గమనిక: ఇది 2011లో రాయబడింది
పలువురు మిత్రులూ, ఎన్నో ఏళ్లుగా నన్ను గమనిస్తూ వస్తున్న కంప్యూటర్ ఎరా పాఠకులూ నేను ఇలా లక్ష్యబద్ధంగా జీవించడం వెనుక ప్రేరణ ఏమిటి అని అడుగుతున్నారు. వాస్తవానికి నా కధను ఈనాడు ఆదివారం పుస్తకం వారు ఈపాటికే ప్రచురించవలసి ఉంది. వారి ప్రయారిటీల వల్ల గత రెండేళ్ల క్రితం వారు స్వయంగా వచ్చి తెలుసుకున్నా వారి వద్ద అది పెండింగ్ లో ఉండి పోయింది. మిత్రులందరికీ నా జీవితంపై, నేను జీవితానికి ఎందుకు నిర్థిష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుని ప్రతీ క్షణం కసిగా జీవిస్తున్నానూ అన్న దానిపై ఓ అవగాహన కలగడం కోసం ఇక్కడా నా వివరాలు మీతో పంచుకుంటున్నాను.
వివిధ సందర్భాల్లో నేను పంచుకున్న వివరాల ప్రకారం జ్యోతి గారనే మిత్రులు ఒకరు పై వివరాలను రాసి 2007లో తన బ్లాగ్ లో పోస్ట్ చేశారు. వివిధ కారణాల వల్ల దాన్ని డిలీట్ చేయమని నేనే కోరాను. వివరాల్లోకి వెళితే..
ఈ రోజు నల్లమోతు శ్రీధర్ గా రాష్ట్రంలోని చాలా మందికి సుపరిచితమైన నేను ఎప్పటికీ నా గతం ఇతరులకు వెల్లడించకూడదని అనుకుంటూ వచ్చాను. కాని ఆలోచిస్తుంటే నా గతం తెలుసుకుంటే దాన్ని చదివిన ఒకరిద్దరికైనా ప్రేరణ కలగవచ్చన్న ఆశతో దీన్ని రాయడానికి పూనుకున్నాను. ఇక్కడ నేను రాసిన ప్రతీ అంశం అహంకారం, స్వీయ సానుభూతి, గొప్పలు చెప్పుకోవడం. వంటి మానసిక ప్రలోభాలకు అతీతంగా నా మనసుని స్థిరీకరించుకుని రాస్తున్నదే. కొందరికైనా స్పూర్తిదాయకంగా ఉంటుందని వ్యక్తపరుస్తున్నదే తప్ప ఎవరి సానుభూతినీ నేను ఆశించడం లేదు.
నాకు నాన్న అనబడే వ్యక్తి నేను చిన్నతనంలో ఉండగానే రెండవ పెళ్ళి చేసుకుని మా అమ్మని, ఇద్దరు అక్కలను ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు. పాపం మా అమ్మమ్మ, తాతయ్యలు అప్పటి నుండి మా కోసం రెక్కలు ముక్కలు చేసుకుని తినీ తినకా మా కోసం శ్రమించనారంభించారు. నాకు ఊహ తెలిసే నాటికి మా నాన్న చేసిన అన్యాయం, చుట్టూ సమాజం యొక్క భరించలేని వేధింపులు తోడై మా అమ్మ మానసిక రోగిగా మారింది. అంత చిత్త చాంచల్యంలో కూడా అమ్మ కనబరిచిన ప్రేమ నిజంగా నా జీవితంలో మర్చిపోలేను. మనసు బాగా వ్యాకుల పడినపుడు అమ్మ ఎక్కడికో తెలియకుండా పలుమార్లు ఇంటి నుండి పారిపోతుంటే వెదికి పట్టుకుని తీసుకువచ్చేవాడిని. మేము పడే బాధని అందరూ ఎంత వినోదంగా చూసేవాళ్ళో ఇప్పటికీ కళ్ళలో మెదులుతూంది. నేను పదవ తరగతి పరీక్షలు రాస్తుండగా అనారోగ్యంతో అమ్మ కాలం చేసింది. డిగ్రీ ఫస్టియర్‌లో ఉండగా తాతయ్య అన్ని ఆర్ధిక, సామాజిక బాధ్యతలను నాకు అప్పజెప్పి చనిపోయారు.
ఒక్కసారిగా ఆర్ధిక స్వేచ్చ వచ్చేసరికి .. ఆర్ధికంగా ఇంకా సంపాదించాలన్న తపన ఉన్నప్పటికీ అనుభవ రాహిత్యం వల్ల ఏ ప్రణాళికా ఫలించక, అంతలో స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ వంటి అలవాట్లు కమ్ముకుని వ్యక్తిగా పతనం అవడం ప్రారంభించాను. చాలా ప్రమాదకరమైన ఫోర్ట్ విన్ ఇంజెక్షన్లని చేయించుకునేవాడిని. రెండు సంవత్సరాల పాటు రోజుకి 30-40 రెస్టిల్ స్లీపింగ్ పిల్స్ వేసుకుని మత్తుగా పడుకునే వాడిని. మనసు నిండా ఇన్ సెక్యూరిటీ. ఎవరి కోసం, ఎందుకోసం బ్రతుకుతున్నానో తెలియని స్థితి. అమ్మమ్మ , తాతయ్యలు ఉన్నంతవరకూ సమాజం నుండి మానసికంగా ఎదురయ్యే వేధింపుల నుండి ఎలాగోలా రక్షణ కల్పించేవారు. వారూ పోయాక అందరూ రాళ్ళేసే వారే అయినప్పుడు… ఆ ఎదుగుతున్న వయసులో అవన్నీ తట్టుకోగలిగినంత మానసిక స్థైర్యం నాకు లేనపుడు డ్రగ్స్, స్మోకింగ్, డ్రింకింగ్, రత్నా కిళ్ళీ వంటి వ్యసనాలే కొద్ది సమయమైనా నాకు ఊరట ఇచ్చేవి.
ఆ బాధ స్థాయి ఏమిటొ తెలియని వారు ఈ రోజు ఇవన్నీ తెలుసుకుని నన్ను అసహ్యించుకోవచ్చు గాక… కానీ తల్లిదండ్రుల వెచ్చటి ఒడిలో బాల్యం గడిపిన వారు ఊహకైనా ఇలాంటి పరిస్థితుల్ని జీర్ణం చేసుకోలేరు. నిజంగా నల్లమోతు శ్రీధర్‌గా నేను ఈ రోజు ఏదైనా సాధించాను , నాకంటూ ఓ గుర్తింపు సాధించగలిగాను అంటే అది పూర్తిగా సమాజం నుండి ఎదుర్కొన్న మనసుని మెలిపెట్టే బాధాకరమైన సవాళ్ళ వల్లనే. మగవాడు ఏడవకూడదని అంటారు.. కానీ నేను జీవితంలో స్థిరపడేటంత వరకూ , సమాజం నా ఒంటరి తనంతో ఆడుకునే వరకూ నేను నా దుస్థితికి ఏడవని సందర్భం లేదు. మూడు నాలుగు సార్లు ఆత్మహత్యకి ప్రయత్నించాను. కానీ దేవుడు ఎందుకో నన్ను బ్రతికించాడు. ఒకసారైతే… నా ప్రాణాలు నా నుండి దూరం అవుతున్న స్థితిని సైతం అనుభవించి సకాలంలో వైద్య సాయం అందడంతో బ్రతికాను. ఇన్ని అలవాట్లు ఉన్నా నాకు చిన్నప్పటి నుండి ఒక మంచి అలవాటు ఉంది. పుస్తకాలు చదవడం . పానుగంటి డిటెక్టివ్ పుస్తకాలు, యండమూరి ఆనందోబ్రహ్మ వంటి నవలలు ఇదీ .. అదీ అని లేకుండ వందలకొద్దీ నవలలు, ఇతర పుస్తకాలు చదివి ఉంటాను. చివరకు ఇండియన్ పీనల్ కోడ్, లుకేమియా(బ్లడ్ కేన్సర్) , గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వంటి ఒకదానితో ఒకటి పొంతన లేని అనేక అంశాలపై కనబడిన పుస్తకం అల్లా కొని చదివేవాడిని.
అమ్మమ్మ చనిపోయిన రెండు మూడు రోజులకు మా కుటుంబానికి సన్నిహితంగా ఉండే పెద్దలు అందరూ నన్ను టార్గెట్ చేసుకుని పంచాయితీ పెట్టారు. ఇలా తయారయ్యావు. జీవితంలో ఇంకా ఏమి పనికొస్తావు అని ఒక్కొక్కరు ఒక్కో రకంగా సూటిగా బాణాలు వదిలారు. నాలో అపారమైన టాలెంట్ ఉండి, నా ఆలోచనలను నేను అంతర్ముఖుడిగా ఉన్నపుడు విశ్లేషించుకోవడం ద్వారా నేను గ్రహించగలుగుతూనే ఉన్నాను. కానీ బయటి పరిస్థితులు, నా అలవాట్లు, ఇప్పటిలా అప్పుడు ఉద్యోగాలు లేకపోవడం వంటి అనేక అంశాలు నాకు ప్రతిబంధకంగా నిలిచేవి. బంధువులు అందరూ మీటింగ్ పెట్టిన రోజు ఎంత బాధపడ్డానో నాకే తెలియదు. మరుసటి రోజు యధావిధిగా నా జేబులో ఉన్న స్లీపింగ్ పిల్స్ మూడు ఫుల్ స్త్రిప్లను వేసుకుందామని జేబులో నుండి తీశా….ఎందుకో మనసు వప్పలేదు. అవి లేకపోతే నేను బ్రతకలేను అన్నంత కోరిక కలిగితే రేపు వేసుకుందాం, ఈ రోజుకి మాత్రం మానేద్దాం అని మళ్ళీ వాటిని జేబులోకి తోసేశాను. అదే నా జీవితంలో పెద్ద మలుపు. అంత భయంకరమైన వ్యసనం నుండి ఆ ఒక్కరోజుతో విముక్తి పొందాను. స్మోకింగ్, అప్పుడప్పుడు డ్రింకింగ్ అప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక అప్పుడు నా మనసు నిండా ఆవరించుకున్నది…. నా ఊరు, నా ఊరి జనాల మనస్థత్వం. ఎలాగైనా నేనేంటో నిరూపించుకుని నా ఊరి ప్రజలకు నా విలువ తెలియజెప్పాలన్నది నా ప్రగాఢ వాంచ !
సివిల్ సర్వీసెస్ కోసం ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా ప్రిపేర్ అయ్యాను. కాని వివిధ కరణాల వల్ల ముందుకు వెళ్ళలేకపోయాను. డిగ్రీ సెకండియర్‌లో ఉండగా ఐసిడబ్ల్యుఎ ఫౌండేషన్ రాసి, విజయవాడ మోడరన్ అకాడమీ, సూపర్విజ్ల ద్వారా ఐసిడబ్ల్యుఎ ఇంటర్ పూర్తి చేశాను. అప్పట్లో ఖాళీ సమయాల్లో వ్యాసాలు రాసి సూపర్‌హిట్ సినిమా మేగజైన్ వారు నడుపుతున్న క్రేజీవరల్డ్ అనే పత్రికకు పంఫేవాడిని. ప్రేమలో పావనీ కళ్యాణ్, చంటిగాడు, గుండమ్మగారి మనవడు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన జయా మేడమ్ ఆ పత్రికలను నడిపేవారు. ఒకరోజు నాకు ఒక లెటర్ వచ్చింది. తమ సంస్థలో సబ్ ఎడిటర్ పోస్ట్ ఖాళీగా ఉందని, మద్రాస్‌లో పనిచేయవలసి ఉంటుందని, ఆసక్తి ఉంటే వెంటనే వచ్చి కలవండని జయా మేడమ్ స్వయంగా లెటర్ రాశారు. మద్రాస్ వెళ్ళి ఒక ప్రక్క ఐసిడబ్ల్యుఎ ఫైనల్ చేస్తూ జాబ్ చేయవచ్చన్న ఉద్ధేశంతో మద్రాస్ వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళాక .. ఒక్క కేజీవరల్డ్ కే కాకుండా సూపర్‌హిట్‌కి జయా మేడమ్ నన్ను సబ్ఎడిటర్గా అపాయింట్ చేశారు. క్రేజీవరల్డ్ మొత్తం నేనే ఆర్టికల్స్ రాయడం, కంప్యూటర్లో కంపోజ్ చేయడం, డిజైన్ చేయడం.. మరోవైపు సూపర్‌హిట్ కోసం ఊటీ, కేరళ,వైజాగ్ వంటి ఔట్‌డోర్ షూటింగులకు వెళ్ళి చిరంజీవి, బాలకృష్ణ వంటి వాళ్ళ ఇంటర్వ్యూలు చేసుకురావడం.. దీనితోనే సరిపోయేది. ఇక ఐసిడబ్ల్యుఎ చదువు అటకెక్కింది.
తెలుగులొ మొట్టమొదటిసారిగా క్రేజీవరల్డ్ పత్రికతో పాటు కంప్యూటర్ల మీద ఒక అనుబంధం అందిద్దామని జయా మేడమ్ ప్రపోజ్ చేయడం .. ఏమి రాయాలో ఎలా రాయాలో అసలు టెక్నికల్ విషయాలను తెలుగులో అంతవరకూ ఎవరూ రాసి ఉండకపోవడంవల్ల నేనే నా స్వంత ఒరవడిని ప్రారంభించాను. ఆ తర్వాత కొద్ది నెలలకు కంప్యూటర్ విజ్ఞానం ప్రారంభమైంది. ఓ ప్రక్క నేను క్రేజీవరల్డ్లో రాస్తూ.. ఆ తర్వాత అక్కడ మానేసి హైదరాబాదు వచ్చేసి “కంప్యూటర్ వరల్డ్” అనే పత్రికను రాయడం, కంపోజ్ చేయడం వంటివన్నీ ఏక వ్యక్తిగా నిర్వహించాను. రాయడంలో నేను చిత్తశుద్ధిగా ఉన్నా దాని యాజమాన్యం సకాలంలో పత్రికను తీసుకురాక విసిగించడం వల్ల గుడ్‌బై చెప్పాను. ఆ పత్రిక మూతపడింది. అప్పుడు విజేత కాంపిటీషన్స్ సాయిబాబుగారు “మనం ప్రారంభిద్దాం సార్” అంటు ప్రతిపాదించారు. సరే అని తిరిగి అన్ని బాధ్యతలూ నా నెత్తిన వేసుకున్నాను. అలా 2001 అక్టోబర్‌లో ప్రారంభం అయినదే “కంప్యూటర్ ఎరా” .
ఈ పత్రికను ఎంతో ధీక్షగా ఒక రుషిలా తీర్చిదిద్దుతూ వచ్చాను. పాఠకులకు నాకు చేతనైనంత వరకు సేవ చేద్దామన్న ఉద్ధేశంతో రోజుకు సగటున 60 ఫోన్ కాల్స్ వరకూ పాఠకుల డౌట్స్ ని క్లారిఫై చేయడానికి వెచ్చించాను. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఎప్పుడు ఫోన్ మోగినా ఓపిగ్గా చెప్పేవాడిని బాగా అలిసిపోయిన సందర్భాల్లొ తర్వాత చేయండని చెప్పినా అవతలి వారు వాదనకు దిగినపుడూ సహనం కోల్పోయి విసుక్కున్న ఘటనలు ఉన్నాయి. ఒక్కటి మాత్రం నిజం.. నా ఊరి ప్రజలకు నా విలువ తెలియజేయాలి అన్న కసితో ప్రారంభించిన నా కెరీర్‌ని కొద్దిరోజుల్లోనే ఎక్కడో బావిలో కప్పల్లా బ్రతికే వారికి నా గొప్పతనం ఎప్పటికి తెలియాలి అన్న వాస్తవాన్ని గ్రహించి … ఆ ప్రతీకారాన్ని వదిలేసి.. పూర్తిగా ఈ సమాజానికి నాకు చేతనైంది ఎంటో కొంత చనిపోయేలోపు చేసి వెళదాం అన్న తపనతో పనిచేయడం ప్రారంభించాను. కంప్యూటరే నా ప్రపంచం. ఎంత పరిశోధన చేశానో , రేయింబవళ్ళు ఎంత మమేకమై పోయానో ఎవరూ ఊహించలేరు. నా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి, దానిని పదిమందికీ పత్రిక ద్వారా, ఫోన్ ద్వారా, మెయిల్స్ ద్వారా, మెయిల్స్ ద్వారా, ఫోరమ్, కొత్తగా బ్లాగు ద్వారా వెచ్చిస్తున్న సమయాన్ని ఒక ఆరు నెలలపాటు ఎదో ఒక హాట్ కంప్యూటర్ కోర్స్ ని చేయడానికి వెచ్చించి ఉన్నట్లయితే.. 1996 లో నా కంప్యూటర్ కెరీర్‌ని ప్రారంభించినప్పటి నుండి ఇప్పటికి ఆర్ధికంగానూ, కెరీర్ పరంగానూ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయేవాడిని.
ఈ రోజు కూడా మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్లలొ పనిచేసే ఉద్యోగులకు ఇచ్చినంత విలువ నా బంధువులు గానీ , సమాజం గానీ ఇవ్వకపోవడం చూస్తుంటే బాధ కలగదు. నవ్వు వస్తుంది ! కాని వారందరు గొప్పగా చెప్పే ఆయా సంస్థల ఉద్యోగుల కన్నా నేను చాలా చాలా ఐశ్వర్యవంతుడనని సంతోషిస్తుంటాను. నాకు వచ్చేది పదివేల రూపాయల జీతమే ఐనా నేను నాకు చేతనైంది ఎంతో సమాజానికి చేస్తున్నాను అనే తృప్తి చాలు. కేవలం కంప్యూటర్ ఎరా చదివి ఓ 70 ఏళ్ళ వ్యక్తి కంప్యూటర్ ఆపరేట్ చేయడం నేర్చుకున్నాడంటే…నేను అందించిన విజ్ఞానం ఈ రోజు ఎందరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా అవే పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగపడింది అంటే అంతకన్నా కావలసింది ఏముంది. మా అమ్మమ్మ , తాతయ్యలు కష్టపడి సంపాదించి ఇచ్చిన కొద్దో గొప్పో ఆస్థి ఉంది. డబ్బు ముఖ్యం కాదు. మొదట్లో సమాజం నన్ను గుర్తించాలని అనుకున్నాను .. కాని ఈ రోజు నాకు అర్ధమైంది సమాజం నన్ను ఒక్కడిగా గుర్తించదని.. నాతోపాటు డబ్బు ఉంటేనే నాకు విలువ ఉంటుందని ! అందుకే మా ఊరు, సమాజం గుర్తించాలన్న స్వార్ధాన్ని వదిలేసాను. నా పని నేను చేసుకుంటు వెళ్లిపోతున్నాను. నా నాలెడ్జ్ ని పెంచుకోవడం, దాన్ని పదిమందికి పంచడం ఇదే నా వ్యాపకంగా మార్చుకున్నాను.… దురదృష్టవశాత్తు చాలా మంది కంప్యూటర్ ఎరా మేగజైన్ని ఇటీవలే చూస్తున్నారు. వీలైతే ఒక్కసారి పాత సంచికలన్నీ మా పత్రికాఫీసునుండి పొంది ఒక్కో పేజీ తడిమి చూడండి.. నా చెమట వాసన తప్పకుండా మీరు గుర్తించగలుగుతారు. ఎంత నాలెడ్జి గత సంచికల్లో గతంలోకి వెళ్ళిపోయిందో ఈ రోజు మీకు తెలియకుండా పోయిందో అర్ధమవుతుంది.ఒక ప్రక్క అనారోగ్యంతో పోరాడుతూనే పత్రికను పూర్తిచేయగలిగేవాడిని పాఠకుల అభిమానమనే ధైర్యంతో. ఒకసారైతే తీవ్ర అనారోగ్యంతో రెండు నెలలు పత్రిక అస్సలు రాయలేకపోయాను. ఐనా పాఠకులు, పత్రికాధినేతలు నా కోసం ఎదురుచూశారు.
2005 వరకూ స్మోకింగ్, డ్రింకింగ్ రెండూ కొనసాగాయి. వాటినీ ఈ రోజు నుండి మానేస్తాను అనే “ఒక్కరోజు నిర్ణయం” తో మానేశాను. ఇప్పుడు రోజుకి మూడూ గంటల పాటు యోగాకి వెచ్చించడం, రోజుకి 6 లీటర్ల నీళ్ళు తాగడం (బీర్లు మానేసి) రా ఫుడ్ తినడం వంటి చాలా మంచి అలవాట్లు చేసుకున్నాను. చూడండి .. అప్పటికీ , ఇప్పటికీ ఏమైనా పోలిక ఉందేమో? అదే జీవితం అంటే అనిపిస్తుంది నాకు.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
ఇదంతా రాయడం వెనుక అసలు ఉద్ధేశం ..
22 సంవత్సరాల వయసులో జీరోగా ఉండి అందరితో నానా మాటలు పడి చావాలని నిర్ణయించుకున్న వ్యక్తి తన సంకల్పబలంతో , సమాజంమీద కసితో , చెడు అలవాట్ల మూలంగా పాడైన ఆరోగ్యంతో పోరాడుతూ, 32 సంవత్సరాల వయసులో తనకంటు ఒక స్థానాన్ని నిలుపుకుని, ఇన్నిమలుపులు,ఒడిదుడుకులు, కష్టాలు, విజయాలు, వైఫల్యాలు చవి చూసిన శ్రీధర్ ఇప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంటే, అన్నీ చక్కగా ఉండి తల్లితండ్రుల ప్రేమ, ప్రోత్సాహం,రక్షణ, చక్కని ఉద్యోగాలు, ఆదాయాలు ఉన్నవారు ఎందుకు సమాజం పట్ల కొద్దిపాటైనా బాధ్యతని వహించలేకపోతున్నారు అన్నది బాధ కలిగింఛే అంశం.
ఈ సమాజం మనది మనకోసం మనం కూడబెట్టుకునేది ఏదీ శాశ్వతంగా ఉండదు. మనం ఇతరులకు పంచి ఇచ్చేదే అది ప్రేమ కానీండి.. విజ్ఞానం కానీండి. అదే మనం రేపు చనిపోయినా మిగిలి ఉంటుంది. అలాంటి కొద్దిపాటి ప్రయత్నాలనైనా సమాజం పట్ల బాధ్యతగా ప్రతీ ఒక్కరూ చేయాలన్న ఒకే ఆకాంక్షతో ఏ ఒక్కరికైనా ఇది స్పూర్తిదాయకంగా ఉంటుంది అనే ఆలోచనతో శ్రీధర్ నాకు చెప్పిన విషయాలను అతని అనుమతితో మీ అందరితో పంచుకుంటున్నాను. ఇది చదివి అతని మీద జాలి పడకండి. ప్లీజ్….
Update:
ఈ ఏడాది (2011) మే నెలలో యాక్సిడెంట్ అయి నా మణికట్టు కి మేజర్ ఫ్రాక్చర్ అయి ఆపరేషన్ జరిగింది. 3 నెలలు కట్టు మీద ఉన్నాను. ఆ సమయంలోనూ ఒక్కటే అనుకున్నాను. ఇది లైఫ్.. వద్దంటే ఏదీ ఆగదు. సో పనిచేసుకుంటూ పోవడమే, దిగులుపడడం వృధా! అలా అనుకున్నదే తడవు రోజుకో టెక్నికల్ వీడియో చొప్పున టార్గెట్ పెట్టుకుని 3 నెలల కాలంలో 90 వీడియోలు చేశాను. యాక్సిడెంట్ ఫొటోలూ, పోస్ట్ ని ఇక్కడ చూడవచ్చు.. http://nallamothusridhar.com/?p=132
బాగుంది మీ యదార్ధ గాధ ,స్పూర్తి దాయకం. మీరు పరిచయం చెసిన అక్షర మాల software తొనె రా్స్తున్నాను.
nenu asalu nammalekapoyanu sir..
alanti paristitilo miru tirigi ee stayi ki ravadam ante chala great..
Keep it up. I admire your grit
శ్రీధర్ గారు …… నాకు మీరు పేస్ బుక్ ద్వారా మాత్రమే పరిచయం.. అందులో మీ ప్రతీ ఆర్టికల్ చూస్తాను.. మీ ఆలోచనా విధానం, సమాజం పట్ల మీ స్పందన అన్నీ నా ఉహలకు అలోచాలకి దగ్గరగా ఉంటాయి…మీ ఆర్టికల్స్ చదివినపుడు ఏమనిపించేదంటే ఎవరైనా ఒక రాయి విసిరేస్తే అది చేతపట్టుకొనిమీ గట్టిగా వెను తిరిగి విసిరే మనస్తత్వం అని… మీ యదార్ధగాథ చదివినపుడు మీరు గాడి తప్పడం ఎన్నో బాధలు బడడం చదివినపుడు…ఇంతలా శ్రీధర్ జీవితానికి తగలకుండా ఉండాల్సింది అని అనుకున్న…మీలోని కసి మిమల్ని నిన్చోపెట్టదానికి మీ మనస్తత్వమే కారణమేమో…. ఇది నా మనసుకు అనిపించింది చెప్పానే తప్ప మిమ్మలిని ఒప్పించాడానికో..నొప్పించాడానికో కాదండీ.
శ్రీధర్ గారు, నేనిది నిజంగా నమ్మలేక పోతున్నాను…నాకు ఒక్కటే అర్దం అవుతుంది. జీవితంలో ఉన్నత స్దాయికి చేరుకున్న వారందరూ సమాజం నుండి ఇలాంటి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్న వారేనని…. అంతటి చెడు వ్యసనాలను సైతం ఒక్క రోజులో మానగలిగారంటే మీరు నిజంగా చాలా గ్రేట్. మీరంటే నాకు చాలా అభిమానం ఎందుకంటే అసలు కంప్యూటర్ అంటే తెలియని నేను ఈరోజు నాకు కావల్సినది వెదకగలడానికి, ఇలా ఈరోజు తెలుగులో రాయగలడానికి మీరే కారణం..నా మనసులో మీరెంతో ఉన్నతస్దాయిలో ఉన్నారు… మీ జీవితగాధ చాలా మందికి ప్రేరణ కల్పిస్తుంది.మా అందరికోసం దానిని ఇక్కడ పోస్టుచేసినందుకు ధన్యవాదాలు.. (ఎదైనా తప్పుగా రాసి ఉంటే క్షమింగలరు..)
శ్రీధర్ గారు, నేను ఒక సం.నుంచి ఇంటర్నెట్ వాడుతున్నా, ఒక వారం క్రితం వేరే సైట్ చూస్తుంటె మీ సైట్ లింక్ తగిలింది.తెలుగు సాఫ్ట్ వేర్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయాను.మీ అక్షరమాల ద్వారా ఇప్పుడు ఈ విధంగా టైప్ చేయటం నే్ర్చుకున్నాను.మీరందిస్తున్న కంప్యూటర్ విగ్నానం వెలకట్ట లేనిది.తెలుగు ప్రజలు మీకు ఎంతో ఋణపడి ఉన్నారు. “మనం జీవితంలో ఎన్ని సార్లు క్రింద పడ్డాం అన్నది లెక్క కాదు.ఎన్నిసార్లు పైకి లేచాం అన్నది ముఖ్యం”.
మీ జీవితగాధ ఎంతో మందికి ప్రేరణ కల్పిస్తుంది.మా అందరికోసం దానిని ఇక్కడ పోస్టుచేసినందుకు ధన్యవాదాలు.మీరు ఆయురారోగ్యఐశ్వర్యాలతో, సుఖ శాంతులతో వర్దిల్లాలని ఆకాంక్షిస్తూ… సెలవ్
కష్టాలు ఉంటేనే జీవితం విలువ తెలుస్తుంది సార్. నా జీవిత అనుభవం కూడా నాకు ఇదే తెలియజేసింది. 🙂
I think You have reached a stage of selfrealization and self actualization. I bless you continue with same confidence in future.
Every life has an interesting facet… it is only to be properly presented.
Congrats
Excellent sir. keep it up
మీ జీవితం ఎంతో మందికి స్పూర్థిదాయకం.ధూమపానమే మానలేకుండా ఉన్నారు చాలామంది.అలాంటిది మీరు అన్ని వ్యసనాలను త్యజించారంటే చాలా గొప్ప.మూడు సంవత్సరాల క్రితం నేను బ్లాగు ప్రారంభించినప్పుడు నాకేమీ తెలియదు.మీ విడియోల ద్వారానే నేను అతి త్వరగా నేర్చుకోగలిగాను.మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.మీరు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో చిరకాలం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.
god bless you my young friend.
మిత్రులకు గమనిక: గత నాలుగు రోజులుగా మీ మెసేజ్ లు వేటికీ రిప్లైలు ఇవ్వలేకపోతున్నాను.. విపరీతమైన పని వత్తిడి వల్ల! దయచేసి అర్థం చేసుకోగలరు. నా లైఫ్ స్టోరీ విషయంలోనూ, ఇతర టెక్నికల్ పోస్టుల విషయంలోనూ పలువురు మిత్రులు ఇచ్చిన కామెంట్లకు ఓ రెండు రోజుల్లో వివరంగా స్పందిస్తాను. ఎంతో కష్టపడి కామెంట్లు రాసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
Congratulations Sreedhar garu.
You have won your life.You are directing your life path.It is not directing you.How great it is!You have already earned crores.
May God bring you good health by recovering early from the accident trauma.
yvk
Vijayawada
నేను ఈ టపా ఆలస్యంగా చూశానండి. మీ జీవితం కొందరికే కాదు , ఎందరికో స్పూర్తి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
Your Life Incidents are Very Heart touching.
Hats Of To You Sir, for Once again Proving that
” The Glory of a Man is not in Never Falling , But in Raising Every Time He Falls ”
Never Feel Isolated by the Society , We Are All With You.
సర్ నేను ఈ పేజి ఈవాలే చూసాను ఈ పేజి చూడక ముందు నల్లమోతు శ్రీధర్ అంటే ఒక డబ్బు ఉన్న వ్యక్తి టెక్నాలజీ తెలిసిన వ్యక్తి మాగజైన్ నడుపుతున్నారని అనుకున్నాను కానీ మీ జీవిత కథ చదివిన తరువాత నల్లమోతు శ్రీధర్ అంటే టెక్నాలజీ మాత్రమే కాదని తెలుసుకున్నాను ఈరోజునుంచి టెక్నాలజీ పరంగానే కాకుండా నిజజీవితంలో కూడా మీరే నా ఇన్స్పిరేషన్ సర్ .. మీ గురించి ఇంకా ఎంతో చెప్పాలని ఉంది ! కాని ఈ ఒక్క పోస్ట్ సరిపోదు సర్ !
థాంక్స్ సర్ మీ బ్లాగ్ లో నేను పోస్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ! ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలి !
ఇట్లు
మీ అభిమాని
సూర్య కేదార్ నాద్ జ్యోశ్యుల
Jyoti’s status on Facebook …
భగవంతుడా. ఏంటయ్యా ఈ ఏడాదిలో చాలామంది ప్రముఖులను నీ దగ్గరకు పిలుచుకున్నావు. వాళ్లంతా నీకు చాలా ప్రియమైనవాళ్లని మాకు తెలుసులే..మరో విషయం కూడా మాకు బాగా అర్ధమైంది ఏంటంటే నీకు సినిమాలంటే ఇష్టమని సుజాత, ముళ్లపూడి, నూతన్ ప్రసాద్, షమ్మికపూర్ లాంటివాళ్లను, సంగీతమంటే ఇష్టమని భూపేన్ హజారికా, జగ్ జిత్ సింగ్, భీమ్ సేన్ జోషి లాంటివాళ్లను, టెక్నికల్ అవసరాలకోసం స్టీవ్ జాబ్స్, డెనిస్ రిచీ లాంటివాళ్లను…మరెందరినో మాతో ఉంచకుండా నీ దగ్గరకు రప్పించుకున్నావు. పర్లేదు. కాని ….
అప్పుడప్పుడు మా నాయకులను కూడా ప్రేమించవయ్యా స్వామి.. ఇది కోట్లాది బాధిత ప్రజల మొర. తొందరగా ఈ విషయం మీద ఒక నిర్ణయం తీసుకో తంఢ్రి…. మా కష్టాలు తీరతాయి..
పైన వ్రాసిన కమెంట్ మీ స్నేహితురాలిది. తనకి ఓటు వేయడానికి తీరిక లేదు.. కానీ తనకిష్టం లేకపోతే ఎవరినైనా చనిపోవాలనుకుంటుంది. మిమ్మల్ని మీ బంధువులు అవమానించారన్నారు. అలా అవమానించబట్టే మీరు ఈ రోజున ఇలా ఉన్నారు. మీకు తప్పు …ఒప్పు తెలిసి వచ్చాయి, కాబట్టే మారారు. అలా ఆ రాజకీయ నాయకులు కూడా మారవచ్చు కదా !! అలా చనిపోవాలని కోరుకోవడం ఏమిటి ? మనకిష్టం లేని వ్యక్తులని చనిపోవాలని మనం కోరుకుంటుంటే ఈ ప్రపంచం లో ఎవరూ మిగలరు.
