చేయాల్సిన పని ఏదైనా….
చేసే పని ఏదైనా…..
గాలికొదిలేసి ఎక్కడెక్కడో ఏవేవో ఆలోచనల్లో, ఆందోళనల్లో, ముచ్చట్లలో…మునిగి తేలితే ఎన్ని ఇన్స్పైరింగ్ కొటేషన్లు బ్రెయిన్లో ఉన్నా నాలిక గీసుకోవడానికి కూడా పనికిరావు…
జీవితం దర్జాగా జీవించి చూపించాల్సింది… కబుర్లు చెప్పుకుంటూ దాటవేసేది కాదు…!
పనిచేయాలంటే అలసిపోయినట్లుంటుంది…. 🙂 అంటే తెలీని బద్ధకం వంటి నిండా ఎక్కేసిందన్నమాట…
కళ్లూ, కాళ్లూ, చేతులూ, కదలికలూ లేని వాళ్లే గొప్పగా జీవించేసి మనల్ని ఎగతాళిగా చూస్తుంటే మనకు ఏమాత్రం సిగ్గేయట్లేదు… కానీ అవసరం లేని పంతాలకూ, రోషాలకూ, ఇగోలకు మాత్రం చాలా బాధపడిపోతాం…
ఎక్కడ ఇరుక్కుపోయిందో లైఫ్ ఆగి గమనించి… ముందుకు సాగకపోతే ఎలా…?
కాలక్షేపం అవ్వక దారిన పోయే వాళ్లతో కబుర్లు చెప్తూ ఎలాగోలా బ్రతికేసే ముసలమ్మకూ…. మనకూ తేడా లేకుండా చేసేసుకుంటున్నాం….
కొన్ని కోట్ల పిండాలు రకరకాల కారణాలతో తల్లి గర్భం నుండి లోకాన్ని చూడలేకపోతున్నాయి…
అదృష్టం బాగుండీ లోకంలోకి వచ్చి పడ్డ మనమూ ఎందుకూ పనికిరాని జీవితాన్ని జీవించేస్తే…. అడుగడుగుకీ కారణాలు కావాలి… ఎస్కేపిజాన్నీ సమర్థించుకోవడానికీ!
నేనింతే బ్రతుకుతాను…. నా లైఫ్ నా ఇష్టం… అని అందరితో మొండిగా చెప్పేసుకుంటూ లోపల్లోపల చేతకానితనానికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లు పెంచుకోవడం ఇబ్బందిగా లేదూ…
రేపుంటుందో లేదో తెలీదు.. ఇవ్వాళా, ఈ క్షణం మాత్రం ఉంది…. ఏం ఊడబొడవగలమో చేసి చూపిద్దాం….
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply