ప్రాచీన కాలం మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి మనిషి త్రీ-డైమెన్షనల్‌గా ఓ ఊహాజనిత ప్రపంచంలో ఇరుక్కుపోవడానికి కారణం అవతున్న స్పేస్, టైమ్ బంధనాలను తెంచుకుని మనిషి యూనివర్శల్ బీయింగ్‌గా మారడానికి ఎలా హెల్ప్ అవుతాయో ఇక్కడ చాలా సైంటిఫిక్‌గా వివరిస్తున్నాను. చాలా ఏళ్లుగా న్యూరోసైన్స్, స్పిరిట్యువల్ ప్రాక్టీసెస్‌లో ఉండడం ద్వారా నేను తెలుసుకున్న జ్ఞానం ఇది. ఈ లోతైన విశ్లేషణ మన ఆధ్యాత్మికమైన ప్రాక్టీసెస్ ద్వారా సైంటిఫిక్‌గా మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో స్పష్టంగా వివరిస్తుంది. అందుకే చాలా శ్రమించి ఇంత మేటర్ని ఓ క్రమ పద్దతిలో టైప్ చేస్తున్నాను. ఒక్కరికి ఉపయోగపడినా నా ఉద్దేశం నెరవేరుతుంది. కళ్లు, ముక్కులు, చెవులు వంటి మన జ్ఞానేంద్రియాలకు అతీతమైన ప్రపంచం మీకు ఇదంతా పూర్తిగా చదివాక అర్థమవుతుంది.
మనిషి మెదడులో ఉండే పీనియల్ గ్లాండ్ (దీనినే పైనియల్ గ్లాండ్ అని అంటారు), సెరిటోనిన్, మెలిటోనిన్ అనే రెండు ప్రధానమైన న్యూరోట్రాన్సిమిటర్ల గురించి ఇప్పుడు వివరించబోతున్నాను. పీనియల్ గ్లాండ్ పైనాపిల్లోని పైన్ కోన్ ఆకారంలో ఉండడం వల్ల ఈ పేరుతో పిలుస్తారు. ఇది బియ్యం గింజ కంటే కొద్దిగా ఎక్కువ పరిమాణం మాత్రమే కలిగి ఉంటుంది. మన గొంతుకి వెనుక భాగంలో, తలకి వెనుక భాగంలో ఇది ఉంటుంది. ఇది ఎక్కడ ఉంది అన్నది నేను ఇక్కడ అటాచ్ చేసిన ఫొటో ద్వారా మైండ్‌లో బాగా రిజిస్టర్ చేసుకోండి. తర్వాత దీన్ని యాక్టివేట్ చేయాలనుకున్నప్పుడు మనం దాని మీద అటెన్షన్ పెట్టడానికి ఈ క్లారిటీ చాలా అవసరం.
బయటి నుండి మనం చూసే వెలుతురు, కాంతి పీనియల్ గ్లాండ్ పనితీరుని ప్రభావితం చేస్తూ ఉంటుంది. సూర్యకాంతి మొదలుకుని మనం ఇళ్లల్లో, ఆఫీసుల్లో వాడే లైట్లు దీనిని ప్రభావితం చేస్తాయి. మనం కళ్ల ద్వారా కాంతిని చూసినప్పుడు మన కళ్లల్లో ఉండే ఆప్టిక్ నరం ద్వారా ఆ కాంతి ఫ్రీక్వెన్సీ స్వీకరించబడుతుంది. ఆ సిగ్నల్‌ని బ్రెయిన్లో ఉండే సూపర్ కయాస్మిక్ న్యూక్లియస్ అనే ప్రదేశానికి అది చేరవేస్తుంది. ఆ న్యూక్లియస్ సింపథటిక్ నాడీ వ్యవస్థని ప్రేరేపితం చేస్తుంది. అది చివరిగా మనం ముందు చెప్పుకున్న పీనియల్ గ్లాండ్కి సిగ్నల్‌ని పంపిస్తుంది. దీంతో పీనియల్ గ్లాండ్ సెరటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ని ఉత్పత్తి చేయడం మొదలుపెడుతుంది. సెరటోనిన్ అనేది పగటి సమయంలో విడుదల అయ్యే న్యూరో ట్రాన్స్మిటర్. అది ఒకసారి యాక్టివేట్ అయ్యాక, నేను, పక్క మనిషి, ఈ ప్రపంచం వేరు నేను వేరు, ఈ సమాజం వేరు, నేను వేరు అనే ఎవరికి వారికి సరిహద్దులు సృష్టించే, నిన్నా, ఈరోజు, రేపు అనే కాలానికి సంబంధించిన హద్దులు సృష్టించే స్పేస్, టైమ్ భావనలను మనలో సృష్టిస్తుంది. దీనివల్ల మన శరీరానాన్ని, మన ఫీలింగ్స్, ఎమోషన్సని గమనించుకోవడం, చుట్టూ ప్రపంచాన్ని చూడడం మొదలుపెడతాం.