మీకు తెలిసిన టెక్నికల్ విషయాలను , వీడియో లను అందరితోనూ పంచుకుంటున్నారు, మీకు టీవీ వాళ్ళతో పరిచయాలున్నాయి, మీరు నాకు సహాయం చేసారనుకోండి, నేను జీవితం లో కాస్త ముందుకి వెళ్ళగలుగుతాను. అపుడు మా ఆయనతో శ్రీధర్ చాలా గ్రేట్ అని అంటే… మా ఆయనకు ఒళ్ళు మండదా ?? అపుడు మా ఆయన, నన్ను కూడా చనిపోమని అంటే మీకు ఎలా ఉంటుంది ? నాకు కూడా అలాగే ఆ రాజకీయ నాయకులను చనిపోమని అంటే అలాగే ఉంది. ఏదయినా విషయాన్ని స్నేహితులైతే బాగా అర్ధం అయేటట్లు చెపుతారని మీకు చెపుతున్నాను. ఆవిడను నా విషయం లో కల్పించుకోవద్దని నా మాటగా చెప్పండి.
గీతాచార్య ఏ తప్పు చేసాడో లెనిన్ బాబు అదే తప్పు చేసాడు. ఒకరిని తిట్టడం ఒకరిమీద జాలి చూపించడం ఏమిటి? రాజీవ్ గాంధీ స్నేహితులని నమ్మి మోసపోయారు దానికి ఆయన భార్యని శిక్షించాలా ? అన్నదే నా ప్రశ్న !!
నీహారిక గారు, నా స్నేహితురాలా.. ఎవరు వారు? నాకు అంత గొప్ప స్నేహాలేమీ లేవు. అస్సలు ఏమైందో, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదండీ, అస్సలు విషయమే అర్థం కాలేదు. దయచేసి వివరంగా చెప్పగలరు.
నీహారిక గారు.. Jyoti’s status on Facebook … అనే లైన్ ని నేను గమనించకుండా పైన కామెంట్ రాశాను.
నీహారిక గారు, జ్యోతి గారూ, ఇంటర్నెట్ లో నాకు ఏదో రూపంలో మాటవరుసకి పరిచయం ఉన్న ఇతర మిత్రులూ అందరూ నాకు ఒకే స్థాయి పరిచయస్థులు. ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తున్నారో గత రెండు సంవత్సరాలుగా బ్లాగ్ అగ్రిగేటర్లని చూడడం మానేశాక నాకు తెలియట్లేదు. నా పని నేను చేసుకుపోవడమే తప్ప నాకు సంబంధం లేని విషయాల్లో నేను తలదూర్చలేను. దయచేసి అర్థం చేసుకోగలరు. ముఖ్యంగా మీరు “మీ స్నేహితురాలు” అని జ్యోతి గారిని ఉద్దేశించి అన్నారు, నేనెక్కడైనా ఆవిడకి సపోర్ట్ చేస్తూ మాట్లాడానా? లేక ఇంకెవరికైనా సపోర్ట్ చేస్తూ మాట్లాడానా? ఎవరు ఎవరికి ఎటువంటి ముద్రలు వేస్తున్నారో, ఎవరు నాకు తెలియకుండా నాకు ఎలాంటి బ్రాండింగ్ లు వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు అందరూ పరిచయస్థులే. ఎవరూ గొప్ప స్నేహితులు లేరు.
sir, really amazing. Verymuch impressed about your real life story. It was helpful to me also. thankyou sir, keep it up. Gods grace upon you everlasting.
Sir, really amazing. ennallu nenu mimmalani chala pedda money vunna goppa family nundi vacharanukunnanu sir, U r wonderfull changing. mi valla “COMPUTER” gurinchi chala telusukuntunnam. Keep it up sir.
సర్ ,
మీ స్వగతం చాలా హత్తుకుంది నన్ను. ఎందుకంటె ఎమొ నాకు కూడా ఎప్పుడూ గేలిచెసే మనస్తత్వం ఉన్న బందువులే ఉన్నారు. నాన్న ఒక పైంటర్. నెను నాన్న తొ పని కి వెళ్తు చదువుకునె వాడిని. 10 వ తరగతి తర్వాత చుట్టాల చెప్పుడు మాటలతొ నాన్న నా చదువు మాంపిద్దమని చూశారు (మా ఆర్ధిక పరిస్తితుల కూడా ఒక కార్ణమే). అయినా సరే అమ్మ పట్టుదల వల్ల నే నెను 2008 లొ మెకానికల్ ఇంజెనీరింగ్ చదివి ఇప్పుడు మంచి స్థితి లొ (SAIL, Bokaro)ఉన్నాను. ఇప్పటికి అనుకుంటాను అప్పుడు ఒక మాట సాయం చెసే వాడు కూడ లెడని…అప్పుడు బ్రతుకు మర్చిపొయారని అన్న వాళ్ళె ఇప్పుడు చెరుతున్నారు.
మన లాగే ఎంతొమంది, ప్రత్యేకంగా గ్రామీణ పరిస్తితుల నుంచి వచినవాళ్ళు తమ యవ్వన జీవితం లొ, నిరుత్సాహ వాతవరణం లొ ఎప్పుడొ ఒకప్పుడు దురలవాట్ల వైపు ్మొగ్గిఉండొచ్చు. మీకు నేను విన్నవించుకొవలనుకున్నది ఎమిటి అంటే ఈ టపా 11-17 వయస్సు మద్యలొ ఉన్న పిల్లలకి (ప్రత్యేకంగా గ్రామీణపిల్లలకి )అయితె ఒక మర్గదర్సకంగా ఉండగలది అని నా అభిప్రాయం. ఇది వారికి యె విధంగా వె్ళ్ళగలదొ అలొచించగలరు (వార్త పత్రిక లాంటివి).
“ఈ రోజు కూడా మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్లలొ పనిచేసే ఉద్యోగులకు ఇచ్చినంత విలువ నా బంధువులు గానీ , సమాజం గానీ ఇవ్వకపోవడం చూస్తుంటే బాధ కలగదు.”
ఈ వాక్యానికి అయితె …………………………… ఒకసారి రమ్మనండి వాళ్ళని. 2002-2004 సమయం అనగా నా 10th, inter సమయం లొ మీ “కంప్యూటర్ ఎరా చదివె నా పరిజ్గానన్ని పెంచుకున్నను. ఇప్పుడు అదె నాకు బేస్ అయ్యింది. ఎప్పుడైతె మిమ్మల్ని FB లొ చూసానొ నాకు కలిగినా ఆనందం అంతా ఇంతా కాదు. వా్ళ్ళు తెలుసుకొవాలి నెల జీతం ్కొసం పనిచెసి LCD ల ముందు, KFC, Multiplex, pubs చుట్టూ తిరెగెవాళ్ళకి, మా లంటి వాళ్ళకి మార్గదర్శకులైన మీకు పొలిక ఎమీటీ అని. వాళ్ళ అలగే ఎడ్వనివ్వండి.
మెము మాత్రం మీ వెన్నంటే ఉంటాం , మిమ్మన్లి ఫాల్లొ అవుతూనె ఉంటాం, ఒక శ్రేయొభిలాషిగా, ఒక సొదరునిగా…………..
జై శ్రీ రాం ………………………………………….
Keep it up sir..Really Impressed about u r real life story.
sridhar,
introspection is the biggest weapon in struggle for life, it provides the reason for struggle for existence. you have successfully used it at right time knowingly or unknowingly. but i found there was definite focus already with you, though it was distorted thought your life with various reasons and means. you have overcome all those obstacles with proper ‘introspection’ . you have changed yourself and inspiring many……..great…really great…here i write quote by paramahamsa yogananda ( an autobiography of a yogi)……….” THE PURPOSE OF LIFE IS THE LIFE OF PURPOSE”
bhaskara prasad
architect
portbliar,
andaman & nicobar islands
so, great, hats off to you
“SRAMAYEVA JAYATHE ” ante ide. Service to humanity is service to God. okate chebutunna ” oka bantini kodite tirigi paiki lestundi ani niroopincharu sridhar garu. society digajaaripoindi .
sare mari best of luck sridhar garu.
simply great sir
Sir meeru chala great sir. Ippati varaki naki matrame inni kastalu unnai anukunnanu. mee gurinchi telusukunna taruvata navi chala silli anipistunnai. Mee jeevitham chala inspiring ga unnadi sir. Ammavari Aseesulato meeku ellappudu toduga undalani korukuntunnanu. All the best and Good Luck.
2001 నుండి కంప్యూటర్ వాడుతున్నాను ..ఇప్పటికీ ఏదైనా డౌట్ వస్తే మీ బ్లాగ్ చూస్తాను సర్ ….really very helpful ఫర్ all ..thanx again …
sridhar you are really great
keep it up u r a model to so many people ie my son and daughter and my friends too
శ్రీధర్ గారూ,
మీ కథ విన్నాక నిజంగా మనిషి సాధించలేనిది ఏదీ లేదు
అని ప్రగాడం గా విశ్వసిస్తున్నాను .
మీ స్నేహితుడు చందు.
sridhar garu mee article maa life ki chala daggara ga undi
memmalni inspire ga thesukuni nenu kuda mee era ni continue cheysta sir.u are inspire to me for update knowledge of computer awareness
go head sir
good bless u
Inseparable….Thanks
no words.. u are great
Sir, Miru nijananga chaala great. Oka manishi inni panulu cheyadam adi innu pratikula paristutula lo ante asadharanamaina vishayam. milanti vallanu chusi ento nerchukovali memu andaram
motivative and impressive. Good luck for u r future.
sir.., its very inspiring.. and its a live example teaches how commitment works to reach a goal and gives success.. and it proves hardwork and dedication never fails..
and i believe wealth espouse popularity…:)
Konta mandi tama Swagatam Samajaniki Teliste emavutundo ani nirantaram Sangarshana padipotuntaru….
alanti vallaku meeru cheppina visayalu Dairyanni istayi..any way nijam cheppadaniki dairyam vundali….Vasthavikamga alochinche manassu vundali…
Moneyni, statusni chuse daggaryye vallu ekkuvasepu manato vundaleru….
Knowledge and Behaviour ee rendinti meede mana snehala Life time record continue avutundi..
Thanku
Jeevitha mane maha samudrmu lo alupu solupu erugaka vuvethhuna padi leche keratala madiri jeevana payanamu. Good Good Great.
REALLY IMPACTED LIFE SIR.., ANYONE CAN DO .. YOUR MOTIVATION IMPACTED YOU A LOT SIR..I DO .. THANKING YOU SIR..
Yes sir. It is true inspiration to current youth.
I am associated with you from more than 20 years and I always felt and feeling great my self having such guide , friend, philosopher, motivator and expert in latest technology
your life is truly inspiring. Hat”s off to you Mr. Sridhar. You have done a good thing by opening your life story. It will be useful to many a young persons. We are proud of you. Keep it up.
Your life is really inspiring sir..