ఏళ్ల తరబడి మైండ్లో పేరుకుపోయిన డిజప్పాయింట్మెంట్లు, వైఫల్యాలూ, నెగిటివ్ ఎమోషన్లు తెలీకుండానే మన మైండ్లో ఓ భాగమైపోతాయి. ఈరోజు మనలో చాలామంది బాధపడనిది సుఖంగా ఉండరు… తినడానికి తిండి ఉన్నా.. ఈ క్షణానికి అంతా హాపీగా ఉన్నా కూడా ఏదో గుర్తు తెచ్చుకుని బాధపడిపోతుంటారు. దీనికి కారణం మనలో పేరుకుపోయిన అసంతృప్తి.
ఈ క్షణం బాధ మరుసటి క్షణం మర్చిపోతే ఏ గొడవా లేదు. కానీ అయిపోయిన బాధ జీవితాంతం వెంటాడుతుంది. మనమేదో కోల్పోయాం.. మనకు అన్యాయం జరుగుతోందీ.. లైఫ్ అస్సలు బాలేదు వంటి ఫీలింగులతో మనకు తెలీకుండానే మనలోని అసంతృప్తి తన ఉనికిని తాను పెంచిపోషించుకుంటూ ఉంటుంది. మనం హాపీగానే ఉండాలనుకుంటాం. కానీ మనలోని అసంతృప్తి మాత్రం మన సంతోషాన్ని ఎంటర్టైన్ చెయ్యనివ్వదు. మన లైఫ్ నాశనం అయిపోయిందన్న భ్రాంతిని నిరంతరం కలిగిస్తూ జీవితాంతం ఆ అసంతృప్తి చెక్కుచెదరకుండా ఉండేలా రగిలించుకుంటుంది.
అందుకే మనం ఎంత ప్రయత్నించినా బాధల్లోనే ఉంటాం.. కష్టాల్లోనే ఉంటాం.. డిజప్పాయింట్మెంట్లలోనే ఉంటాం. ఈ క్షణం హాపీగా ఉన్నా నిన్నటి గాయమో, రేపటి భయమో గుర్తు చేసుకుని మళ్లీ ఇన్సెక్యూర్డ్ ముసుగులో దూరిపోతుంటాం. ఈ మొత్తం డ్రామాని వదిలించుకోవాలంటే ఒక్కటే మార్గం…. మనం ఫీలవుతున్న డిజప్పాయింట్మెంట్ అంతా ఓ కల్పన అన్నది గ్రహించి… మన బ్రెయిన్లో కదలాడే థాట్స్ని నిశితంగా పరిశీలించడం మొదలెడితే డిజప్పాయింట్మెంట్ మాయమవడం మొదలవుతుంది. తాను క్రియేట్ చేసిన తప్పుడు భ్రాంతిని అంత నిశితంగా గమనించడాన్ని తట్టుకోలేదు డిజప్పాయింట్మెంట్ అనేది. సో మెల్లగా అది డైల్యూట్ అవుతుంది.
పై మేటర్ అర్థం కాకపోతే ఒకటికి పదిసార్లు చదవండి.. చాలా గొప్ప టెక్నిక్. ఎన్నో రకాల మానసిక, శారీరకమైన painsని ఎదుర్కోవడానికీ, భయాల్నీ, బాధల్నీ క్షణాల్లో అధిగమించడానికీ ఉపయోగపడే టెక్నిక్. ఏ ఫీలింగ్కైనా ఆహారం కావాలి. ఆ ఆహారం మనం పుష్కలంగా ఇచ్చినంత కాలం అది కొండలా పెరిగిపోతుంది. ఎప్పుడూ ఏడుపు మొహం పెట్టుకునే వాడి బ్రెయిన్.. ఏ క్షణమైనా వాడు హాపీగా ఫీలయినా దాన్ని accept చెయ్యలేదు. వెంటనే ఏదో ఒకటి గుర్తు తెచ్చేసి వాడిని మళ్లీ ఏడ్చేలా చేస్తుంది. నెగటివ్ మైండ్సెట్ ఉన్న వాళ్లు స్పృహని కోల్పోయి నిరంతరం అవే నెగటివ్ ఆలోచనలు చెయ్యడం ద్వారా తమలో పేరుకుపోయిన నెగటివిటీనే జీవితాంతం పెంచి పోషించుకుంటూ ఉంటారు. ఒక్క క్షణం ఆగి.. అసలు ఎక్కడ తప్పు జరుగుతోందో గమనించి.. ఎందుకు కాస్త కూడా సంతోషాన్ని ఫీల్ కాలేకపోతున్నామో అర్థం చేసుకుని.. నెగిటివిటీని అలా తీక్షణంగా అబ్జర్వ్ చేస్తూ పోతే అది కరిగిపోతుంది.
జీవితం ఉన్నది సంతోషంగా గడపడానికి. మనం రోజూ చేసే ప్రతీ పనీ సంతోషంగా కూడుకున్నదీ.. సమస్యల్లా మనం ఆ పనుల్లో బాధని మాత్రమే ఐడెంటిఫై అవుతున్నాం.. అందుకే మనకిన్ని బాధలు. సంతోషంలో ఐడెంటిఫై అయితే జీవితాన్ని అద్భుతంగా మార్చే సంతోషమే మిగులుతుంది.
– నల్లమోతు శ్రీధర్
How did I miss this?, there r answers to many questions…alochana cheyyalsinde..thank you
That’s wonderful thought provoking message brother.
thanks a lot