ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనుషుల చుట్టూ ఉండే aura అనే ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ గురించి అర్థం చేసుకునే ముందు మరింత విస్తృతంగా దీని గురించి చూద్దాం. మనం నివసిస్తున్న భూమి చుట్టూ అయస్కాంత తత్వం (ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్) ఉంది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే విశ్వంలో, ఇతర గ్రహాలకు కూడా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది.
చివరకు భూమి, ఇతర గ్రహాల మీద ఉండే స్ఫటికాలు, రాళ్ల చుట్టూ కూడా ఇది ఉంటుంది. అలాగే జీవం కలిగి ఉన్న ప్రతీ జీవి చుట్టూ ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఉదాహరణకు మానవ శరీరాన్ని తీసుకుంటే మనం auraగా చెప్పుకునే ఈ ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ భౌతిక దేహం నుండి సుమారు మూడు అడుగుల దూరం వరకూ ఆ వ్యక్తి aura ఎనర్జీని బట్టి విస్తరించగలుగుతుంది. మనుషుల పట్లా, సమాజం పట్ల తమ అన్ కండిషనల్ లవ్‌ని కలిగి ఉన్న సీనియర్ NTR, రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు లాంటి నేతలు అంత ఎక్కువ మందిని ఆకర్షించటానికి ప్రధాన కారణం వారి aura బలంగా ఉండడం! Aura అంటే ప్రత్యేకంగా మనం నచ్చిన డ్రెస్ ధరించినంత సింపుల్‌గా తెచ్చిపెట్టుకునేది కాదు. ఇంతకుముందు భాగాల్లో నేను చెప్పినట్లు మన ఆలోచనలు మన కణాల స్థాయిలో ఎలా ఎనర్జీ ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయో, అదే విధంగా మన ఆలోచనలు శరీరం లోపల మాత్రమే కాదు బయటా మన కంటూ ప్రత్యేకమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని aura రూపంలో ఏర్పరుస్తాయి.
అందుకే నిరంతరం తన ఎమోషన్లలో తాను కొట్టుకుపోతున్న వ్యక్తిని, లేదా ఇతరుల్ని ఎక్కువగా ద్వేషించే వ్యక్తిని, నెగిటివ్ మైండ్‌సెట్ కలిగిన వ్యక్తి సమక్షంలో అదే మాదిరి మైండ్ సెట్ కలిగిన వ్యక్తులు తప్పించి, అధిక శాతం మంది జనాభా ఆకర్షితులు కాకపోవడానికి ఇదే కారణం. దీని గురించి తర్వాత భాగాల్లో మీకు వివరంగా అర్థం అవుతుంది.
మొక్కలు, జంతువుల చుట్టూ కూడా ఎలక్ట్రో మేగ్నటిక్ ఎనర్జీ ఉంటుంది. “సైన్స్” అనే ప్రముఖ అంతర్జాతీయ పత్రికలో ప్రచురించబడిన స్టడీలో కొంతమంది పరిశోధకులు పుష్పాలకి, వాటి చుట్టూ పరిభ్రమణం చేసే తేనెటీగలకు మధ్య ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ అనుబంధాన్ని గుర్తించారు. కొద్ది రోజుల క్రితం నేను నా ఫేస్బుక్ అకౌంట్లో ఓ ఫొటో షేర్ చేశాను. తన పిల్లాడి సమక్షంలో తన తల్లి ఉన్నప్పుడు ఆమె aura ( ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్) ఎంతగ విస్తరిస్తోందో ప్రత్యేకమైన కెమెరాల ఆధారంగా ఫొటో గ్రాఫ్ చేయబడిన ఫొటో అది.
మానవ శరీరం అనే పదార్థాన్ని, మనిషి మైండ్‌లో చేసే ఆలోచనలను ఆ వ్యక్తి యొక్క, అతని చుట్టూ ఉండే ఇతర మనుషుల యొక్క ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఒక పేపర్ మీద ఇనుప రజనును కొద్దిగా పోయండి. పేపర్ కింద కొద్దిగా దూరంగా ఒక అయస్కాంతాన్ని కదిలిస్తూ ఉండండి. ఇలా కదిలిస్తూ వెళితే పేపర్ మీద ఉన్న పదార్థ రూపంలో ఉన్న ఇనుప రజను అయస్కాంతాన్ని దూరం నుండి కదిలిస్తున్న దిశ వైపు ఎలాగైతే కదులుతోందో సరిగ్గా అలాగే మన చుట్టూ ఉన్న మనుషుల ఆలోచనలను బట్టి మనం వారికి సమీపంగా వెళుతూ ఉంటాం, నెగిటివ్ థింకింగ్‌తో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కలిగి ఉన్న వ్యక్తులకు దూరంగా జరుగుతూ ఉంటాం.
మీరు ఓ కంపెనీ CEO అనుకోండి. మీ కంపెనీ లాంటి కంపెనీనే మరో కంపెనీ CEO మరొకరు ఉన్నారనుకోండి. మీ ఇద్దరూ ఎవరికి వారు ఓ క్లయింట్‌తో డీల్ కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తే.. చాలామంది మేనేజీరియల్ స్కిల్స్ ప్రకారం బాడీ లాంగ్వేజ్, పీపుల్ స్కిల్స్, మృధువుగా మాట్లాడే మాటలు అవతల ఉన్న క్లయింట్‌ని ఆకర్షిస్తాయి అని భావిస్తారు. ఇక్కడ సహజంగా రెండు విషయాలు జరుగుతాయి.
- అవతల ఉన్న క్లయింట్ కేవలం ఫిజికల్ బాడీ లెవల్లోకి కుంచించుకుపోయి ఉంటే (అతనికి ఉండే సమస్యలు, థాట్ ప్రాసెస్, ఎమోషన్స్ వంటి అంశాల వల్ల అతని చుట్టూ ఉండే ఎలక్ట్రో మేగ్నటిక్ ఎనర్జీ ని శరీరం మీదకు తెచ్చుకుని auraని కుంచింపజేసుకుని కేవలం ఫిజికల్ బాడీగా మాత్రమే ఉండడం) అలాంటి వ్యక్తిని పీపుల్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ ప్రభావితం చేసి ప్రాజెక్ట్ దక్కించుకునేలా చేస్తాయేమో గానీ..
- అవతల ఉన్న వ్యక్తి బలమైన దృక్పధం, పాజిటివ్ ఆలోచనలు, ఫ్లో స్టేట్‌లో ఉంటే అతనిని ప్రత్యేకంగా నేర్చుకుని మీరు పైపై స్థాయిల్లో ప్రదర్శించే పీపుల్ స్కిల్స్ ఏమాత్రం ఒప్పించలేవు. కారణం మీ చుట్టూ ఉండే ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్, అతని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీకి మీరు ఒక్క ముక్క మాట్లాడకపోయినా అర్థమైపోతుంది.
వీరు నిశితంగా తెలుసుకుంటూ పోతే విశ్వంలోని గ్రహాలు మొదలుకుని, మానవ శరీరంలోని కణం, అందులో ఉండే అణువు వరకూ ప్రతీదీ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని కలిగి ఉంటుంది. గతంలో నేను చెప్పినట్లు క్వాంటమ్ ఫిజిక్స్‌లో వేవ్, పార్టికల్ డ్యూయాలిటీ సిద్ధాంతం ప్రకారం.. పదార్థమైన మానవ శరీరాన్ని మాత్రమే మనం గుర్తించినంత కాలం మన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏమాత్రం అర్థం కాదు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కన్ను అనే జ్ఞానేంద్రియం ద్వారా మాత్రమే ప్రపంచాన్ని చూసినంత కాలం కళ్లకి, చెవులకి అర్థం కాని విశ్వంలో ఎలక్ట్రో మేగ్నటిక్ ఎనర్జీ రూపంలో ఉండే సమాచారం మన ఎరుకకి రాదు.
