ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు…
అంతా క్లియర్‌గా విన్పిస్తోంది గానీ ఒక్క ముక్కా అర్థం కావట్లేదు!!
ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్నారు.. అంత చిన్న విషయానికి ఎందుకు గొడవపడుతున్నారో అర్థం కాక జుట్టుపీక్కుంటున్నాం..
మనకన్నా హైయ్యర్ వేవ్‌లెంగ్త్ ఉన్న మనుషుల మాటలు మనకు చాలా కన్ప్యూజ్డ్గా ఉంటాయి.. మనకన్నా తక్కువ వేవ్‌లెంగ్త్ ఉన్న మనుషుల ఆలోచనలు ఫూలిష్‌గా ఉంటాయి.
అవి మనకు అర్థం కాని విషయాలు అని వీలైనంత త్వరగా గ్రహించి మన పని మనం చూసుకోవడం చాలా మంచి పద్ధతి.
కేవలం ఫ్రీక్వెన్సీనే కాదు… ఆ క్షణపు మన మానసిక స్థితి కూడా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. మనం చాలా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మనకు అర్థమయ్యే వివాదాలే అయినా వాటి జోలికి వెళ్లబుద్ధి కాదు. అదే చాలా disturbedగా ఉన్నప్పుడు మనకు సంబంధం లేనిదీ, మనం జోక్యం చేసుకోవడం వల్ల ఒనగూరేది ఏమీ లేకపోయినా మనం మతిస్థిమితం కోల్పోయి ఆ వివాదాల్లోకి దూరిపోతుంటాం.
మనం 98.3 ఫ్రీక్వెన్సీలో ఆలోచిస్తున్నామా.. 92.7 ఫ్రీక్వెన్సీలో ఆలోచిస్తున్నామా (జస్ట్ సరదాకి ఈ పదాలు వాడాను.. మన వేవ్లెంగ్త్లు కూడా దాదాపు ఇలాంటివే) అన్నది పక్కనబెడితే ఫస్ట్ మనం గమనిస్తూ ఉండవలసింది ప్రతీ క్షణం మన మానసిక స్థితి ఎలా ఉంటోందన్నది! ఈ క్షణం distubedగా ఉంటే.. next సెకన్ చాలా బెటర్‌గా ఉండడానికి మన బ్రెయిన్లోనే స్విచ్ మార్చుకోవచ్చు. మనకు ప్రశాంతత కావాలా.. ఇష్యూస్, disturbances కావాలా అన్నది ఫస్ట్ ఆలోచించుకోవాలి.
రాజకీయాల్లో ఏమైతే మనకేంటి.. సినిమా హీరోల మధ్య గొడవలెలా ఉంటే మనకేంటి.. Facebookలో ఎక్కడో ఏదో టీకప్పులో తుఫాను లేస్తే మనకేంటి.. ఇవన్నీ కాదు.. ఫస్ట్ నీ మనసెక్కడ ఉంది? నీ మనస్సు ప్రశాంతంగా ఉందా లేదా?
సామాజిక బాధ్యత పేరుతో మన అభిప్రాయాలకు విలువలేని టాపిక్ల మీద కూడా ఊగిపోతుంటే అది సామాజిక బాధ్యత కాదు.. ఓ మెంటల్ డిజార్డర్.
పైన చెప్పుకున్నట్లు హైయ్యర్ ఫ్రీక్వెన్సీ మాటలు (మెచ్యూర్డ్గానూ, లాజికల్, ఫిలసాఫికల్‌గా ఉండేవి) అర్థం చేసుకుంటే తప్పులేదు.. అవి జీవితంపై కొంత స్పష్టతని తీసుకు వస్తాయి. ఎటొచ్చీ మనం ఎక్కువ దృష్టి పెట్టేది మనకన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ వ్యక్తుల ఆలోచనల మీదనే! ఎదుటి వాడిని ఫూల్‌ని చేసి మనం గొప్ప వాళ్లగా చలామణి అవాలనుకోవడం నిజమైన మన ఎదుగుదలకి ఓ పెద్ద అడ్డంకి. సరదాగా ఏదైనా చిన్న విషయం గురించి నవ్వుకుంటే ఫర్లేదు గానీ ఆ నవ్వు మనల్నీ, మన వ్యక్తిత్వాల్నీ దిగజార్చకూడదు.
మనుషులంతే.. చూసి లైట్ తీస్కుని.. హాపీగా మనదైన ఆలోచనలతో ముందుకు సాగడమే!!
– నల్లమోతు శ్రీధర్
ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,
అంతరాయానికి మన్నించగలరు, మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.
సాయి రామ్ సేవక బృందం,
తెలుగు భక్తి సమాచారం – http://telugubhakthisamacharam.blogspot.in
సాయి రామ్ వెబ్ సైట్ – http://www.sairealattitudemanagement.org
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*