చాలామంది సినిమా డైరెక్టర్ల గురించి గొప్పగా చెప్పుకుంటాం.. వాళ్లు "తినీ తినకా.. పస్తులుండి పైకొచ్చారట" అని!
ఈరోజు 15 సంవత్సరాల క్రితం చెన్నైలో కలిసి ఉన్న రూమ్మేట్ రాంబాబు ఫోన్ చేశారు..
రాంబాబు ఎవరంటే.. "దూకుడు" వంటి పలు సినిమాలకు డిజైన్లు చేసిన పబ్లిసిటీ ఆర్టిస్ట్.
అనేక డబ్బింగ్ సినిమాలు కొని, టివిలకు శాటిలైట్ రైట్స్ అమ్మి ప్రస్తుతం ప్రియమణితో "అంగుళీకం" అనే అరుంధతి తరహా గ్రాఫిక్స్ సినిమాని తీయబోతున్న ప్రొడ్యూసర్.
మనకు "కెమెరామెన్ గంగతో రాంబాబు" ఎలాగో.. "సినిమా జర్నలిస్ట్ శ్రీధర్‌తో లేఅవుట్ ఆర్టిస్ట్ రాంబాబు" మాదిరి రిలేషన్ అన్నమాట మాది.
నేను హిట్లర్, పెద్దన్నయ్య, అన్నమయ్య, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి వంటి షూటింగులకు ఔట్డోర్లకు వెళ్లి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి వాళ్లని ఇంటర్వ్యూలు చేసుకుని వచ్చి మేటర్ రాస్తే..
ఆ మేటర్ని టాబ్లాయిడ్ పేజీలో అందంగా అమర్చిపెట్టే వ్యక్తన్నమాట అతను.
ఖర్చులకు జీతాలు సరిపోక నెలాఖరులో చేతిలో రోజుకి 30 చొప్పున మాత్రమే ఖర్చుపెట్టుకోవలసిన పరిస్థితులూ ఫేస్ చేసేవాళ్లం.
చెన్నై టి.నగర్ బస్టాఫ్ దగ్గర శరవణ భవన్‌కి పక్కనే ఓ చవకైన హోటల్ ఉండేది. నెలాఖరు వచ్చిందంటే.. ఇద్దరం రోజుకి రూ. 30తో ఒక ప్లేట్ భోజనం ఆ హోటల్ లో ఉదయం పూట తినేసి సాయంత్రం పస్తులు ఉండేవాళ్లం. అకలి మర్చిపోవడానికి రకరకాల కబుర్లు చెప్పుకునే వాళ్లం. కబుర్లు చెప్పుకునే ఓపిక లేకపోతే ఆకలి మర్చిపోవడానికి పెందలాడే నిద్రపోయేవాళ్లం.
ఇద్దరం ప్రయాణం అలా మొదలైంది..
నాకు సినిమా ఇండస్ట్రీ, అక్కడి తళుకులూ, బెళుకులూ, మనుషుల లోపల ఉండే కుళ్లూ, కుతంత్రాలూ, భజన చేయడాలూ నా మస్థత్వానికి సరిపడవని ఇటు కంప్యూటర్ రంగం వైపు పూర్తిగా మారిపోయాను.
అతను సినిమా రంగంలో కొనసాగుతూ వచ్చాడు..
అతని రంగంలో అతను చాలా ఎదిగాడు.. నా రంగంలో నేను నా వంతు కృషి చేస్తూనే ఉన్నాను.
15 ఏళ్ల తర్వాత ఈరోజు కలుసుకున్నప్పుడు ఎంత సంతృప్తి అంటే… ఆనాటి మా ఆకలి గుర్తులు తలుచుకుని వ్యక్తపరచలేని ఫీలింగ్.
మేము అతని ఆఫీసులో ఉండగా.. ఓ క్యారెక్టర్ అవకాశం కోసం ఓ నటుడు వచ్చాడు..
అతని performance చూపించడానికి తటపటాయిస్తుంటే.. రాంబాబు ఒక్కటే అన్నాడు…. "అతను ఈ సినిమాకి ప్రొడ్యూసర్ లాంటి వాడు" అని నా వద్ద ఆ ఆర్టిస్ట్ వెనుకాడవలసిన అవసరం లేదని చెప్పకనే చెప్పాడు.
నిజంగా లైఫ్ అంటే ఇది… మేము కష్టపడ్డాం, పడుతున్నాం, గర్వపడుతున్నాం, సంతృప్తి పొందుతున్నాం.. ఇంకా చాలా సాధించాలని చాల హార్ట్‌ఫుల్‌గా అనుకున్నాం.
