గమనిక: ఓ ఫ్రెండ్‌తో ఫోన్ డిస్కషన్లో నేను వ్యక్తపరిచిన భావాలు యధాతధంగా ఇవి:
ఎదుటి వారి బలహీనతలను ఆధారంగా చేసుకుని బలం పుంచుకో అని చెప్పేవే వ్యక్తిత్వ వికాస గ్రంధాలు….
కొద్దిగా సూక్ష్మంగా ఆలోచిస్తే దీనిలో ఎంత నిగూఢవాస్తవాలు దాగున్నాయో మీకే అర్థమవుతుంది….
"ఎప్పుడూ చిరునవ్వుతో ఉండు.. చివరకు ఎదుటి మనిషి నీ సహనాన్ని పరీక్షిస్తున్నా సరే… ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు" అంటుంది ఓ పర్సనాలిటీ డెవలప్మెంట్ సూత్రం..
100% కరెక్ట్… ఖచ్చితంగా అదే జరుగుతుంది…. మనం నిజంగానే ఆ మూమెంట్ సక్సెస్ అవుతాం…
కానీ…. జీవితం రిస్క్‌లో పడుతున్నది గమనించం..
ఎందుకంటే లోపల్లోపల మండుకొస్తుంటుంది… పైన నవ్వు నటించక తప్పదు… లోపల మంటా.. పైన నటనా.. చివరకు… వంద మంది దగ్గర వంద రకాలుగా కోపాలూ, చిరాకులూ అన్నీ అణిచిపెట్టుకుని నటించీ నటించీ ఆ వత్తిడి భరించలేక చివరకు నిండా ముప్పైఏళ్లు నిండకుండానే హార్ట్ అటాక్‌లతో జీవితాలే అర్పించేస్తున్నారు జనాభా…
మరో పర్సనాలిటీ డెవలప్మెంట్ రూల్ ఇలా చెప్తుంది… "ఎదుటి వ్యక్తి అహాన్ని సంతృప్తి పరుచు… కొద్దిగా తలొంచుకున్నంత మాత్రాన పోయేదేమీ లేదు… అలా తలొంచుకుంటే దెబ్బకి ఎవడైనా దారికొస్తాడు.. పనులు ఇట్టే అవుతాయి.."
మన పనులు అవ్వడం కోసం లోపల బండబూతులు తిట్టుకుంటూ చేతులు కట్టుకుని నిలబడడం ఎంత మానసికంగా మనల్ని కుంగదీస్తుందో ఎంతమందికి తెలుసు?
అలాగే వందమంది నాతో ఉన్నారని గొప్పగా చెప్పుకోవడానికి… అందరి ఇగోలూ శాటిస్ఫై చేస్తూ భజన చేస్తుంటారు కొంతమంది….! ఆ వందమందీ మన ఇగో శాటిస్ఫై కావలసిన రోజున అడ్రస్ లేకుండా మాయమవుతారు… "అవసరానికి పనికొస్తారనుకున్న జనాభా" మాయమయ్యేసరికి ఎక్స్పెక్టేషన్లు తారుమారై ఎంత డిజప్పాయింట్మెంట్ మనకు?
ఒక మనిషిని అర్హత ఉంటేనే పొగుడు… అవసరం కొద్దీ కాదు!!
రేపెప్పుడో యూజ్ అవుతారని ఈరోజు పొగిడేసి… రేపు మీ అవసరం తీర్చమని చెప్తే.. అవతలి వ్యక్తి తీర్చకపోతే తప్పెవరిది?
మనుషులకు చాలానే బలహీనతలు ఉన్నాయి…. వాటిని క్యాష్ చేసుకుని…. నవ్వులు పులుముకుని, మాటలు కోటలు దాటించి.. గొప్పగా బ్రతికేయాలని చూడడం వ్యక్తిత్వ వికాసం కాదు… వ్యక్తిత్వ పతనం!!
"శ్రీధర్ గారూ మీరు ఇంత బాగా ఎలా రాస్తారూ…" అని మీరు నన్ను పొగిడితే… నేను గొప్పగా ఫీలైపోతే… అది నా బలహీనత…!! "కొద్దిగా బుర్రన్న ఎవడైనా ఇలాగే రాయగలడు" అని నేను ప్రాక్టికల్‌గా ఆలోచించకపోతే మీ పొగడ్తలకు పడిపోతాను… రోజూ మీలాంటి ఓ పదిమంది పొగుడుతూ ఉంటే బాగుణ్ణు అని నా పనులన్నీ మానేసుకుని… ఆదర్శాలను వల్లిస్తుంటాను….
