Strong Desire అనేది ఎప్పుడూ పట్టలేనంత ఆనందాన్నో, తట్టుకోలేనంత దుఃఖాన్నో ఫలితంగా ఇస్తుంది. End Result ఆనందమైతే ఆ ఆనందం మరో దుఃఖానికి దారితీయడమూ.. దుఃఖం మరో ఆనందంలో మర్చిపోబడడమూ చాలా కామన్.
మన desires ఎక్కువ మనుషులతోనో, వస్తువులతోనో ముడిపడి ఉంటాయి. మెటీరియల్స్ ఇచ్చే సంతోషం మనుషులతో వచ్చే దానితో పోలిస్తే చాలా తక్కువ timeframe కలిగి ఉంటుంది. అందుకే ఏదైనా వస్తువు కొన్నా అది నలుగురితోనూ పంచుకుంటే వచ్చే ఆనందాన్నే ఆస్వాదిస్తుంటారు తప్పించి వస్తువు వల్ల పెద్దగా ఆనందం రాదు.
ఇక్కడ మనుషులు మన బలం, మన బలహీనతా కూడా! జీవితాంతం మనుషుల్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు కోసం మనం పడే తపనే మనం సృష్టించుకునే “నరకం” ఈ భూమ్మీద! యెస్.. మనుషుల కోసం మనం రకరకాల వేషాలు వేస్తాం.. మనల్ని మనం మర్చిపోయి, మన సహజస్వభావాన్ని పక్కన పెట్టి.. మన ఇష్టాఇష్టాలను, అభిప్రాయాలనూ.. ఆలోచనలను.. భావోద్వేగాలనూ అన్నింటినీ పక్కనపెట్టి చుట్టూ ఉన్న మనుషులకు ఎలా నచ్చుతుందో అలా మేకప్ వేసుకుంటాం.
People tries to influence us alot. “నువ్వు ఇలాగే ఉండాలి” అనే వాడు ఒకడు.. “నువ్వు ఫలానా మనుషుల్ని మాత్రమే ఎంటర్టైన్ చెయ్యాలి…” అని పరిధులు గీచేవాడు ఒకడు.. “ఇలా మాత్రమే ఆలోచించాలి..” అని బ్రెయిన్‌లోకి చొచ్చుకువచ్చి ఆలోచనల్నీ తన వైపు మళ్లించుకునే వాడు ఒకడు. ఇలా ఏకంగా మన అస్థిత్వమే, మన సహజత్వమే పోగొట్టుకుని ఏం కావాలో, ఎలా బ్రతకాలో, అసలు మన గమ్యమేమిటో తెలీక గుడ్డిగా రోజులు గడిపేసే లైఫ్‌లు మనవి!
అయిపోయిందేదో అయిపోయింది… ఇకనైనా లైఫ్‌ని మీ కంట్రోల్లోకి తీసుకోండి.. ఎవడి మెచ్చుకోళ్లూ, acceptanceలూ మనకు అవసరం లేదు. ఎవడో ఆవేశంగా తిడుతున్నాడు.. ఇంకెవడో విషాన్ని కక్కుతున్నాడు.. మరెవడో ఓర్వలేక చులకనగా మాట్లాడుతున్నాడు…. మరొకడెవడో అజ్ఞానంతో కళ్లు మూసుకుపోయి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు… వీటన్నింటికీ ఒక్కటే సమాధానం ప్రశాంతమైన ఫేస్.. చెరగని చిరునవ్వు!
యెస్.. హాయిగా నవ్వండి.. ఎవడి నెగిటివ్ ఎమోషన్లని వాడికే ఆ నవ్వుతో రిటర్న్ reflect చెయ్యండి. అది తట్టుకోలేక నెగిటివిటీ కుమ్మరించడం ఆపేస్తారు.
నిజమే మనం మనుషులం.. రుషులం కాదు.. కోపాలొస్తాయి.. మనసు గాయపడుతుంది… కానీ ఎంతసేపు అలా? రోజులు రోజులు కుంగిపోతూ, ఆవేశపడుతూ, డిజప్పాయింట్ అవుతూ కూర్చోవాలా? ఎంత గొప్ప బాధనైనా అరగంటలోనో, మహా అయితే గంటలోనో మర్చిపోయి వేరే పనిలో పడిపోయే నైజం అలవర్చుకోండి. జీవితం హాపీగా ఉంటుంది.
అలాగే ఎప్పుడూ నీ desire మనుషులను సంపాదించుకోవడమూ.. వాళ్లని కాపాడుకోవడమూపై ఫోకస్ అయి ఉండకూడదు. మనం చేసే పనుల్ని, మన ఆలోచనల్ని చూసి మనుషులు వస్తారు, అవే పనుల్ని చూసి కంటిన్యూ అవుతారు.. అవి అర్థం కాని వారు వెళ్లిపోతారు తప్పించి.. అన్ని పనులూ ఆపేసి మనుషులను సంపాదించుకోవడం కోసం నీ సహజత్వాన్ని మార్చుకోకు. ఇంకా సాధ్యపడితే ఎంతమంది మనుషులు ఉన్నా.. అసలు ఒక్కరు కూడా లేకపోయినా.. నీలో నువ్వు అంతర్ముఖుడివై సంతోషంగా ఉండడం అలవర్చుకో! అదెంత గొప్ప మానసిక స్థితో ఈ మనుషుల్లో ఆనందాన్ని వెదుక్కునేటంత కాలం అర్థం కాదు. నీకు నువ్వు రుషివైతే తెలుస్తుంది ఈ మనుషుల వల్ల మనల్ని మనం ఎలా కోల్పోతున్నామో!
– నల్లమోతు శ్రీధర్
Sridhar gaaru,
Chala baga rasaru,jivitham lo 90 shatam mana anukonna vallani
Santoshapettadanike kharchu chestam.chachche roju choosukonte
Mana life vere vallu jivinchi vuntaru.
Naaku baga nachchindi,
Rajeswari,Bangalore.
Frame kattinchukovali . Chala bagundi .