మిత్రులందరికీ ఓ స్పష్టత రావడం కోసం ఇది రాస్తున్నాను…
ఇప్పుడు కంప్యూటర్లు వాడుతున్న వారిలో 80% మందికి పైగా కంప్యూటర్ అనేదే తెలీని 1996 నుండి నేను టెక్నాలజీని వాడుతున్నాను… ఎడ్యుకేట్ చేస్తున్నాను…. కానీ నేను టెక్నాలజీ కన్నా మానవ సంబంధాల్ని చాలా ఇష్టపడతాను.
ఒక్కసారి నా ప్రొఫైల్‌లో About చదవండి… టెక్నాలజీతో ముడిపడి ఉన్నవి నా లక్ష్యాలు.. బయట ఇదే టెక్నాలజీ మానవత్వానికి హాని చేస్తుంటే చూస్తుండలేకపోతున్నాను. మానవత్వానికి ప్రాణమిచ్చే నా మనస్థత్వం ఊరకుండన నాకు తెలిసిన మంచి మాటలూ రాస్తూ వస్తున్నాను….
ఇదంతా ఎందుకు ఇప్పుడు అనుకోకండి… పాయింట్‌కి వస్తాను….
నా ఫ్రెండ్లిస్ట్లో అధికభాగం నా మనస్థత్వం ఫోన్ల ద్వారానూ/నేరుగానూ/మేగజైన్ ద్వారానూ తెలిసి ఉన్న రీడర్సే ఉంటారు… అతి కొద్ది మందే ఇతర రంగాల్లోని ప్రముఖులూ, నా భావజాలం నచ్చి నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపినవారూ ఉంటారు.
ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నా దయచేసి ఈ క్రింది విషయాలు దృష్టిలో పెట్టుకోండి…
1. నేను వర్చ్యువల్‌గా బ్రతికి ఉండడానికన్నా భౌతికంగా, రియల్ లైఫ్‌లో బ్రతికి ఉండడాన్ని ఇష్టపడతాను…. నేనలా ఉండడమే కాదు… నా మాటని గౌరవించి వినే మా రీడర్స్ కూడా టెక్నాలజీ మూలంగా జీవం కోల్పోకుండా తరచూ తాపత్రయపడుతుంటాను, మనుషులు సహజంగా బ్రతకాలన్న కోరిక నాది.
ఇది రాయడానికి కారణం: తమ పోస్టులను likes, కామెంట్లు చేయమని, pages లైక్ చెయ్యమని బలవంతం పెడుతూ, ఫేస్బుక్ తప్ప ప్రపంచం లేదన్నట్లు నన్ను రిలేషన్‌షిప్‌తో బ్లాక్మెయిల్ చేసే స్థాయికి కొన్ని రిలేషన్లు పెరిగాయి.. నాకు నచ్చినవి, నా మనస్సుకి అన్పించినవి మాత్రమే నేను స్పందించగలను తప్ప ఇలా అసహజంగా ఏ ఫేస్బుక్నో ప్రపంచంగా బ్రతికే జనాలతో ఇమిడిపోలేను కదా! సో మీలో ఎవరైనా నా likes కోసమే బ్రతుకుతన్నట్లయితే… నేను నిజజీవితంలో బ్రతకగలను తప్ప ఇలా వర్చ్యువల్‌గా మీతో కలిసి బ్రతకలేను 🙂
2. నేను ఎంతకాలం బ్రతుకుతానో తెలీదు…. సో నా జీవితానికి ఓ పర్పస్ ఉందని నమ్ముతాను… వీలైనంత వరకూ నా వంతు సొసైటీలో మంచినీ, మంచి ఆలోచనల్నీ పెంచడానికి ప్రయత్నిస్తున్నాను…. ఈ నేపధ్యంలో మీలో ఎవరైనా సమాజం మీద గానీ, దేశం మీద గానీ, వ్యవస్థల మీద గానీ, జనాల మీద గానీ, ప్రాంతాల మీద గానీ ద్వేషాన్ని పెంచుతూ పోతే నేను మిమ్మలను ఎంటర్టైన్ చెయ్యలేను. కొద్దిరోజులు చూసి మిమ్మలను unfriend చేయడం తప్పించి నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. అలా Unfriend చేస్తే మీరు నొచ్చుకోవలసిన అవసరం లేదు. కారణం wavelength mismatchని సరిగ్గా అర్థం చేసుకుంటే ఎవరికీ ఏ సమస్యా ఉండదు.
3. కాలక్షేపపు కబుర్లు చెప్పే టైమ్ నాకు ఉండదు… పర్సనల్ మెసేజ్‌లు రిపీటెడ్‌గా పెడుతూ నా నుండి రిప్లై రాకపోతే.. "అంత పొగరు పనికిరాదు" అని మీరు అనుకుంటే 🙂 నేనేం చెయ్యలేను. ప్రతీ క్షణాన్నీ నేను వీలైనంత సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఉంటాను. నా పద్ధతులకు, అభిరుచులకు విలువ ఇచ్చే వారితో మాత్రమే నేను నా ఫ్రీ టైమ్‌లోనైనా టైమ్ స్పెండ్ చెయ్యగలను.
ముఖ్యంగా ఆన్లైన్, సోషల్ నెట్వర్క్ రిలేషన్లు ఎన్ని అపోహలతో కూడినవే నాకు 16 ఏళ్లగా చాలా అనుభవం… సో నేను నిజమైన రిలేషన్లకి విలువ ఇస్తాను.. సోషల్ నెట్‌వర్క్‌ల ద్వారా పరిచయం అయిన వారితోనైనా నేరుగా మాట్లాడి వారి మనస్థత్వం అర్థమైన తర్వాతనే…. వర్చ్యువల్‌గా కన్నా ఫిజికల్‌గానే ఫ్రెండ్ షిప్ చేస్తాను.
సో నాతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్న, చేయాలనుకుంటున్న, అపార్థాలు చేసుకుంటున్న, ద్వేషాలు పెంచుకుంటున్న ప్రతీ ఒక్కరి స్పష్టత కోసం ఇది రాయవలసి వచ్చింది…..
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
చాలా బాగా చెప్పారు.
అత్యంతా హాస్యాస్పదం ఏంటంటే, వాళ్ళ కామెంట్ కి, పేజి లకి లైక్ లు కొట్టమని అడగటం ఏంటో , మరీ వింతగా అనిపిస్తుంది. నవ్వొస్తుంది.
ఇంతకు ముందు ఆర్కుట్ లో ఇలాగె testimonials రాయమని తెగ బలవంతం చేసేవారు, ఆ పిచ్చి ఎంతవరకు వెళ్లిందంటే నా ఎకౌంటు నుండి వాడికి వాడె testimonials రాసుకునే అంత .