ఎవరు గొప్పైతే ఏంటి? ఎవరి మాట నెగ్గితే ఏంటి..? ఫస్ట్ మనకు కావలసింది మనిషి. ఈ బేసిక్ fact అర్థం కాకే చాలామంది జుట్టుపీక్కుని మరీ వాదించుకుంటున్నారు.
దీనివల్ల ఎంత అస్థిమితంగా తయారవుతున్నామో ఆలోచించండి..
“నేను పాదాలు పట్టుకోవడానికైనా సిద్ధం.. నువ్వు సంతోషంగా ఉంటానంటే.. తద్వారా నన్ను సంతోషంగా ఉంచుతానంటే”!! – ఇది డైలాగ్ కాదు. నూటికి నూరుశాతం నేను నమ్మే ఏక వాక్య సిద్ధాంతం.
జనాలు వాళ్ల ఫూలిష్‌నెస్ కొద్దీనో, అమాయకత్వం కొద్దీనో మిమ్మల్ని చులకన చేస్తున్నారు సరే.. వాళ్లు చెప్పిందే వినమని డిమాండ్ చేస్తున్నారు సరే.. పోనీయండి.. వాళ్లకి కావలసిన సంతృప్తిని ఎందుకు మనం కాదనాలి?
మహా అయితే మైండ్ గేమ్‌లో ఓడిపోవడం లాంటిదే. అంతకుమించి ఏం మట్టీమశానం లేదు. దీని కోసం జీవితాలు జీవితాలూ వాదనలు, పంతాలూ, పట్టింపులూ, ఇగోలూ.. మనుషుల మొహాల వెనుక మృగాలు తచ్చాడుతున్నట్లు లేదూ…? అవసరమా ఇది మనకు?
“నాకేం తెలీదు” ఈ ఒక్క మాట ఎప్పుడు ఒప్పుకోగలిగినా ఈ సొసైటీలో ఉన్న సగం సమస్యలు తొలగిపోతాయి. జనాలు జీవితాలు జీవితాలు తమకు అన్నీ తెలుసని నిరూపించుకోవడానికే వృధా చేస్తున్నారు.. వాళ్లకు నిజంగా ఎంత తెలుసో లేదో తెలుసుకోకుండానే.. ఎందుకు వందల చోట్ల, అవసరం లేని పనికిమాలిన విషయాల్లో అరకొర నాలెడ్జ్ అడ్డుపెట్టుకుని వాదించేస్తూ విలువైన జీవితాన్ని ఆవేశంతో ముగించేయడం?
అలాగే మనుషుల దగ్గర విజిటింగ్ కార్డులూ, డెజినేషన్లూ, మెడల్సూ, అవార్డులూ అన్నీ పక్కన పడేసి వినయంగా ఒదిగిపోలేని జీవితం ఎందుకు?
ఒక్కటి మాత్రం నిజం.. ఎవరు గొప్పో, ఎవరు చెప్పేది కరెక్టో తెలుసుకునే లోపే అందరి ప్రాణాలూ అవిరవుతున్నాయి.. ప్రాణాలు పోయే లోపే మనుషుల్ని ఒప్పుకోండి.. వాళ్ల గొప్పదనాన్ని ఒప్పుకోండి.. వాళ్ల మూర్ఖత్వాన్ని ఒప్పుకోండి.. వాళ్ల అమాయకత్వాన్ని పెద్ద మనస్సుతో ఒప్పుకోండి. అప్పుడే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.
– నల్లమోతు శ్రీధర్
Hi Sridhar garu
Okemaatla lo cheppalante,
manushyula gurinchi samajam gurinchi niswardam ga kastapade vallalo emadhaya kalamlo nenu kevalam mugguru vyakthulne choosanu Sridhar gaaru,
Vere vallu kooda vuntaaru, But nenu choosina vallalo naa guruvulu ga bhavinche vallalo meeru, Chaganti koteswara rao garu, JD Lakssmi Narayana garu,