సహజంగానే మనకు చాలా desires ఉంటాయి.. కొన్ని తీరతాయి, కొన్ని అలాగే మిగిలిపోతాయి..
అబ్దుల్ కలాంతో సహా చాలామంది చెప్పేమాట.. “కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి” అనీ! కలలు కనడమూ, కష్టపడడమూ, వాటిని సాకారం చేసుకోవడమూ ఓ సక్సెస్ఫుల్ స్ట్రేటజీగానే కన్పిస్తున్నప్పుడు కొన్ని కోరికలు మాత్రం ఎందుకు తీరవు?
అలాగే భగవంతుడిని కోరుకుంటే కొన్ని కోరికలు తీరినట్లు అన్పిస్తాయి, కొన్ని ఆ భగవంతుడు సైతం తీర్చలేడు ఎందుకు?
ఇవన్నీ చాలామందికి కామన్‌గా వచ్చే సందేహాలు…
—————–
కోరికలు నెరవేరడం అనేది.. కోరిక యొక్క తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. వెన్నుపూస అడుగున మూలాధార చక్రం అని ఒకటి ఉంటుంది. అందులో కుండలినీ శక్తి ఉంటుంది. ఓ కోరిక బలంగా ఉన్నప్పుడు అది ఉత్తేజితమై సుషుమ్న నాడిలో స్పందనలు చేరతాయి. దాంతో మన కోరికకు అనుకూలమైన మానసిక శక్తి దానంతట అదే వస్తుంది. ఇది సహజంగా మన కోరికలు నెరవేరబడుతున్న ప్రాసెస్.
————–
“సీక్రెట్” లాంటి వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదివితే.. అవి “లా ఆఫ్ అట్రాక్షన్”ని బోధిస్తాయి. “మనం ఏది కోరుకుంటే అది అవుతుంది, ఎంత బలంగా కోరుకుంటే అంత ఖచ్చితంగా అవుతుంది అన్నది” వాటి సారాంశం.
కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోయిందీ పుస్తకం. ఇలాంటివి కోకొల్లల పుస్తకాలు మనల్ని నిరంతరం ఇన్స్పైర్ చెయ్యడానికి మన పర్సనల్ లైబ్రరీల్లో మూలుగుతూ ఉంటాయి.
————–
“సీక్రెట్” బుక్ చెప్పేది ఫాలో అవడం ద్వారా మన కోరికలు నెరవేరేది…. మన కోరిక తీవ్రత హెచ్చించడం వల్ల మూలాధార చక్రం ఉత్తేజితం అవడం ద్వారానే.. కుండలినీ శక్తి అపారమైంది. దానిలో వచ్చే చిన్న చిన్న స్పందనలే మన అల్పమైన ఇలాంటి చిన్న చిన్న కోరికలను తీర్చేయగలుగుతాయి. మనందరికీ తెలియని విషయం ఏమిటంటే కుండలినీ శక్తిని పూర్తిగా ఉత్తేజితం చేయడం ద్వారా వేర్వేరు ఫ్రీక్వెన్సీల్లో మన ఆలోచనలు మార్చుకోవచ్చు. అంటే జంతువులు మాట్లాడే మాటలు మనకు అర్థమవుతాయి, పక్క వ్యక్తి ఆలోచనలు మనకు అర్థమవుతాయి, అనేక అద్భుతాలు సంభవిస్తాయి.
————–
కానీ దురదృష్టవశాత్తు నమ్మకమే లేదు మనకు ఇలాంటి వాటిపై! టివి ఛానెళ్లు డిబేట్లు పెట్టి మరీ.. భారతీయతను, భారతీయ విశ్వాసాలనూ, వారసత్వ సంపదపై మనకు ఉన్న కొద్దిపాటి నమ్మకాన్ని పోగొడతాయి. అలాంటివి మనం మూఢ నమ్మకాలనుకుంటాం. మనలో నిగూఢమై ఉన్న శక్తులను ప్రేరేపించే చర్య కూడా మనకు ఒట్టి ట్రాష్‌లా అన్పించేటంత అమాయకత్వం.
అలాగే భక్తియోగాలో కూడా కోరికలు నెరవేరతాయి, కానీ అలా మన కోరికలు నెరవేర్చుకునేటంత భక్తి మనకు ఇప్పటి తరాలకు లేదు. అలాగే భక్తియోగాలో ఓ స్థాయికి చేరాక మన కోరికలు కన్నా, ఆ భక్తే గొప్పది అన్న స్థితికి చేరతాం.
—————
చివరిగా ఒక్కమాట… నేను పైన చెప్పినదంతా మీకు రుచించాలంటే… “నిన్నటి వరకూ టెక్నాలజీ గురించి చెప్పిన ఈ మనిషేంటి, ఇలా ఏవేవో చెప్తున్నాడు…” అనే ఓ సంధిగ్థత తొలగాలి. జ్ఞానం ఏదైనా సత్యం. సత్యం మనకు ముఖ్యం తప్ప చెప్పే మనిషీ కాదు, అతని నేపధ్యమూ కాదు. నాకు టెక్నాలజీతో పాటే వీటిపై సమాంతరంగా అవగాహన ఉందీ, కొంత అభ్యాసమూ ఉంది, సో చెప్పగలుగుతున్నాను, అందువల్ల ఇలాంటి సంధిగ్థాలు పక్కనపెట్టి వాస్తవం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు చైతన్యం చేసుకోవచ్చు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply