మనం ఎలాంటి వాటి పట్ల ఆసక్తి చూపిస్తామన్నది మన క్యారెక్టర్ని నిర్మించడంలో ప్రధానమైనది.. మన ఆలోచనలు ఎప్పుడూ మనకి ఇంట్రెస్ట్ ఉన్న అంశాల వైపే మళ్లిపోతుంటాయి.
ఉస్మానియాలో ఏం జరిగింది.. బాలయ్య next సినిమా ఏంటి.. జగన్ ఏం చేస్తున్నాడు.. రోజా ఏమైంది.. ఏ పొలిటీషియన్ ఏరోజు ఎలాంటి బూతులు తిట్టుకున్నారు.. ఇవన్నీ అప్డేటెడ్గా ఉండి వాటి గురించి విశ్లేషణలతో డిస్కస్ చెయ్యడమే మన ఆసక్తి అయితే కొన్నాళ్లకి అది తెలీకుండానే మన క్యారెక్టర్ని పరోక్షంగా ఇన్ఫ్లుయెన్స్ చెయ్యడం మొదలుపెడుతుంది.
వ్యక్తిగతంగా నేను నమ్మే రూల్ ఒకటుంది.. వీలైనంత లీస్ట్ ఇలాంటి అనవసరమైన విషయాల గురించి మైండ్‌లో ప్రాసెస్ చెయ్యడం. బ్రెయిన్ చాలా శక్తివంతమైనది. దానికి ఎలాంటి ఆహారం ఇస్తే అది అలా ట్యూన్ అవుతుంది. నాకు నాలెడ్జ్ కావాలి, మనుషులు కావాలి, వాళ్ల మధ్య మంచి రిలేషన్లు కావాలి, కష్టపడాలి, ఏదో సాధించాలి. నా అసహనం మొత్తం నేను కంట్రోల్ చెయ్యలేని విషయాలపై ఉండకూడదు.. నా అసహనాన్నీ, అప్పుడప్పుడు వ్యవస్థపై, మనుషుల నైజాలపై ఏర్పడే కోపాన్నీ, కసినీ ప్రొడక్టివ్‌గా రీడైరెక్ట్ చేసుకుని జీవితంలో ఎదగాలి. ఏ ఎమోషన్ అయినా మనల్ని ఓ లక్ష్యం వైపు మళ్లించేదై ఉండాలి తప్పించి మనల్ని అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ పతనం వైపు నడిపించేదై ఉండకూడదు.
రాజకీయాలపై, రోజూ పేపర్లలో వచ్చే రకరకాల వార్తలపై నాకు ఆసక్తి లేక కాదు, నాలెడ్జ్ లేకా కాదు, పేరాలు పేరాలు రాయలేకనూ కాదు. నా సమయం చాలా విలువైనదని భావిస్తాను. సమయం పట్ల నాకున్న గౌరవం అది. కొత్తవి నేర్చుకోవడమో, నా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడమో, నన్ను నేను విశ్లేషించుకోవడమో, మానసికంగా, శారీరకంగా మెరుగ్గా తయారు చేసుకోవడమో, నాలుగు మంచి విషయాలు మాత్రమే అందరితో పంచుకోవడమో మాత్రమే నాకు ప్రయారిటీలు. ఓ మాస్ హిస్టీరియాలో కూరుకుపోయి ఏరోజు పేపర్లలో వచ్చిన వాటిపై ఆరోజు విపరీతంగా స్పందించేసి మరుసటి రోజుకి కొత్త ఇష్యూలపై రెడీ అయి జీవితాన్ని వేస్ట్ చెయ్యడం నాకు ఇష్టమే లేదు.
ఐ లవ్ మై లైఫ్.. ఈరోజు నేను ఇలా టైప్ చెయ్యగలుగుతున్నానంటే మణికట్టులో ఓ స్క్రూ ఉంది.. యాక్సిడెంట్ అయి రిస్ట్ సర్జరీ అయి అసలు టైప్ చెయ్యగలుగుతానో లేదోనన్న భయం తర్వాత వచ్చిన చేయి ఇది.. అలాగే జీవితంలో ఎన్నో కష్టాలను చవిచూశాక ఏర్పడిన అనుభవం, మెచ్యూరిటీ ఇది. ఇంత గొప్ప జీవితాన్ని పనికిమాలిన విషయాలపై అస్సలు వృధానే చెయ్యకూడదని ఎప్పుడో డిసైడ్ అయ్యాను కాబట్టే.. హెల్త్ గురించి రాసినా, టెక్నాలజీ గురించి రాసినా, హ్యూమన్ రిలేషన్లు గురించి రాసినా ఖచ్చితంగా నలుగురికి ప్రాక్టికల్‌గా ఉపయోగపడే విషయాలే ప్రస్తావిస్తాను.
అన్నింటికీ మించి మీతో షేర్ చేసుకునే నా ప్రతీ మాటా వెనుకా నా హృదయం ఉంటుంది, జెన్యూనిటీ ఉంటుంది. ఏదో రాయాలి కాబట్టి రాయడం కాదు.. నా పనికి ఓ పర్పస్ ఉంది కాబట్టే రాస్తున్నాను. సో ఐ ఫీల్ వెరీ హాపీ బై డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్ హార్ట్ఫుల్లీ!
– నల్లమోతు శ్రీధర్
Idi andaroo nerchukovali. Oka different society ni choodagaligedi appude. Naaku idi challa nachchindi.