మాట్లాడడం ఓ form of expressionగా వాడుకున్నంత వరకూ ఫర్లేదు. అది బలహీనతగా మారకపోతే చాలు..
మాట్లాడడం అలవాటయ్యాక వినడం మెల్లగా తగ్గిపోతుంది.. వినడం తగ్గితే గ్రహించడమూ తగ్గిపోతుంది.. గ్రహింపు, అవగాహనా కొరవడిన మాటలు మన విలువని పలుచన చేస్తాయి.
అనర్గళంగా మాట్లాడడం గొప్పనుకుంటాం… స్థాయీ, హోదాలతో మనస్సు ద్వారాలు మూసుకోకుండా మౌనంగా మనస్సు పెట్టి వినడమూ, గ్రహించడం అసలైన గొప్పదనం.
ప్రతీ మాటా మాట్లాడే వ్యక్తిని బట్టి, సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, వినేవారి అవగాహనను బట్టి వేర్వేరు చోట్ల వేర్వేరు అర్థాలు ధ్వనిస్తుంది.
తగిన చోట తగిన విధంగా అర్థం ధ్వనింపజేయలేకపోయామంటే మన మాటల కూర్పులో ఏదో లోపం ఉన్నట్లే.
మాట్లాడడం బలహీనతగా మారితే ఏదో ఒకటి మాట్లాడేయడాలన్పిస్తుంది. మనల్ని వినడానికి ఆవురావురుమంటూ ప్రపంచం సిద్ధంగా ఉన్నట్లు గొంతు ఉరకలెత్తుతుంది 🙂
మన మాటలకు ఓ అవసరమో, సందర్భమో, బాధ్యతో, పరిస్థితో తోడయితేనే విలువ తప్ప కేవలం "మాట్లాడడం వచ్చు" కాబట్టి మాట్లాడుకుంటూ పోతే ప్రయోజనం శూన్యం..
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://nallamothusridhar.com
http://youtube.com/nallamothu
mee posts baguntundi.
etv suman gunchi post chala bagundi. kani ala folow avadam kastam kada.
మాట్లాడడం అలవాటయ్యాక వినడం మెల్లగా తగ్గిపోతుంది.. వినడం తగ్గితే గ్రహించడమూ తగ్గిపోతుంది.. గ్రహింపు, అవగాహనా కొరవడిన మాటలు మన విలువని పలుచన చేస్తాయి.
అనర్గళంగా మాట్లాడడం గొప్పనుకుంటాం… స్థాయీ, హోదాలతో మనస్సు ద్వారాలు మూసుకోకుండా మౌనంగా మనస్సు పెట్టి వినడమూ, గ్రహించడం అసలైన గొప్పదనం.
very nice
కొన్నిసారేంటండీ!! చాలాసార్లు అది బలహీనతే:-)