తిరుమల వేంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నారు..? తిరుమల కొండ మీదా? అంటే ఆయన భౌతిక రూపం మాత్రమేనా?
మరి ఈ క్షణం ఆయన్ని తలుచుకుంటే నాకెందుకు కన్పిస్తున్నాడు? అంటే తలుచుకున్న ప్రతీ ఒక్కరిలో ఉన్నాడా?
తలుచుకోవడం అనేది ఓ మైండ్ మేడ్ యాక్టివిటీనా? గతంలో చూసిన ఓ రూపాన్ని జ్ఞాపకాల్లోంచి లాక్కొచ్చి ఆ అనుభూతులను ఆస్వాదించడమేనా?
తలుచుకోకపోతే స్వామి నాలో ఉండడా?
అసలు నేనూ, శ్రీ వేంకటేశ్వరుడు వేర్వేరా? ఆయన్ని దూరంగా పెట్టి.. నువ్వక్కడ దేవుడిగా ఉన్నావు, నేను ఇక్కడ ఓ భక్తుడిగా ఉన్నాను అనే సపరేషన్ క్రియేట్ చేసుకుని నిన్ను ఆల్రెడీ కలిగిన ఉన్న నేను నిన్ను దూరం చేసుకుంటున్నానా?
నాలో ఉన్న నిన్ను నేను ఎందుకు గుర్తించలేకపోతున్నాను? ఏ పొరలు కమ్ముకుంటున్నాయి?
నీలో భాగమే నా హృదయం అనే వైబ్రేషన్కి నేనెందుకు దూరమై ఉన్నాను?
అది కలగాలంటే భౌతిక ప్రపంచాన్నీ, టైమ్, స్పేస్ అనే త్రీ డైమెన్షనల్ ఫ్రేమ్డ్ లైఫ్ నుండి నేను బయట పడాలా?
నాలో ఉన్న కల్మషాలన్నీ కడిగి వేసుకోవాలా?
నన్ను నేను వదులుకుంటే నువ్వు మాత్రమే కన్పిస్తావు కదూ!
మరి ఇవన్నీ తెలీని.. కేవలం జ్ఞాపకాల్లో గానీ, నీ రూపాన్ని కొలిచే భక్తులకే రకరకాల లీలలు చూపించే నువ్వు.. నన్ను నేను కోల్పోయి నీలో భాగమైపోతే, నువ్వే నాలో ఓ భాగమని గుర్తిస్తే ఇంకెంత అద్భుతాలు నాకు చూపిస్తావో కదా! చూశావా మళ్లీ అద్భుతాలు, లీలలు మాత్రమే జ్ఞానేంద్రియాలతో చూసి నిన్ను జడ్జ్ చేసే పరిమిత మానసిక స్థితికి, సపరేషన్కీ దిగజారిపోతున్నాను.
వేంకటేశ్వర స్వామీ నువ్వే నాలో పూర్తిగా ఉండగా నాకు లీలలెందుకు, నమ్మడం, నమ్మకపోవడం ఎందుకు.. నన్ను ఆక్రమించుకో.. నా ఇగో అనే ఓ పేకమేడ లాంటి కోటని కోల్పోతున్నాను.
- Sridhar Nallamothu