అందరం కలిసి చాలా సంతోషంగా బ్రతికేద్దాం అని ఈ ప్రపంచంలోకి వచ్చాం..
కానీ ఏమొచ్చిందో గానీ మనుషులు రకరకాల సాకులు చెప్పుకుంటూ ఒకరికొకరు దూరమవుతూ ఎవరి ప్రపంచంలో వాళ్లు గొప్పగా బ్రతికేస్తున్నామని భ్రమలో జీవితాన్ని తెల్లార్చుకుంటున్నారు.
“అతనిపై చాలా గౌరవం ఉండేది.. ఫలానా టైమ్‌లో అతను అలా రియాక్ట్ అవుతాడనుకోలేదు.. అప్పటివరకూ అతనిపై ఉన్న ఓపీనియన్ మొత్తం పోయింది..” – ఇది మనం ప్రతీ ఒక్కరికీ దూరం అవుతూ చెప్పుకునే ఓ కామన్ సాకు.
యెస్.. మనుషులు రకరకాల పరిస్థితుల్లో పెరిగి పెద్దవుతారు, రకరకాల ఎమోషన్లకి గురవుతారు, కొన్నిసార్లు మెచ్యూర్డ్‌గా ఉంటారు, కొన్నిసార్లు ఫూలిష్‌గా ఉంటారు.. ఆ మాత్రం జనాల్ని excuse చెయ్యకపోతే మీకు విజ్ఞత ఏం ఉన్నట్లు?
ప్రతీ మనిషికీ కొంత వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది.. వాళ్లు మన expectationsని బట్టే ఎప్పుడూ ప్రవర్తించరు. వాళ్లకు ఇంట్రెస్టులు, ప్రయారిటీలూ, బలహీనతలూ, లోపాలూ వాళ్లకంటూ ప్రత్యేకంగా ఉంటాయి. For example నేను ఈ క్షణం చాలా ఫూలిష్‌గా బిహేవ్ చేయొచ్చు.. అది నా బలహీనత. నా బలహీనతను అర్థం చేసుకునే మెచ్యూరిటీ మీకు ఉండాలి గానీ దాన్ని సాకుగా చూపిస్తూ నాకూ.. రేపు నాలాంటి ఎంతోమందికీ మీరు దూరమవుతూ పోతే జీవితంలో మనుషులంటూ మనకు ఎవరైనా మిగులుతారా?
మనం అనుకున్నవే జీవిత ప్రమాణాలు కాదు.. ఓ మనిషి మన అంచనాల ప్రకారం ప్రవర్తిస్తేనే, బ్రతుకుతుంటేనే సరైన వ్యక్తి అని కూడా కాదు. ఏ వ్యక్తికున్న అపరిమితమైన స్వేచ్ఛని ఆ వ్యక్తికి వదిలేస్తూ… ఆ వ్యక్తికి మానసికంగా దగ్గరవడం.. గుండెల్లో పెట్టుకోవడం నిజమైన మెచ్యూరిటీ. నిజమైన గొప్పదనం. అలా అర్థం చేసుకునే వాళ్లు దేవుళ్లు.
ఈ భూమ్మీద దేవుళ్లగా బ్రతుకుదాం… పనికిమాలిన కారణాలకు మనుషుల్ని దూరం చేసుకునే దెయ్యాల్లా మనమూ మారిపోతే ఎలా?
– నల్లమోతు శ్రీధర్
ప్రతి మనిషి తనకు తానే తెలుసుకోవాల్సిందే. దీనికి ఏ నియమాలు, నిష్టలు, పూజలు లేవు. నీలోని మానవుణ్ణి వీక్షించడానికి నీవు నీలోపలికి దృష్టిని సారించడం అలవర్చుకోవాలి