సరిగ్గా ఇదే హార్డ్‌వర్కింగ్ నేచర్ ప్రతీ స్టూడెంట్లోనూ, రకరకాల రంగాల్లో సెటిల్ అవ్వాలని కోరుకునే ప్రతీ వ్యక్తిలోనూ ఉండాలనే నేను ప్రతీ సందర్భంలోనూ సీరియస్ విషయాలే రాస్తుంటాను.
————————————————————–
ఇంకో హాపీ న్యూస్ ఏమిటంటే…
ఇటీవల లవ్లీ సినిమా ఎవరైనా చూశారా..?
లేదా ప్రేమలో పావని కళ్యాణ్? చంటిగాడు..?
ఈ సినిమాలన్నింటి దర్శకురాలు జయ మేడమ్‌ని రాంబాబూ, నేనూ వెళ్లి కలిశాం..
ఈరోజు నేను టెక్నాలజీ మీ అందరికీ అందించగలుగుతున్నానంటే అది జయ మేడమ్ పుణ్యమే. ఆవిడే "టెక్నాలజీ పత్రిక మొదలెడదాం శ్రీధర్" అంటూ సూపర్ హిట్, క్రేజీవరల్డ్ పత్రికలకు సబ్ ఎడిటర్‌గా నేను పనిచేసేటప్పుడు 1996లో అన్నారు.. అలా మొదలెట్టాం.
10-12 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈరోజే ఆవిడని కలిశాం. ఆవిడ చాలా హాపీ.
సునీల్‌తోనూ, ఆ తర్వాత నాగార్జునతోనూ తర్వాతి సినిమాలు చేయబోతున్నానని చెప్పారు.
సినిమా రంగాన్ని నేను వదిలిపెట్టడం గురించి డిస్కషన్ వచ్చినప్పుడు… జయ మేడమ్ ఒకటే అన్నారు.. "నీ మనస్థత్వానికి నీ పాత్ నే కరెక్ట్.. ఇక్కడ చాలా రాటుదేలిపోయి ఉండాలి, మనస్సు చంపుకుని బ్రతకాలి" అని!
సో ఏ మూలో సినిమా రంగానికి దూరం అయ్యానన్న ఫీలింగ్ ఉండేది.. అది కాస్తా ఈరోజు జయ మేడమ్ మాటలతో పూర్తిగా పోయింది.
రియల్లీ ఐయామ్ వెరీ వెరీ వెరీ హాపీ టుడే…
ఇప్పటివరకూ ఎంత పూర్తి పవర్‌తో పనిచేశానో.. అంతకంతా ఈరోజు రీఛార్జ్ అయ్యాను.
ధన్యవాదాలు మై డియర్ ఫ్రెండ్స్..
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
మీ మిత్రునిప్రయత్నములు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని చూసి మీస్నేహితులను అమ్చనావేయవచ్చు గనుక మమ్చి వ్యక్తిత్వం గల రాం బాబుగారికి శుభాకాంక్షలు తెలియజేయండి నాతరపున.
మీ జ్ఞాపకాలు మాతోపంచుకున్నందుకు సంతోషం మీ స్నేహం చిరకాలం ఇలాగే సాగాలని కోరుకుంటూ మీ మితృనికి All the best!
హలో శ్రిదేర్ గారు నేను మీకు ఏకలవ్య శిస్యుడను. పదవతరగతి చదివిన నేను కంప్యూటర్ని ఎవరినా వాడుతుంటే చూసి అనందిచేవాడిని. కేవలం మీ వలన ఈపుడు కంప్యూటర్ గురించి చాల విషయాలు తెలుసుకున్నాను. మీకు ఎంతో రుణపడి వున్నాను. మీ కంప్యూటర్ ఏరా బుక్స్ రొండువేల పది నుండి క్రమం తప్పకుండ చదువు తున్నాను. మీరు ఇలానే ఎన్నో కార్యక్రమాలు చేయాలనీ మా విజయవాడ కనకదుర్గని వేడుకుంటాను. దయచేసి నాకు రిప్లై ఈవండి….తప్పులు వుంటే ఫర్గివె మీ.. మీ ఏకలవ్య శిష్యుడు విజయవాడ………
మల్లి గారు ధన్యవాదాలు మీ అభిమానానికి. తప్పకుండా మీలాంటి మిత్రుల అండదండలతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తాను సర్
Please convey my congratulations to Rambabu for his great efforts and his upcoming movie Angulika.
Again you both guys proved “Kaste Pali”.
It always enormous satisfaction to work and grow in a field we like.