శరీరంలో ఎక్కువ ఏ organని ఉపయోగిస్తే అది ఎంత ఏక్టివ్‌గా ఉంటుంది.
మన సమస్యలతో పాటు ప్రపంచ సమస్యల్నీ నెత్తినేసుకుని తిరగడం వల్ల మెదడు చాలా షార్ప్‌గా మాటలకు లాజిక్‌లు అందిస్తోంది 🙂 సో బ్రెయిన్ పెరుగుతోంది.. శారీరక శ్రమ తగ్గిపోయి మానసిక శ్రమ విపరీతంగా పెరగడం వల్ల.. మనస్సు ఆహ్లాదంగా ఉంచుకోవడంపై ఏమాత్రం శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ప్రతీ ఒక్కరూ అసంతృప్తులగానో, కంప్లయింట్లు చేసే వారుగానో, తెలీని శాడిస్టిక్ మాటలూ, ఛేష్టలతోనో మానసిక రోగులుగా మిగిలిపోతున్నారు.
శరీరాలు పిప్పిళ్ల బస్తాల్లా కుర్చీల్లో కుదేయబడి రోజుల తరబడి మూలుగుతూ ఉండడం వల్ల వంపులన్నీ మాయమై ఒక్కొకరు డబుల్ సిలెండర్లలా తయారవుతున్నారు.. 😛
ఇది ఎవరి మనోభావాలనూ కించపరచడానికి రాసింది కాదు… మన జీవన శైలిలో మార్పు రాకపోతే కొన్నాళ్లకు ఎలాగైతే అపెండిసైటిస్ అనేది పనికిరాని ఆర్గాన్‌గా మారిపోయిందో జన్యుపరంగా ముందు తరాలకు మనిషి శరీరంలో ముఖ్యమైన అవయువాలు క్షీణించిపోతాయి. బలహీనమైన కాళ్లు, బలహీనమైన చేతులు.. శక్తివంతమైన మెదడు.. ఎక్కడలేని కొవ్వూ ఇవి చాలా సహజమయ్యే తరాలు ఎంతోకాలంలో లేవు.
అంతరించిపోతున్న జీవుల గురించి జీవవైవిధ్య సదస్సుల్లో చాలా చెప్పుకుంటున్నాం..
కొన్ని తరాల తర్వాత అంతరించిపోయిన మానవ అవయువాల గురించీ సదస్సులు నిర్వహించుకుంటామేమో 😛
– ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply