సంస్కారం అనేది మాటల్లోనూ, చేతల్లోనూ, చూపుల్లోనూ స్వతహాగా వ్యక్తమవ్వాల్సింది.
కానీ వాటంతట అవి వ్యక్తమవ్వాల్సిన ఎన్నో మంచి లక్షణాలను మనకు మనం కలిగి ఉన్నట్లుగా భ్రమించడం అలవాటైపోయింది.
గొప్ప చదువులూ, మంచి ఉద్యోగాలూ, హోదాలూ మన నోటి నుండి వెలువడే పచ్చి బూతుల్ని కప్పిపుచ్చలేవు. మన నోరు మన అదుపు తప్పిన క్షణం హోదాల్ని బట్టి మనుషులు మనల్ని గౌరవిస్తున్నట్లు కన్పిస్తారేమో గానీ మనస్సులో ఓ చులకనభావం తప్పకుండా ఏర్పరుచుకుంటారు.
పెద్ద వాళ్లని చూసి చిన్నవాళ్లు నేర్చుకోవడం పాత మాట. చిన్న వాళ్లని చూసి.. "ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు ఉండకపోతే ఎలా" అని పెద్దవాళ్లూ యువతకు సినిమాలూ, తోటి యువతా నేర్పించే బూతుల్ని యథేచ్ఛగా వల్లించేస్తున్నారు..
ఉదా.కు…
"………… జీవితం" అట 🙂 అద్భుతమైన జీవితాన్ని ఇలా బూతులు తిట్టుకోవడానికి మించిన సంస్కారరాహిత్యం ఏమైనా ఉందా? అంత కష్టపడుతూ తిట్టుకుంటూ బ్రతకడమెందుకు… వదిలేద్దాం లైఫ్‌ని 😛
ఎవరో చదువూ, సంధ్యా లేని డైరెక్టర్, లేదా సామాజిక బాధ్యత లేని డైరెక్టర్ ఒక సినిమాలో ఇలాంటి డైలాగులు వాడగానే ఇలాంటి తిట్లన్నింటినీ మంచీ చెడూ తేడా తెలీని యువత మొదలుకుని కాస్తో కూస్తో విచక్షణ ఉన్న పెద్దవాళ్ల వరకూ వాడేస్తూ పోతే.. సమాజంలో ఏ మాదిరి సంస్కారాన్ని నిలుపుకుంటాం?
ఇంకో మనిషిని నిశితంగా గమనిస్తూ వారిలోని మంచి నేర్చుకోవడం అన్నది ఎప్పుడో మర్చిపోయాం. సమాజంలోని చెడునంతా నెత్తిన పెట్టుకుని.. మాటలు జారిపోతూ… మాటకు శక్తిని కోల్పోతూ అల్పత్వం వైపు మరలిపోతున్నాం.
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
మంచి ఎవరిలో ఉన్నా గ్రహించడం మంచిదేకదండి….
nice