సమ్‌థింగ్… సమ్‌థింగ్…. ఏదో కావాలి… నిరంతరం ఏదో కావాలి….
ఎడతెరిపిలేని సంఘర్షణ… అసంతృప్తితో రగిలే హృదయం…
ఎక్కడో ఎప్పుడో ఎవరిలోనో దేనిలోనో…. సంతృప్తిని వెదుక్కునే వ్యర్థప్రయత్నం….
ఎక్కడా, ఎప్పుడూ, ఎవరూ, ఏదీ అనుకూలించనప్పుడు మూలలకు ఇరుక్కుపోయి ఒంటరితనంలో సానుభూతినీ, సంతృప్తినీ కూడగట్టుకునే విఫలయత్నం…
————————————————
ఒకటొకటిగా ముళ్లకంపలు అల్లుకుపోతూనే ఉన్నాయి….. తెగాలి…. తెంచుకోవాలి… విదిలించుకోవాలి…. వదిలించుకోవాలి…
మనకంటూ సోషల్ స్టేటస్‌ని కోల్పోతే ఏం కాదు….
మనకంటూ మందీమార్భాలం లేకపోతే ఏం కాదు…
వస్తువులూ… విలాసాలూ… అర్థరాత్రి డిన్నర్లు… సెకండ్ షో సినిమాలూ, పబ్లూ, పేకాట క్లబ్లులూ, బంగారం, చీరెలూ, డ్రెస్‌లూ… వెలుగు జిలుగుల్లో బుసలు కొట్టే అనారోగ్యకరమైన కోరికలూ…. మాయలన్నీ మాయమైపోవాలి….
మరుగునపడడంలోనూ సంతృప్తిని చూడాలి…
ఒంటరితనంలోనూ దర్జాగా మిగలాలి…
అహం చావాలి…. ఆత్మ మిగలాలి….
నిరంతరం ఆత్మపరిశీలన మకిలిపడుతున్న ఆత్మని ప్రక్షాళన చేస్తుండాలి…
ఇదంతా మన ఆలోచనల్లో ఉందన్నది ప్రపంచానికి తెలియాల్సిన పనిలేదు.. మనకు మనం ప్రతీ క్షణం ప్రపంచంతో డిటాచ్ చేసుకుంటూ పోతే మనస్సు నెమ్మదిస్తుంది…. ఏ మలినాలూ మనస్సుని కల్మషం చేయలేవు…
– నల్లమోతు శ్రీధర్
చక్కగా చెప్పారు.
పద్మార్పిత గారు ధన్యవాదాలండీ