"ఈ పని నేను చేయలేకపోయాను…"
ఇదే మాటని మనం చేయలేకపోయిన ఎన్నో పనుల్ని గుర్తు తెచ్చుకుని ఎలాంటి ఫీలింగూ లేకుండా ఒప్పుకోగలమా?
మనం చేయలేకపోయామన్నది అంగీకరించడానికి మనకి అహం.
దేన్నయినా మనం చేయగలం.. మనకా శక్తి ఉందన్నది మనకు తెలుసు.. ఆ నమ్మకం మనకుంటుంది.. కానీ చేయడానికే ఒళ్లొంగదు… అందుకే మన శక్తీ, నమ్మకమూ ప్రూవ్ అయినప్పుడు గర్వంగా తలెగరేస్తాం తప్ప మన బద్ధకం వల్ల పనులు జరగనప్పుడు వేరే కారణాల కోసం వెదుకుతాం.
నిజమే మనకు కారణాలు బానే దొరుకుతాయి… సమర్థించుకోవడానికి!
కారణాల మధ్య పనుల్ని తొక్కి పడేసి రిలాక్స్ ఫీలవడానికి ఏమాత్రం వెనుకాడం.
అన్నీ అనుకూలించినప్పుుడు మూలన కూర్చున్న ముసలవ్వ కూడా మన కన్నా బాగా పనిచేయగలుగుతుంది.. ఇంకా చెప్పాలంటే కాళ్లూ చేతులూ కదలాడకపోయినా ఏదో చేయాలని తపన పడుతుంది.
"తపన" అంటే అది!!
అన్నీ వడ్డించి పెడితే వచ్చి అన్నం తిన్నంత ఈజీ కాదు లైఫ్.
ఓ పని చేస్తుంటే వంద అడ్డంకులు వస్తాయి.. యెస్… కొన్నిసార్లు చాలాసార్లు అంతే.
అన్నీ అనుకూలిస్తే బాధపడాలి కానీ 😛 అన్నీ అనుకూలించకపోతే బాధపడడమేమిటో! 😛
"ఈ మనిషి మాత్రమే చేయగలిగాడు" అని పదిమందీ చెప్పుకోవాలన్నా.. "నేను మాత్రమే చేయగలిగాను" అని మరింత ఉత్సాహం మనకు మనం నింపుకోవాలన్నా ఛాలెంజెస్ లేకపోతే ఎలా?
బ్రతికేద్దాం.. లైఫ్ ని… చిన్న ముల్లు కూడా గుచ్చుకోకుండా! కనురెప్పలో నీరు ఒలకకుండా!!
అలాగే బ్రతకడమే లైఫ్ అయితే ఏముంది ఆ చప్పిడి లైఫ్‌లో?
రంగూ రుచీ వాసన లేని అలాంటి లైఫ్‌లు ఏళ్లకు ఏళ్లు బ్రతికేస్తూ మళ్లీ బర్త్‌డే సెలబ్రేషన్ల లాంటి వాటితో ఏదో సాధించేసినట్లు మనల్ని మనం మరింత కప్పిపుచ్చుకుంటూ.., బ్రతకడానికైతే నావరకూ నేను ఖచ్చితంగా సిగ్గుపడతాను. మరి ఎంతమంది "ఏంటి సారూ.. మా ఇగోలనే డామేజ్ చేస్తున్నారే ఊరుకుంటుంటే" అని మనస్సులో తిట్టుకుంటారో నాకు తెలీదు గాని!
వెదుక్కుంటూ పోతే ప్రతీ దానికీ ఓ గొప్ప కారణాన్ని బుర్ర సిద్ధం చేసి పెడుతుంది.
"ఈ క్షణం నేను పని చెయ్యను" అని మనం అనుకుంటే.. "ఎందుకు పనిచెయ్యట్లేదు" అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చెప్పాలో అరక్షణంలో వంద ఐడియాలు వస్తాయి. ఎన్ని కధలైనా అల్లేయగలం. ఇలా చేస్తూ ఎవర్ని బుజ్జగిస్తున్నాం? మన గిల్ట్ కాన్షస్నెస్నా?
దేనికీ గిల్ట్ ఫీలవకుండా మొండిగా బ్రతికేస్తే.. ఎవరికీ జవాబుదారీగా లేకుండా ఓ గొప్ప ప్రొటెక్టెడ్ గోడని మన మాటలతో, లాజిక్‌లతో, కారణాలతో నిర్మించుకుంటే… అంతా సౌకర్యవంతంగానే ఉంటుంది.
హాయిగా, వెచ్చగా, చలికాలంలో దుప్పటి కప్పుకుని మన బద్ధకాన్ని నిమురుకునేటంత కంఫర్ట్‌గానే అన్నీ ఉంటాయి 🙂
కానీ అదే ప్రొటెక్టెడ్ గోడల మధ్య మన ఉనికి సమాధి అవుతుంది.. ఆ బద్ధకపు దుప్పట్లోనే మన కలలు సమాధి అవుతాయి.
చివరకు మిగిలేది…
"ఓ గొప్ప మనిషి అవుదామనుకున్న ఓ అతి సాదా సీదా ఒట్టి మనిషి 🙂 "
ఇలాగే బ్రతికేద్దామా? ఛాయిస్ మనదే!!
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుందనిపిస్తే షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://nallamothusridhar.com
http://youtube.com/nallamothu
🙂 🙂
పద్మార్పిత గారు 🙂 🙂 🙂