గత కొన్ని రోజులుగా ఫేస్బుక్లో ఏం రాయాలో, ఏం రాయకూడదో, ఏం రాస్తే ఎలాంటి తంటాలు వస్తాయో తెలీక చాలామంది గందరగోళంగా ఉన్నారు… మరికొంతమందైతే FB చాలా చప్పగా ఉంటోందని అంటున్న వాళ్లూ లేకపోలేదు…
ఏదో ఒక వివాదానికీ, ఎమోషనల్ పోస్టులకో మనం అలవాటుపడిపోయాం… తిట్టడానికీ, ద్వేషించడానికీ మనకూ ప్రతీ క్షణం ఏదో ఒక కారణం కావాలి… కసిదీరా మేధస్సునంతా ఉపయోగించి నెగిటివ్ ఎమోషన్లు కురిపించేయాలి… లేదా అలా కురిపించబడే updatesని చదువుతూ మనం వినోదించాలి….
ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో అందరూ కాస్త ఆచితూచి వ్యవహరిస్తుండేసరికి వివాదాలకు, శృతిమించిన రాతలకు అలవాటుపడిన మనస్సులకు చాలా వెలితి తెలుస్తోంది..
సరిగ్గా ఇదే మంచి సమయం… నెగిటివ్ ఎమోషన్లతో కొట్టుకుపోతున్న మనలోని స్థబ్ధతను మంచి ఆలోచనల వైపు మళ్లించడానికీ! పాజిటివ్ ఎమోషన్లయిన ప్రేమ, ఎఫెక్షన్, హెల్పింగ్ నేచర్, బలమైన హ్యూమన్ రిలేషన్లు వంటి వాటి వైపు మళ్లించడానికి!!
మనస్సులోని ఆలోచనలు ఎటు ప్రేరేపిస్తే అటు పరుగెడతాయి.. చుట్టూ వేల మంది నెగిటివ్ ఎమోషన్లని ప్రేరేపించే వాళ్లుంటే ఎంత బలంగా మంచిగా ఆలోచించాలనుకున్నా మన మనస్సు కలత చెందుతూనే ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి స్థబ్ధతతో కూడిన వాతావరణం నుండైనా మనస్సు దారిని మంచి ఎమోషన్ల వైపు అందరం మళ్లించుకోవలసిన అవసరం చాలా ఉంది.
మంచి ఎప్పుడూ చప్పగానే ఉంటుంది… కారణం దానిలో మసాలాలేమీ ఉండవు కాబట్టి! కానీ రక్తాన్ని మరిగించే మసాలాలు ప్రాణాలు తీస్తాయి…. రక్తాన్ని శాంతింపజేసే చప్పదనం ఆహ్లాదాన్ని పంచుతుంది…. ఏది కావాలో నిర్ణయించుకుందాం..
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
Leave a Reply