ఈ సెరటోనిన్ 12-32 Hz మధ్య ఉండే Beta బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీని బ్రెయిన్లో సృష్టిస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ మన మెదడులో ఉన్నప్పుడు మనలో లాజికల్‌గా ఆలోచించడం, రోజువారీ పనులు పూర్తి చేసుకోవడం, ఇతరులతో కలవడం, మాట్లాడడం లాంటి పనులు చేస్తుంటాం. అంటే ఈ సెరటోనిన్ వల్లనే మనకు భౌతిక రూపంలో ఉండే ఈ భౌతిక ప్రపంచం కన్పిస్తుంది. దానికి సంబంధించిన పనులు చేస్తుంటాం. రోజంతా ఎలాంటి లైటింగ్ లేకుండా గదిలో కర్టెన్లు వేసుకుని పూర్తి చీకటిలో కూర్చున్నా, ఎలాంటి వెలుతురూ లేకపోయినా, లేదా సాయంత్రం 6 తర్వాత సహజసిద్దంగా చీకటి మొదలై రాత్రంతా చీకటిగా ఉన్నా… ఆ చీకటిని మన కళ్లు ఆప్టిక్ నరం ద్వారా స్వీకరించి చీకటిగా ఉందన్న సిగ్నల్‌ని పీనియల్ గ్లాండ్ని పంపించడం వలన సెరటోనిన్ ఉత్పత్తి ఆగిపోతుంది.
వెలుతురికి సెరటోనిన్ అనే న్యూరో కెమికల్ ఎలా ఉత్పత్తి అవుతుందో చీకటి పడింది అన్న భావనకు రాగానే అదే పీనియల్ గ్లాండ్ మెలటోనిన్ అనే న్యూరో కెమికల్‌కి ఉత్పత్తి చెయ్యడం మొదలుపెడుతుంది. దీన్ని నైట్ టైమ్ న్యూరో ట్రాన్సిమిటర్ అని పిలుస్తారు. సాయంత్రం 6 తర్వాత చుట్టూ వాతావరణం చీకటిగా మారుతుంది కాబట్టి బ్రెయిన్లో మెలటోనిన్ స్థాయిలు రాత్రయ్యే కొద్దీ పెరుగుతుంటాయి. దీంట్లో అప్పటి వవరకూ సెరటోనిన్ వల్ల Beta ఫ్రీక్వెన్సీలో రోజువారీ పనులను చేసుకోవడానికి ఉపయోగపడిన బ్రెయిన్ వేవ్స్ కాస్తా Alpha వేవ్స్‌గా మారిపోతాయి. అంటే మైండ్ రిలాక్స్డ్గా మారుతుంది. మెల్లగా ఆవలింతలు వస్తాయి. ఆ తర్వాత నిద్రపోయాక కలలు వచ్చే theta వేవ్స్గానూ, డీప్ స్లీప్ అయిన delta వేవ్స్గానూ మారిపోతాయి. ఈ మెలటోనిన్ ఉత్పత్తిగా జరగడం వల్లనే రోజంతా మన ఎమోషనల్‌గా ఎదుర్కొన్న బాధలు, శారీరకంగా ఏర్పడిన గాయాలను వివిధ శరీర క్రియలు సరిచేసి, శరీరంలో ఉండే విషపూరితమైన టాక్సిన్స్నీ, ఆహారం అరిగిన తర్వాత వృధానీ సరిగా ప్రాసెస్ చేసి తెల్లారి లేచేసరికి శరీరం కొత్త ఉత్సాహంతో సిద్దంగా ఉండేలా చేస్తుంది.
