"జీవితాంతం తోడుండే నలుగురు మనుషుల్ని సంపాదించుకోవాలి…" అని అందరూ అనుకుంటూ ఉంటే… సమీపంగా వచ్చినంత వేగంగా నాకు దూరమయ్యే వందల మంది మనుషులు గుర్తొస్తారు….
నిజంగా మనుషులతో బేరసారాల రిలేషన్లు మెయింటైన్ చేయడమంత నాటకమూ, బూటకమూ మరింకేమీ లేవేమో…
దగ్గరికొచ్చేటప్పుడు… మనలో ఏదో ఓ చిన్న ఎలిమెంట్ నచ్చేసి… దగ్గరకొచ్చామంటారు…
దూరమయ్యేటప్పుడు… అలా దూరం కావడానికి వంద కారణాలు సిద్ధంగా పెట్టేసుకుంటారు… హహహ….
వ్యక్తిగా నేను అదృష్టవంతుడిని… కారణం… నేను ఏ మాయ చేతా సుదీర్ఘకాలం బాధింపబడే స్థితిలో కూరుకుపోలేదు…
బలమైన రిలేషన్లు ఉండడం సోషల్ ఏనిమల్కి గొప్ప అని నమ్ముతాం…. కానీ బలమైన రిలేషన్ల కన్నా బలమైన వ్యక్తిత్వం ఉండడం వంద రెట్లు సేఫ్ అని నమ్ముతాను…
ప్రతీ రిలేషన్‌కీ certain అంచనాలుంటాయి… కొత్త మోజుతో మొదలై… అవసరాలూ, ఫలానా సమయంలో ఫలానా విధంగా ఫలానా వ్యక్తి బిహేవ్ చేసి ఉంటే బాగుండేది… వంటి నసుగుళ్లూ, "హెల్ప్ చేస్తారనుకుంటే అస్సలు పట్టించుకోలేదు…. మళ్లీ వంద కబుర్లు చెప్తారు" వంటి స్వార్థపు స్టేట్మెంట్లూ, ఇంప్రెషన్లూ…. నిజంగా నరకం ఎక్కడో లేదు…. ఈరోజు మనం రిలేషన్లని భ్రమిస్తూ అవసరాల కోసమై సాగిస్తున్న నాటకాల్లోనే ఉంది నిజమైన నరకం..
ఈరోజు నా చుట్టూ కొన్ని వందల, వేల మంది ఉన్నట్లు అన్పిస్తుంది…. భ్రమల్లో మునిగితే!!
కానీ వాస్తవంలో మాత్రం నాకు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు…. ఇది సత్యం….. ఎన్నోసార్లు ప్రాక్టికల్‌గా ప్రూవ్ అయిన సత్యం…
———————————————————————————-
పైదంతా చదివేటప్పుడు… సహజంగానే "శ్రీధర్ గారికి ఏదో జరిగింది.. దాని రియాక్షన్‌గా ఇలా రాస్తున్నారు" అని చాలామందికి అన్పించొచ్చు… 🙂
ఏదో రిలేషన్ వల్ల గాయపడీ, బాధపడీ నైరాశ్యంలో కూరుకుపోయిన వారికీ దాదాపు ఇలాంటి మాటలే రావచ్చు… బట్ అవి క్షణికం…. కొన్నాళ్లలో కొత్త రిలేషన్ల మోజులో పడ్డ తర్వాత ఆ నైరాశ్యం పోతుంది…
కానీ నేను పైన రాసినది నైరాశ్యం కాదు…. "మనుషుల్ని రిలేషన్లు బలంగా పెంపొందించుకోవాలి…" అని చెప్పే నేనే.. ఇవే రిలేషన్లు ఎంత miseryనో జీవితానుభవాల వల్ల తెలుసుకోవడం వల్లా, ప్లస్ జీవితం పట్ల ఎల్లప్పుడూ ఓ డిటాచ్డ్ ఫీల్ ఉండడం వల్లా "అస్సలు ఏ బలమైన రిలేషనూ నాకు వద్దు" అని అంతర్గతంగా కోరుకుంటూ ఉంటాను…
ఒక మనిషిగా మనం చెయ్యగలిగింది ఒక్కటే.. చేతనైంది చేసుకుంటూ వెళ్లడమే… మనుషులకు ప్రేమ పంచాలా…. నిజంగా ఎఫెక్షనేట్‌గా ఉండొచ్చు…. బట్ no expectations… ఈ క్షణం ఏ పని చేసినా, ఎవరితో ఉన్నా, ఎవరితో మాట్లాడుతున్నా, స్పెండ్ చేస్తున్నా నూటికి నూరుశాతం ఇవ్వగలిగినది ఇచ్చి…. సైలెంట్‌గా వెనుదిరగడంలో ఉన్నంత డిటాచ్మెంటూ, సౌఖ్యమూ ఏదీ లేదు…..
యెస్…. మనం అన్నీ చేస్తున్నాం…. మనం చేస్తున్నవన్నీ మనుషులు అర్థం చేసుకోవాలనుకుంటున్నాం… అలా అర్థం చేసుకుని మనకు ఎలా నచ్చుతుందో అలా స్పందించాలనుకుంటున్నాం…. స్పందించకపోతే అప్పటివరకూ అన్నీ చేసిన మనమే ద్వేషించడం మొదలుపెడుతున్నాం….
ఈ ఛెయిన్ ఆఫ్ అటాచ్మెంట్ మనల్ని ఎంత దారుణంగా పతనం చేస్తోందో అర్థం కావట్లా….
ఒక్కళ్లగా బ్రతకడానికి భయం మనకు… అందుకే ఎవరెవరి ఇగోలనో… వారి బలహీనతలు తెలుసుకుని మరీ టెక్నిక్‌లతో శాటిస్ఫై చేసి…. వాళ్లందరూ మనతో ఉన్నారన్న భరోసా మధ్య సేఫ్‌గా నిద్రపోవాలనుకుంటున్నాం….
మనుషుల ఇగోలు శాటిస్పై చేయడం చేతకాకపోవడం వల్లా… అస్సలెవర్నీ కాసేపు కూడా ఎంటర్టైన్ చేసే తీరిక నా ప్రయారిటీల వల్ల లేకపోవడం వల్ల ఎంతో గొప్ప మేధావి వర్గం నాకు దూరం అయింది…. కానీ నాకు బాధ లేదు…. ఇదేదో మేకపోతు గాంభీర్యం కాదు… నిజంగానే!!
నేను అష్టకష్టాలు పడ్డప్పుడు ఏ సొసైటీ, ఏ మేధావి వర్గమూ… ఏ మామూలు మనుషులూ నన్ను కాపాడలేదు… ఈ మాట రాయడం వెనుక నాకు ఎలాంటి ద్వేషమూ లేదు… జస్ట్ చెప్తున్నా…..
సో ఒకప్పుడు లేని మనుషులూ, వారు హత్తుకోవడం ద్వారా వచ్చే వెచ్చదనమూ, ధైర్యమూ… ఈరోజు నన్ను మభ్యపుచ్చితే…. నన్ను నేను మోసం చేసుకుంటున్నట్లు కాదూ…
సో నలుగురు మనుషులు ఉన్నా లేకపోయినా ఫర్లేదు… మనకు మనం ఒక్క మనిషిగా జీవితాన్ని డిటాచ్డ్గా జీవించగలిగితే అంతకన్నా అదృష్టం లేదు…
– నల్లమోతు శ్రీధర్
Its difficult to practice, but once you do that, that you said is the best practise
Sir, what u have writtent is very much true. Only people who are experiencing that state can only properly understand what it is. All these days, I was worrying something wrong with me, that’s why people are not with me and I am feeling that lonilness, living so also. I am not able to win people – thats my most worrying complaint about myself. Finally, I found at least one person who is thinking the same way and I feel satisfied that I am ok. Thank you.
శిరీష గారు థాంక్యూ అండీ.. మీ ఫీలింగ్స్ షేర్ చేసుకున్నందుకు..
hai sir mee maatalu chala bagunaayi sir