మన శరీరాన్ని తీసుకుంటే మన శరీరంలో గుండె, కాలేయం వంటి అన్ని శారీరక భాగాల్లో టిస్యూలను దాటి మరింత సూక్ష్మ రూపానికి వెళితే అణువుల దగ్గరకు చేరతాం. శరీరంలోని ఏ అణువూ స్వయంగా వ్యవహరించలేదు కాబట్టి అవన్నీ మాలిక్యూల్స్ రూపంలో ఒకే మాదిరి ప్రవర్తనని సంతరించుకుంటాయి. ఆ మాలిక్యూల్స్ కాస్తా తిరిగి ఓ గ్రూప్‌గా ఏర్పడుతూ అవయువాలుగా, మానవ దేహంగా పైకి మన కళ్లకి కన్పిస్తాయి.
మన శరీరంలోని ప్రతీ అవయువంలో ఉండే ప్రతీ మాలిక్యూల్ కూడా ప్రొటీనే. ఆ ప్రొటీన్ ఎంత నాణ్యంగా ఉంది అన్న దాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఉదా.కి.. చర్మ కణాలలో ఉండే కొలాజెన్ అనే ప్రొటీన్ వయస్సుతో పాటు దాని ఎక్స్ప్రెషన్లో నాణ్యత తగ్గే కొద్దీ చర్మంపై ముడతలు పడుతూ ఉంటాయి. దానికోసం చాలామంది బయట నుండి రకరకాల క్రీములు రాసుకుంటూ ఉంటారు. శరీరంలోని ఓ కణం ప్రొటీన్‌ని తయారు చేసేటప్పుడు (అంటే ఓ చర్మ కణం కొలాజెన్ అనే ప్రొటీన్ ని తయారు చేసేటప్పుడు అనే ఓ చిన్న ఉదాహరణ అర్థం చేసుకోండి) అన్ని కణాల యొక్క సముదాయమైన మాలిక్యూల్స్ అటు పాజిటివ్‌గా గానీ, నెగిటివ్‌గా గానీ ఛార్జ్ అవుతాయి. ఒకవేళ మాలిక్యూల్లోని ఓ రెండు కణాలు నెగిటివ్‌గా ఛార్జ్ ( ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ రూపంలో) అయి ఉంటే ఆ రెండూ దూరంగా జరిగిపోతాయి. ఒకదానిని మరొకటి అంగీకరించుకోవు. అలాగే రెండు పాజిటివ్ ఛార్జ్ కలిగిన కణాలు కూడా ఇలాగే దూరంగా జరిగిపోతాయి.
అదే ఒక పాజిటివ్ ఛార్జ్ ఉన్న కణం, నెగిటివ్ ఛార్జ్ ఉన్న మరో కణం ఒక దానిని మరొకటి ఆకర్షించుకుంటాయి. ఇలాంటి కణాలకు మధ్య ఉన్న ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఛార్జ్ ఆ శరీర భాగంలో తగినంత ప్రొటీన్ ఉత్పత్తి అయ్యేలా కారణం అవుతుంది. అలా బైసెప్స్, ట్రైసెప్స్ అనే కండల్లో తగినంత ప్రొటీన్ తయారైతే పైకి మన కళ్లకి కండలు కన్పిస్తాయి. చర్మం అనే అవయువంలో కొలాజెన్ అనే ప్రొటీన్ తగినంత ఉత్పత్తి అయితే చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. అలా ప్రతీ శరీర భాగంలోనూ, ఆ అవయువాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన ప్రొటీన్ ఉత్పత్తి లోతుగా తెలుసుకుంటూ పోతే కణాల స్థాయిలో ఉంటే పాజిటివ్, నెగిటివ్ ఛార్జ్‌లపై ఆధారపడి ఉంటుంది. అంటే మన ఆలోచనల ద్వారా బలమైన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సృష్టించుకుంటే అది చివరకు మన కణం స్థాయి వరకూ ప్రొటీన్ సింథసిస్ మెరుగ్గా అయ్యేలా చేసి మనం ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది.
మరింత వివరంగా ఇంకో భాగంలో వివరిస్తాను.
- Sridhar Nallamothu