ఇలా మనుషుల బలహీనతలను ఆధారంగా చేసుకుని… వారిని మభ్యపుచ్చి.. ఓ నవ్వుతోనో, ఓ హగ్ తోనో, ఓ భుజం తట్టడంతోనో లేదా ఓ బాడీ లాంగ్వేజ్ టెక్నిక్తోనో, లేదా ఓ పెర్ఫ్యూమ్ గుబాళింపుతోనో, లేదా ఓ డ్రెస్సింగ్ స్టైల్తోనో, ఓ ఎక్స్ప్రెషన్తోనో… జనాల్ని మోసం చేయడం సాఫ్ట్ స్కిల్లూ కాదు.. వ్యక్తిత్వ వికాసమూ కాదు… ఎదుటి వ్యక్తిని మన నటనతో మరింత మోసం చేసి… మనం గొప్పగా బ్రతికేయడం అవుతుంది.
ప్రతీ మనిషికీ తాను చేసే ప్రతీ పని గురించి ఓ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది.. లేదా బెటర్‌గా perform చెయ్యలేకపోతున్నానేమో అన్న డిజప్పాయింట్మెంటూ ఉంటుంది… లేదా తాను చేస్తున్నది తప్పేమో, సొసైటీ, మనుషులూ accept చెయ్యరేమో అన్న గుబులు ఉంటుంది…
సరిగ్గా ఈ గుబులుని ఆధారంగా చేసుకునేI am OK, you are OK కాన్సెప్టులు పుట్టుకొచ్చాయి…
ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కలిగి ఉండడం ఓ బలహీనత! దాన్ని సరిచేయాల్సింది పోయి.. "You are great Man" అని పొగిడేస్తే.. వాడికి ఉన్న భయం ఆ కాసేపు మాత్రమే పోతుంది… మళ్లీ భయం వచ్చేస్తుంది… రోజూ మనలా పొగిడే జనాభా కోసం పనికిమాలిన పనులన్నీ చేస్తూ.. తన బ్రతుకు తాను బ్రతకడం మానేసి అవసరం లేని జనాల పొగడ్తల కోసమో, సోషల్ స్టేటస్ కోసమో బ్రతకడం మొదలెడతాడు….
అంటే మన వ్యక్తిత్వ వికాస మెళుకువలు మనుషుల్ని మోసపుచ్చి వారి బ్రతుకు వారినీ బ్రతకనీయకుండా చేస్తున్నాయి… అలా పనికిమాలినోడినీ పొగిడేసి మోసపుచ్చుతున్నామే అన్న వత్తిడిని మనలోనూ పెంచేసి.. నిండు నూరేళ్ల మన బ్రతుకునీ బ్రతకనీయకుండా చేస్తున్నాయి…
ఎందుకొచ్చిన గోల చెప్పండి… సహజంగా బ్రతకడం మానేసి… రాని నవ్వులు పులుముకుని నటించడం!
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
ఏ పరిస్తితులనైనా ఎదుర్కునే మనస్తత్వం ఇంప్రూవ్ కావడమే వ్యక్తిత్వ వికాసం. అది మెళుకవలతో మాత్రమే సాధ్యం కాదు. సమాజం అనే దానిని వదిలేసి వ్యక్తిగా వికాసం చెందడం నేర్పేది వ్యక్తిత్వం కాదు వికాసం అంతకన్నా కాదు. ఆచరణకు అసలు పనికి రాదు కూడా. శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్లు ఫలితం అనేది నీ చేతిలోనో, నీ మెళకువలతోనో రాదు. ఫలితం అనేది సమిష్టి కృషి. అందులో నీ వంతు వరకూ మాత్రమే నీవు చేయగలిగింది. అది చేయకుండా పరారు కాకూడదు. ఎదుటివారికి,ప్రక్రుతికి హాని కలిగించకుండా, ప్రక్రుతిని వాడుకుంటూ ఎల్లప్పుడూ అన్ని పరిస్తితులనూ సమానంగా ఎదుర్కోగలిగే స్తితిని పొందగలగడమే వ్యక్తిత్వవికాసం. వ్యక్తిత్వం , వ్యక్తిత్వ వికాసం ఉంటుంది. కానీ నేడు వ్యక్తిత్వ వికాసం అనే సబ్జెక్ట్ కూడా చదువు మాదిరిగానే ఆదాయం పెంచే ఓ సరుకుగా మారిందనేది నిజం. పెద్దల మాటలలో , సంస్కృతీ సాంప్రదాయాలలో, నీతి కథలలో అన్నింటా ప్రతి అనుభవం లో వెతికి చూస్తే వ్యక్తిత్వ వికాసం లభిస్తుంది.
కృతిమంగా వికశింపజేయాలనిచూస్తే వ్యక్తిత్వమే కాదు వ్యక్తికూడా లేకుండా పోతాడు. బాగుంది మీ విశ్లేషణ