“మారుతున్న జనరేషన్‌తో పాటే మనమూ మారాలి..” అని చాలామంది ప్రయాసపడి మరీ మారుతుంటారు..
మార్పు అనేది అవసరం అయినప్పుడు మాత్రమే స్వీకరించాలి.. ఓ కొత్త మార్పు మనల్నీ, మన చుట్టూ ఉన్న మానవ సంబంధాల్నీ, సమాజాన్నీ, వ్యవస్థనీ నాశనం చేసేదైతే ఆ మార్పు ఎంత మోడ్రర్న్గా ఉన్నా అస్సలు ఎంటర్టైన్ చెయ్యకూడదు.
దురదృష్టవశాత్తు… జనరేషన్ గ్యాప్ చాలామంది పేరెంట్స్, పెద్దవాళ్లూ తట్టుకోలేకపోతున్నారు… పిల్లలు చాలా ఫాస్ట్‌గా ఉంటుంటే… ఆ ఫాస్ట్ కల్చర్‌కి తగ్గట్లు పరిగెత్తాలేకా.. “ఎక్కడ పిల్లలు చాదస్తపు మనుషులు”గా ట్రీట్ చేస్తారోనని ఫాస్ట్‌గా ఉన్నట్లు అపసోపాలు పడి నటిస్తున్నారు.. ఇలా పిల్లల దగ్గర తాము మార్కులు కొట్టేయడానికి ట్రై చేస్తున్నారు తప్పించి పిల్లలు చేసే తప్పులను సరిదిద్ది వారిని కరెక్ట్ చేసే ప్రయత్నాలేమీ చెయ్యట్లేదు.
————
“అలాగే వయస్సు కన్పించకూడదు, ముసలివాళ్లమైపోతున్నామన్న ఫీలింగే మనస్సుకి రాకూడదు… చాలా అందంగా, ట్రెండీగా కన్పించాలి..” వంటి ప్రయత్నాల దగ్గర పెద్ద మనుషులు అటు యూత్‌లోనూ కలవలేక, అటు పెద్ద వయస్సు వాళ్లతోనూ చులకన చేయబడుతూ ఆపసోపాలు పడుతున్నారు.
ఒకప్పుడు పెద్దరికం, హుందాగా ఉండడం గౌరవం తెచ్చిపెట్టేది. ఇప్పుడు పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ గొప్ప పనిచేస్తున్నామని భుజాలు చరుచుకుంటున్నారు గానీ ఆ పిల్లలూ పెద్దల్ని కనీసం గౌరవం ఇవ్వకుండా బఫూన్లలా చూస్తున్నదాన్ని జీర్ణించుకోలేక లోపల్లోపల మధన పడుతూనే ఉన్నారు.
——————–
మారుతున్న సమాజంతో పాటు మారడం అంటే… చీరలూ, షర్ట్లూ మానేసి sick pack బాడీలకు టీషర్టులూ, జీన్స్లూ తగిలించుకోవడం కాదు.. అలాగే బూతు సినిమాల్ని చూస్తూ “ఇప్పుడంతా ట్రెండ్ ఇదే.. దీనిలో తప్పేముంది” అని కుర్రాళ్లకు బుద్ధులు నేర్పించాల్సింది పోయి చూసీచూడనట్లు వదిలేయడం కాదు. పిల్లలేం శ్రుతిమించి తప్పు పనిచేసినా కక్కాలేకా మింగాలేక ఓ నవ్వుతో దులిపేసుకోవడం కాదు.
పిల్లలు ఓ పెద్ద తప్పు చేస్తే చెంపమీద లాగి ఒక్కటి కొట్టే స్వేచ్ఛ ఎంతమంది తల్లిదండ్రులకు ఉంది?
అలా తల్లిదండ్రులు కొడితే తమ మంచికే కొట్టారని ఆత్మపరిశీలన చేసుకునే పిల్లలెంతమంది ఉన్నారు?
మారాలి…. మంచిని నిలుపుకుంటూ చెడుని కడిగేస్తూ ముందుకు మారాలి తప్ప చెడును సమర్థించుకుంటూ అదే మార్పు అని భ్రమించుకుంటూ కాదు!!
ఏ పేరెంట్ అయినా, ఏ స్టూడెంట్ అయినా దీన్ని చదివి సక్రమంగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
– నల్లమోతు శ్రీధర్
Chaalaa baagundi :-):-)
100% correct
మీ రన్నది వాస్తవం. అనూహ్య విషయమే తీసుకోండి. కేసు ఇప్పుడు తిరిగిన మలుపులో బయట పడుతున్న విషయాలు తలిదండ్రులకే తెలియవు. యెంత నరకం, జరిగిన భీబత్సం కన్నా ఇప్పుడు బయట పడుతున్న విషయాల్ని యెలా జీర్ణించుకోవాలి ఆ తలిదండ్రులు? మారకూడనంతగా మారి పోయినట్టున్నాం. పది మందే కావచ్చు కోటాను కోట్ల మందే కావచ్చు, ఒకచోట కలిసి బతుకుతున్నప్పుడు ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతూ సాగుతున్న్నప్పుడు పనికి రాని పాత వాట్ని వదిలెయ్యటం పనికొచ్చే కొత్తవాట్ని అలవాటు చేసుకోవటం మంచిదే.దాన్ని కాలం తో వచ్చే మార్పుగా సరిపెట్తుకొవచ్చు.
కానీ వదలకూడని వాట్ని కూడా వదిలేసినట్టున్నాం.ముఖ్యంగా విలువలూ వలువలూ వాటంతటవి జారిపోవు,వాటంతటవి మనల్ని పట్టుకుని ఉండవు.సినిమాల్లో హీరోయిన్ల వలువలు జారిపోవటానికీ జీవితాల్లోంచి విలువలు పారిపోవటానికీ సంబంధం ఉన్నట్టుంది, యెందుకంటే అవి సమాంతరంగా జరుగుతున్నాయి.గాడ్జెట్స్ ని చూసుకుని ఇదే ప్రగతి అనుకుంటూ సంస్కారంలో మాత్రం వెనక్కి అంటే రాక్షస యుగం లోకి నడుస్తున్నాం,యెందుకో?