మన ప్రాణాలు సీక్వెన్సిషియల్ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడినంత random పనులకు అలవాటు పడలేవు…
అందుకే తెల్లారి లేచి రాత్రి పడుకోబోయే దాకా చేసే రొటీన్ పనుల్ని జీవితాంతం చెయ్యమన్నా చాలా హాపీగా ఫీలవుతాం గానీ.. ఏదో ఒక్క రోజు ఓ షెడ్యూల్ ఛేంజ్‌ని ఒప్పుకోమంటే మనస్సు గింజుకుంటుంది.
చేసే ఏ పనికైనా అతుక్కుపోవడమే తెలుసు మన మనస్సుకి… మొదట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా చేస్తూ పోయే కొద్దీ.. ఆ పని తప్ప మరే పనీ చెయ్యమని మొండికేసేటంత అటాచ్మెంట్ మన పనుల పట్ల మనకు!
అందుకే మనం కాలి నడక నుండి బండ్లకు, బండ్ల నుండి కార్లకు కంఫర్టబుల్‌గా అలవాటైపోతాం తప్ప అర కిలోమీటరు నడవాలంటే అదో పెద్ద సాహసంగా భావించేస్తాం… ఏ షుగరో, ఒబేసిటీనో వచ్చి తప్పనిసరిగా నడవాల్సి వస్తే తప్పించి..!!
అలాగే కొత్త ప్రదేశాలకు వెళ్లబుద్ధి కాదు, మనింట్లో తప్పించి ఎక్కడా ఒక్క రాత్రి కూడా సుఖంగా నిద్రపట్టదు…
పొద్దున్నే పేపర్ చదవకపోతే, కాఫీ పడకపోతే… సిగిరెట్ పడకపోతే… లైఫ్ మొదలవ్వదు..
ఫేస్బుక్ లాంటి వాటికి అలవాటు పడిన ప్రాణాలకు అడిక్షన్ని బట్టి అరగంటకోసారైనా దాని మొహం చూడనిదే మనస్సూరుకోదు… ప్రపంచంలో మనకు తెలీకుండా ఏదేదో జరిగిపోతోందన్న ఆదుర్దా… ఏదో మిస్ అవుతున్నామన్న కొరతా… ఆవురావురుమని పిసి దగ్గరకు రాగానే FBలోకి లాగిన్ అవమంటుంది…
వారానికోసారి బిర్యానీ.. 15 రోజులకో సినిమా… భోజనం చేసేటప్పుడు వీలైతే న్యూస్ ఛానెళ్లూ, చేతిలో రిమోటూ….
చెప్పుకుంటూ పోతే రకరకాల లింకుల్లో అటాచ్ చేయబడిన లైఫ్‌లు మనవి.
అలవాటైన ఏ పనినీ వదులుకోలేని బలహీనతా… అలవాటు లేని కొత్త పనుల్ని ప్రయత్నించలేని నిస్సహాయతా… 🙂
మాట వరుసకి చెప్పుకోవలసి వస్తే.. కూకట్పల్లి నుండి అమీర్‌పేట వరకూ మెల్లగా నడుచుకుంటూ మనుషుల్నీ, పరిసరాల్నీ గమనిస్తూ చాలా కాజువల్‌గా గడపాలన్నది ఎప్పటినుండో నా కోరిక… అలాగే బండేసుకుని హైద్రాబాద్ నైట్ లైఫ్‌ని వీలైనంత కెమెరాలో షూట్ చేయాలన్నది మరో కోరిక…
ఎప్పటికప్పుడు అనుకుంటూనే వాయిదా పడుుతున్న కోరికలు ఇవి… ఖచ్చితంగా వీటిని అతి త్వరలో తీర్చుకుంటాను అది వేరే సంగతి అనుకోండి…
నాలాగే ప్రతీ ఒక్కరికీ చాలా చాలా కోరికలు ఉంటాయి.. కానీ అవి వెనక్కి నెట్టేయబడుతూనే ఉంటాయి.
మనకు రొటీన్ సేఫ్ జోన్లో ఉన్నంత కంఫర్ట్ మరెందులోనూ ఉండదు. అందుకే కొత్తగా ఏమీ చెయ్యబుద్ధి కాదు.
ఒక్కో పని మన అటెన్షన్‌ని చాలా drag చేస్తుంది… ఒకసారి ఒక పని చేస్తూ పోయాక ఎంతసేపటికీ దాన్ని వదలబుద్ధి కాదు… ఇక్కడే చాలామందిమి లైఫ్‌ని చాలా లిమిటెడ్‌గా బ్రతికేస్తుంటాం.
ఫేస్‌బుక్‌ని క్లోజ్ చేయబుద్ధి కాకపోతే కఠినంగా కంప్యూటర్ కట్టేసి వేరే పనులు చూసుకునే డైవర్షన్ కావాలి…
అలాగే టివి ముందు నుండి కదలబుద్ధి కాకపోతే అంతే కఠినంగా టివి ప్లగ్‌లు పీకేయాలి…
"ఆ ఏముందిలే.." అనుకుంటే చూడాల్సిన, చేయాల్సిన, అనుభవించాల్సిన, సాధించాల్సిన చాలా జీవితాన్ని కోల్పోతున్నట్లే…
నాకు షటిల్ ఆడడం ఇష్టం…. రోడ్ మీద ఆడడానికి నేను సిగ్గుపడను…. ఆడలేకపోతున్న ఎందరినో చూసి ఆడగలుగుతున్న నేను ఆనందపడతాను….
నాకు ఫొటోలు తీయడం ఇష్టం… కంప్యూటర్‌పై ఎంత పెద్ద పని ఉన్నా పక్కన పడేసి వెళ్లి ఫొటోలు తీసుకుంటా… వాస్తవానికి అటు ప్రొఫెషన్ పరంగానూ, నా పాషన్ పరంగానూ ఫొటోల కన్నా కంప్యూటర్ నాకు పెద్ద అటాచ్మెంట్. అయినా దాన్ని పక్కన పడేయకపోతే… అందమైన ప్రకృతితో నా మనస్సుని ఎలా వికసింపజేసుకోగలను?
కారమ్స్ ఆడతాను… సినిమాలకు వెళతాను… మేగజైన్ రీడర్స్‌తో కలిసి షాపింగ్ చేస్తాను…
ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే.. జీవితాన్ని ఒకేలా గడపడం నుండి ఎక్కడో పాయింట్ దగ్గర మనం డిటాచ్ అవ్వాలి… అప్పుడే జీవితం మరింత అందంగా, ఆనందంగా అన్పిస్తుంది..
గమనిక: ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply