మన రియాక్షన్లు, మన ఇంట్రెస్టులు ఖచ్చితంగా ఒక pattern ప్రకారమే ఉంటాయి. రాజకీయాల గురించి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రాంతీయ, కుల రాజకీయాలూ, ఆ తర్వాత నేషనల్, ఇంటర్నేషనల్.. సినిమాలకే వస్తే చిరు, బాలయ్య ఫ్యామిలీలూ… అలాగే ఓపీనియన్స్ పరంగా చూస్తే ఒకరు ఒక మాట అంటే మనం ఏమీ తక్కువ తీసిపోలేదు అని రుజువు చేసుకోవడానికి మనం మరో రకంగా స్పందించడమూ ఇలా మన సైకాలజీ మొత్తం ఓ predefined pattern. ఈ బిహేవియరల్ patternలు మనల్ని ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చెయ్యడానికి ప్రధానమైన కారణం మనకున్న అనవసరమైన నాలెడ్జ్.
నాలెడ్జ్ అంటే బుక్కిష్ నాలెడ్జ్‌నీ, రకరకాల సోర్సెస్ నుండి బ్రెయిన్‌లోకి చేరే ఇన్ఫర్మేషన్నీ, పుట్టినప్పటి నుండి ఇప్పటివరకూ జరిగిన లైఫ్‌లోని అనుభవాలనూ పోగేసుకోవడం కాదు.. అలాంటి నాలెడ్జ్ ఒక actionకి తాను మెదడులోకి బలంగా నమ్మిన మరో రియాక్షన్‌ని మాత్రమే ఫలితంగా అందజేస్తుంది.
కొన్ని examples చూద్దాం..
———————
మొగుడికి కోపం వస్తుంది.. పెళ్లాంపై అరుస్తాడు.. పెళ్లాం తిరిగి ఏదో ఒక మాట అంటుంది… మొగుడి ఇగో దారుణంగా దెబ్బతింటుంది. అసలు లైఫ్‌లో ఎప్పుడూ అనుకోని మాటలు కూడా అనేసుకుంటారు. ఇక్కడ మొగుడికి కోపం రావడం ఓ action అయితే ఆ తర్వాత జరిగినవన్నీ ఛెయిన్ సిస్టమ్‌లా ఒకదాని రియాక్షన్‌గా మరొకటి జరిగిపోయాయి. ఇక్కడ నిశితంగా చూస్తే ఓ స్పష్టమైన pattern దాగి ఉంటుంది.
తెలంగాణ CM, ఆంధ్రా CM ఏదో ఒకర్నొకరు తిట్టుకుంటారు.. జనరల్‌గా చూస్తే, లైట్‌గా తీసుకుంటే అది అతి సాధారణ ఇష్యూ. కానీ అది విన్న వెంటనే మనకు గతంలో ప్రజల మధ్య రేగిన విద్వేషాలూ, ఉద్వేగాలూ అన్నీ బ్రెయిన్ archivesలోంచి తొలుచుకుని వస్తాయి. అది పెద్ద విషయం కాకపోయినా మన ప్రాంతం మన నరనరాల్లోకీ పూనుతుంది. ఆవేశపడిపోతాం. ఇక్కడ కూడా ఓ pattern ఉంది. జరిగేది ఓ చిన్న సంఘటన. కానీ దానికి మనం స్పందించే విధానం బ్రెయిన్ నుండి అరికాలి వరకూ నరనరాల్లోకీ గతం తాలూకు జ్ఞాపకాల నుండి ఓ సీక్వెన్స్‌లో patternగా పాకిపోతుంది.
ఎప్పుడో వర్షాకాలం.. బయట తడిస్తే విపరీతంగా జలుబు చేసి జ్వరం వచ్చింది.. నెలరోజులు సెట్ కాలేదు. అది జ్ఞాపకంగా మిగిలి ఉండిపోతుంది. ఆ జ్ఞాపకం మళ్లీ మళ్లీ వర్షం పడినప్పుడల్లా గుర్తొస్తూనే ఉంటుంది. చినుకు తలమీద పడితే ఎక్కడ మంచాన పడతామో అన్న భయం తన్నుకొస్తుంది.
——————
పైన చెప్పినవి అతి సింపుల్‌గా ఉన్న చిన్న examples మాత్రమే. ఇలాంటివి కొన్ని వందలు ప్రతీ క్షణం మనం బ్రెయిన్లోని రిజిస్ట్రీ నుండి వెలికితీసి రియాక్ట్ అవుతుంటాం.
ఇక్కడ మనం ఎలా రియాక్ట్ అవుతామన్న దానికి ప్రధానమైన ప్రాతిపదిక… మన గతపు చేదు, ఆనందపు జ్ఞాపకాలూ, Facebookల ద్వారా, పేపర్ల ద్వారా పుస్తకాల ద్వారా నాలెడ్జ్ పేరిట బ్రెయిన్‌లోకి తోసేసే చెత్త.
ఇదంతా కలిసి మనం ఒకలాగే రియాక్ట్ అయ్యేలా ప్రేరేపిస్తుంది. గత ఒకటి రెండు రోజులుగా ఒకరిద్దరు మిత్రులు అడిగారు.. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న దానిమీద మీ స్పందన ఏంటి అని! అసలా విషయం పట్టించుకుంటేనే కదా ఏమైనా స్పందన వచ్చేది? మన రియాక్షన్లని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇలాంటి విషయాల గురించి ఎంత లీస్ట్ పట్టించుకుంటే అంత బెటర్.
అతి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది థింకింగ్ patterns ఇనుప తీగల్లాంటివి. ప్రతీ విషయాన్నీ ప్రతీ క్షణమూ భిన్నంగా ఆలోచించవచ్చు. అలా భిన్నంగా ఆలోచిస్తూ పోతే మన లైఫే మారిపోతుంది. మన ఆలోచనలు కొత్తగా తయారవుతాయి, జీవితంలో కొత్త ఉత్సాహం వస్తుంది.. అనవసరమైన వాటికి రియాక్ట్ అవడం మానేస్తాం. ఎవరు మన పట్ల ఎలా ప్రవర్తించినా అవతలి వారి మెంటల్ స్టేట్‌పై క్లారిటీ వస్తుంది.
సో మీకున్న నాలెడ్జ్ మొత్తాన్నీ పక్కన పడేయండి.. ఈ క్షణం మీ కళ్ల ముందు ఉంటే ఈ క్షణం గురించి ఇప్పటికిప్పుడు ఫ్రెష్‌గా ఆలోచించండి. ఫ్రెష్‌గా నిర్ణయం తీసుకోండి… గత అనుభవాలను బట్టో… సొసైటీలో అందరూ రియాక్ట్ అవుతున్న దాన్ని బట్టో.. ఇంకో మూసలోనో ఆలోచించేసి మీ జీవితాన్ని ఇరికించేసుకోకండి.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply