ఎప్పుడైతే “కుటుంబ సభ్యులూ, బంధువులూ మన మనస్థత్వానికి పడరు..” అన్న ఫీలింగ్ వచ్చేస్తుందో ఆటోమేటిక్‌గా చాలామందికి రిలేషన్ల మీద నమ్మకం పోతుంది…
“వీళ్లంతా లేకపోతే నాకేంటంట.. నా బ్రతుకేదో నేను బ్రతకలేనా…. ” అన్న పంతమూ మొదలవుతుంది.
—————
రాజకీయాలు దేశంలోనే కాదు కుటుంబాల్లోనూ ఉంటాయి. ఆ మాటకే వస్తే ఏ మనిషీ పర్ఫెక్షనిస్ట్ కారు.. ఎవరి లోపాలు వారికుంటాయి.. మన ఫ్యామిలీ మెంబర్స్లోనే కొందరు మనల్ని చూసి నవ్వుతారు, కొందరు సమర్థిస్తారు.. కొందరు వాళ్లకి కావలసినవన్నీ చేసిపెడితే మనకు సపోర్ట్‌గా నిలుస్తారు.. మరికొందరికి చిన్న చిన్న ఇగోలూ…
కుటుంబం అంటే వాటిని భరించడం చేతనవ్వాలి… అంతే తప్ప “నాకు ఈ తలనొప్పులన్నీ అవసరం లేదు.. నాకు ఈ మనుషులెవ్వరూ అవసరం లేదు..” అనుకుంటే అది గొప్పదనం కాదు.. మనుషులతో ఒద్దికగా బ్రతకడం చేతకానితనం!
ఒకప్పుడు 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ రకరకాల మెంటాలిటీలు భరించలేమనుకున్నాం.. సరే… ఇప్పుడు అమ్మా, నాన్నా, పిల్లలున్న నలుగురు కూడా కలిసి ఉండలేని స్థితికి వచ్చేసాం… చివరకు అస్సలు పిల్లలే వద్దు ఇద్దరం బ్రతికేస్తే చాలు అనుకుంటున్నాం…. ఆ ఇద్దరూ ఒకరికొకరు పడక విడిపోతున్న దౌర్భాగ్యమూ పడుతోంది… అంటే తప్పెవరిది? మనం దూరం పెట్టేస్తున్న కుటుంబ సభ్యులదా? మనదా?
అందరికీ దూరంగా జరిగిపోయి సుఖంగా ఉంటున్నామనుకుంటున్నాం…. అది భరించలేని ఒంటరితనానికి నాంది అన్నది అర్థం కావట్లేదు!!
ఒంటరి జీవితాల్లో నమ్మశక్యం కాని కొత్త పరిచయాల్ని, పొగడ్తలను విని ఆశలు పెంచుకుని… “మనుషులంటే ఇలా ఉండాలి.. మా ఇంట్లోనూ ఉన్నారు.. అస్సలు అర్థమే చేసుకుని చావరు..” అని తిట్టుకోవడం అమాయకత్వం!
పది రోజులు కొందరు ఒక ఇంట్లో కలిసి ఉంటే అర్థమవుతుంది… అన్ని పొగడ్తలూ ఆవిరవుతాయి.. ఆకర్షణలూ ఆవిరవుతాయి.. కొత్త రిలేషన్లపై ఉన్న మోజూ తీరిపోతుంది.
జీవితం అంటే ఎప్పుడూ కొత్త వాటిని వెదుక్కోవడం కాదు.. పాత వాటిలోని లోపాల్ని క్షమించేసి… గొప్పగా ఆస్వాదించేయడం!!
ఇంట్లో ఉన్న వాళ్లు ఎప్పుడూ తక్కువ కాదు…. మనకంటూ ఎవరైనా ఉన్నారంటే మొదట వాళ్లే…. కాకపోతే వాళ్లని చిన్నప్పటి నుండి చూసీ చూసీ… వారి మాటలు వినీ వినీ, వారి అరుపులు భరించీ… అదంతా ఓ రొటీన్‌గా అలవాటైపోయిందంతే.. వారిలో కన్పించని కొత్తదనాన్ని వేరేచోట వెదుక్కోదలుచుకుంటే…. ఆ వేరే చోటూ కొన్నాళ్లకు పాతదే అవుతుంది.
చివరకు మనకు ఎక్కడా సంతృప్తి మిగలదు.
– నల్లమోతు శ్రీధర్
Superb Sir, Really awesome….It’s True
well said sir 🙂