ఇక్కడ మీరు చూస్తున్నది నా మీద నేను ప్రయోగం చేసుకున్న పూర్తి సైంటిఫిక్ డేటా! Mendi అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ న్యూరో ఫీడ్ బ్యాక్ బ్రెయిన్ ట్రైనింగ్ డివైజ్. వాస్తవానికి స్పోర్ట్స్ పర్సన్స్, సింగర్స్ లాంటి వారు అంతర్జాతీయంగా ఒక రూమ్ పరిమాణంలో ఉండే న్యూరో ఫీడ్ బ్యాక్ ఎక్విప్మెంట్ ముందు తలకి కొన్ని క్లిప్స్ పెట్టుకుని ఒక్కో సెషన్‌కి భారతీయ కరెన్సీలో లక్షా, రెండు లక్షలు ఖర్చుపెట్టి ఇప్పుడు నేను చేసిన బ్రెయిన్ ట్రైనింగ్ సెషన్స్ తీసుకుంటూ ఉంటారు. దాంతో వారి పనితీరు మెరుగుపరుచుకుంటారు.
అలాంటిది పోర్టబుల్ మోడల్‌గా యూరోపియన్ యూనియన్ చేత ఫండింగ్ చెయ్యబడి కొంతకాలం క్రితం ఐడియా రూపంలో ఉన్న మెండి బ్రెయిన్ ట్రైనింగ్ ప్రాజెక్టుకి అందరికంటే ముందే క్రౌడ్ ఫండింగ్‌లో నేను కంట్రిబ్యూషన్ చేసి ప్రపంచంలో ఈ డివైజ్‌ని మొదట్లో వాడిన అతి కొద్ది మందిలో ఒకడిని అయ్యాను.
ఇక అసలు విషయానికి వస్తే.. ఇది మన బ్రెయిన్లోని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్కి రక్త సరఫరా, ఆక్సిజెన్ సరఫరా ఎలా జరుగుతోంది అన్నది రియల్ టైమ్‌లో పరిశీలిస్తూ న్యూరల్ యాక్టివిటీ గ్రాఫ్‌ని చూపిస్తూ ఉంటుంది.
ఉదా.కి.. నేను ఈ డివైజ్‌ని తగిలించుకుని కోపమో, భయమో, బాధో పడుతుంటే న్యూరల్ యాక్టివిటీ విపరీతంగా తగ్గిపోతుంది. లేదా రకరకాల ఆలోచనల్లో కంట్రోల్ లేకుండా ఉంటే కూడా న్యూరల్ యాక్టివిటీ తగ్గుతుంది. సో నేను మెడిటేషన్ చెయ్యక ముందు కేవలం 22% మాత్రమే ఉన్న న్యూరల్ యాక్టివిటీ, శూన్య మెడిటేషన్ చేసి.. No Mind stateలో కనీసం ఒక్క ఆలోచన కూడా కాన్షియస్ గా లేకుండా స్థిరంగా Mendiని ఉపయోగించి 10 నిముషాల పాటు ఆ No Mind స్థితిలో కొనసాగాక నా న్యూరల్ యాక్టివిటీ ఏకంగా 38 శాతానికి పెరగడం గమనించవచ్చు.
ఈ బ్రెయిన్ ట్రైనింగ్ డివైజ్ ద్వారా ఇప్పుడు ఉన్న స్థితిని మళ్లీ మళ్లీ రిపీట్ చెయ్యడం ద్వారా బ్రెయిన్లో ఆయా ప్రదేశాల్లో ఉన్న న్యూరాన్స్ కి మధ్య న్యూరల్ నెట్వర్క్ బలోపేతం అయి ఏ పనిచేస్తున్నా చాలా ప్రశాంతంగా ఉండే స్థితికి చేరుకోవచ్చు. చాలావరకూ నా కామ్నెస్కి మెడిటేషన్ తో పాటు ఈ Mendi ట్రైనింగ్ ప్రధాన కారణం.
– Sridhar Nallamothu