం” అని!
తాగడమే కాదు కొత్త మెడికల్ థీరీలూ బోధిస్తుంటారు.. రోజుకో ఔన్స్ తాగితే గుండెకు మంచిదని 🙂 గుండె జబ్బులున్న వారికి హైపర్ టెన్షన్ రాకుండా స్లీపింగ్ పిల్స్ లాంటివో, కొద్ది మోతాదులో precribe చేసే డ్రింక్నో మీ వ్యసనానికి కారణంగా చేసుకుంటే అంతకన్నా అవివేకం ఏదీ లేదు.
డ్రింక్ హాబిట్ ఉన్న కొంతమంది అమ్మాయిలనూ నేను చాలా ఏళ్లుగా చూస్తున్నాను.. మగాళ్లకు ఆరోగ్య స్పృహ ఉండట్లేదు సరే.. ఆడాళ్లకు ఏమవుతోందో అర్థం కావట్లా.. వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవాలి.. పిల్లల్ని కనాలి.. డ్రింక్, స్మోక్ చెయ్యడం వల్ల పునరోత్పత్తి శక్తిని పోగొట్టుకున్న వాళ్లూ నాకు తెలుసు. ఆడవాళ్లకు జీవితాంతం హార్మోన్లు అతి కీలకం. కానీ అవేం పట్టించుకోవట్లేదు.. హాపీగా గ్లాస్ పట్టుకుని బాయ్, గర్ల్ ఫ్రెండ్స్‌తో పార్టీలు చేసుకునే కల్చర్ వచ్చేసింది.
మగాళ్లయినా, ఆడాళ్లయినా మీరు తాగుతుంటే అడ్మైరింగ్‌గా చూస్తున్నారనో, ఎవరూ ఆపట్లేదనో, అంతా acceptable అయిపోయిందనో భావించేసి కంటిన్యూ అయిపోతే మీ లైఫ్ మీరు నాశనం చేసుకుంటున్నట్లే. ఒకప్పుడు డ్రింక్ చేసి 9 ఏళ్ల నుండి మానేసిన అనుభవం కొద్దీ చెప్తున్నా.. డ్రింక్ మానేయండి శరీరం ఎంత కంట్రోల్లోకి వస్తుందో మీరే గ్రహిస్తారు.
చిన్న వయస్సులోనే ముసలి వాళ్లలా కన్పిస్తున్నారంటే, కేజీలకు కేజీలు బానపొట్టలు వేలాడిపోతున్నాయంటే.. నడుముల చుట్టూ టైర్లు వేలాడిపోతున్నాయంటే.. మొహం రఫ్‌గా తయారైపోతోందంటే, తిన్నది అరగట్లేదంటే, ఆకలి వేయట్లేదంటే.. మంచి నీళ్లు కూడా తాగబుద్ధి కావట్లేదంటే.. ఇలా ఎన్నింటికో మీ తాగుడు కారణం. దయచేసి న్యూ ఇయర్ పేరుతో ఆ తాగుడు హాబిట్ పెంచుకోకండి.. మానేయండి.
– నల్లమోతు శ్రీధర్
Sir naku kuda mandu alavatundi, nelaku oka sari thagevanni yi roju meru rasinadi chadivanu nenukuda ee rojunumchi gattiga deside avuthunnanu inkepudu thaganu.
Thanks
Useful post.
Thanks sir very good mater
Chaala ardhavantham gaa lothuga vishleshinchi chepparu sir.. Mee nundi mukhyam gaa yuvathaku vaari aalochanaa dhorani ki upayogapade marinni postlu aasisthunnam.. Thankyou..