ఎవరైతే సాయంత్రం 6 తర్వాత మొబైల్ ఫోన్లు వాడుతూ, కంప్యూటర్ల ముందు కూర్చుంటూ, లేదా బాగా కాంతివంతమైన LED లైట్లు, ట్యూబ్ లైట్లని ఇంట్లో వాడుతూ కూర్చుంటారో వారికి మెలటోనిన్ ఉత్పత్తి సరిగా జరగక మెల్లగా నిద్రపట్టని స్థితీ, ఒకవేళ శరీరం అలసిపోయినందువల్ల నిద్రపట్టినా, కలత నిద్రతో ఇబ్బంది పడే స్థితీ, నిద్రలేచేసరికి నిద్ర సరిపోలేదు అన్న అసంతృప్తీ కలుగుతాయి. ఇటీవల నేను కొన్ని సైంటిఫిక్ స్టడీస్ చూశాను. ప్రపంచ వ్యాప్తంగా ఫోన్లు వాడడం మొదలుపెట్టాక, రాత్రిళ్ల వరకూ బ్రైట్ లైట్లో టివిలు చూడడం మొదలు పెట్టాక 60 శాతం ప్రపంచ జనాభా నిద్రలేమితో బాధపడుతున్నట్లు ఈ స్టడీస్ వెల్లడిస్తున్నాయి. నిద్ర సరిగా లేకపోతే మానసిక వత్తిడి పెరుగుతుంది. శరీరంలోని టాక్సిక్ పదార్థాలు సరిగా శుభ్రం కాకపోతే మెల్లగా అవి మన శరీర అవయువాలలో సమస్యని పెంచుతాయి. దీర్ఘకాల జబ్బులు మొదలవుతాయి. మెల్లగా గుండెజబ్బులు, హార్ట్ అటాక్ రావడం వంటివీ జరుగుతాయి. మన జీవన శైలిలో మార్పులు చేసుకోకపోతే త్వరగా ఆహారం తిని త్వరగా పడుకోకపోతే, సాయంత్రం 6 తర్వాత లైటింగ్‌ని నిలుపుదల చేసుకోకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి. కొంతమంది మెలటోనిన్ సప్లిమెంట్లని తీసుకుని నిద్ర తెప్పించుకుంటూ ఉంటారు. నిద్ర వరకూ అది ఓకే గానీ, అలా కృత్రిమంగా మెలటోనిన్ వాడడం వల్ల పీనియల్ గ్లాండ్ ద్వారా వచ్చే అనేక ప్రయోజనాలు కలగవు.
పీనియల్ గ్లాండ్ ద్వారా ఒక మనిషికి ఆధ్యాత్మికంగా ఎంత ఎత్తుకు ఎదగవచ్చో, అది విశ్వంతో మనం కనెక్ట్ అవడానికి ఎలా హెల్ప్ అవుతుందో, దానిని యాక్టివేట్ చేసే పద్ధతులు వంటివి ఇంకో పోస్టులో వివరిస్తాను. ఈ సిరీస్ మిస్ అవకుండా ఫాలో అవండి.
- Sridhar Nallamothu