స్నేహాలు ఎలా అవసరాలకు వాడుకోబడుతున్నాయో last updateలో రాశాను…
అవే స్నేహాలు మన ఇరుకు మనస్థత్వాలతో ఎలా సమాధి చేయబడుతున్నాయో ఈ సందర్భంగా నాకు జీవితాంతం గుర్తుండిపోయే సంఘటన ద్వారా చెప్పకుండా ఉండలేను.
నేను తెనాలిలో ICWAI చదువుతున్నప్పుడు నీలిమా కిరణ్ అని ఓ మంచి ఫ్రెండ్ ఉండేది.
మా ఇద్దరి పరిచయమే విచిత్రంగా మొదలైంది.. క్యారమ్స్ కాంపిటీషన్ లో రెండు లీగ్ ల నుండి ఫైనల్స్ లోకి వచ్చిచేరి పోటాపోటీగా ఆడి.. ఆ తర్వాత స్నేహితులయిన వాళ్లం.
కెరీర్ గురించీ, సొసైటీ గురించి, మనస్థత్వాల గురించీ, పుస్తకాల గురించీ చాలా చాలా మాట్లాడుుకునే వాళ్లం.
ICWAIలో కాస్ట్ అకౌంటెన్సీ కావచ్చు, స్టాటిస్టిక్స్ కావచ్చు… ఓ problem రత్నాకర్ గారని మా డైరెక్టర్ బోర్డ్ మీద స్టెప్ బై స్టెప్ బోర్డ్ మీద నేరేట్ చేస్తూ పోతుంటే… అందరూ ఆ స్టెప్స్ రాసుకుంటుంటే మేమిద్దరం మాత్రం కేవలం ఆ problemలోని వేల్యూస్ ని ఓ పక్కన మార్జిన్ లో రాసుకుంటూ ఠకాఠకా కాలిక్యులేషన్లు చేస్తూ.. problemలోని సొల్యూషన్ ఎవరం ముందు చెప్ధామా అని పోటాపోటీగా కూర్చునే వాళ్లం.
ఇంట్రెస్ట్ కొద్దీ ఇద్దరం బ్రెయిలీ లిపి ప్రాక్టీస్ చేశాం.. గ్రాఫాలజీ, బాడీ లాంగ్వేజ్ వంటివి స్టడీ చేస్తూ డిస్కస్ చేస్తూ ఉండేవాళ్లం.
అంతా బాగుంది… అనుకుంటుంటే మా ఇద్దరి మీద పుకార్లు మొదలయ్యాయి. నీలిమ చాలా బాగుంటుంది. తనతో క్లోజ్ గా మూవ్ అవ్వాలని చాలామంది రకరకాలుగా ట్రై చేసేవారు. తనకి తెలుసు ఏ చూపుల్లో ఏ అర్థముందో.
వారి అసంతృప్తి మా ఇద్దరి రిలేషన్ మీద పడింది. మేం ఇద్దరం మాట్లాడుకుంటుంటే ఎక్కడ్నుంచో చూపులు క్యూరియస్ గా తొంగిచూస్తుండేవి.
నేను హాస్టల్ లో ఉండేవాడివి. ఓరోజు క్లాసెస్ అయ్యాక రూమ్ కెళ్లి మా రూమ్మేట్ అమర్ అని పాపం నాకు ప్రాణం ఇచ్చేవాడు.. అతనితో కలిసి మెస్ కి బయల్దేరాం. మెస్ కి వెళ్లాలంటే ఇనిస్టిట్యూట్ దాటి వెళ్లాలి. కాజువల్ గా ఇనిస్టిట్యూట్ వైపు చూసుకుంటూ వెళ్తుంటే ఆఫీస్ రూమ్ ఓపెన్ చేసి ఉంది. ఈ టైమ్ లో రత్నాకర్ గారు ఎందుకున్నారా అని మెల్లగా గేట్ తీసుకుని లోపల స్టడీ అవర్స్ లో ఉన్న ఇతర ఫ్రెండ్స్ కోసం వెళ్తున్నట్లు వెళ్లాం.
రత్నాకర్ గారు ఏదో చెప్తున్నారు.. మా నీలమ తల వంచుకు కూర్చుంది.. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్లెదుట గుర్తుండిపోయింది. స్టడీ అవర్స్ లో ఉన్న ఫ్రెండ్స్ ని వెళ్లి అడిగాం.. ఏం జరుగుతోంది అని.
“మీ ఇద్దరి గురించి కంప్లయింట్లు నీలిమ వాళ్ల పేరెంట్స్ కి వెళ్లాయట, వాళ్లు రత్నాకర్ సర్ ని హెచ్చరించారు.. అందుకే ఆయన క్లాస్ తీసుకుంటున్నారు” అని చెప్పారు.
ఒక అమ్మాయి నాతో ఎలాంటి కల్మషం లేకుండా స్నేహం చేస్తున్న పాపానికి ఇలా తలదించుకోవలసిన పరిస్థితిని నేను జీర్ణించుకోలేకపోయాను. చాలా ఏడుపొచ్చింది. మెస్ కెళ్లకుండా వెనక్కి రూమ్ కెళ్లాం అమర్, నేనూ.
నాకు కళ్లల్లో నీలిమ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే కన్పిస్తోంది. వెళ్తూ స్లీపింగ్ పిల్స్ తీసుకున్నా, అమర్ వద్దన్నాడు.
నేను మానసికంగా ఇప్పుడున్నంత బలవంతుడిని కాదు అప్పట్లో. దానికితోడు నాకు చాలా ఇష్టమైన మా నీలిమని నా నుండి దూరం చేస్తున్నారన్న బాధ.
భారీ మొత్తంలో స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా. ఆరోజు రాత్రి నేను చనిపోవాల్సింది.. మా అమర్ నా ప్రాణం నా నుండి విడిపోయే దశలో నా నుండి “నేను ఇంకా బ్రతకను అమర్” అని పిచ్చిపిచ్చిగా మాట్లాడడం విని భయపడిపోయి ఇప్పుడే వస్తానంటూ వేరే ఫ్రెండ్స్ ని తీసుకు వచ్చి హాస్పిటల్ లో చేర్చబట్టి బ్రతికాను.
డాక్టర్ అన్నాడట.. ఐదు నిముషాలు ఆలస్యం చేసుంటే.. తను అస్సలు బ్రతికేవాడు కాదు అని!
తర్వాత మా వాళ్లు వచ్చి నన్ను తీసుకెళ్లిపోయారు.. కనీసం నీలిమని కలిసే అదృష్టమూ కలగలేదు. సెల్ ఫోన్లూ, ఇ-మెయిల్స్ ఉండేవి కాదు. మా అమర్ నీలిమ ఎలా ఉందో చెప్పడానికి, నాతో కాసేపు గడపడానికి అప్పుడప్పుడు మా ఊరు వచ్చేవాడు.
నేను ICWAI ఫైనల్ కోసం చెన్నై వెళ్లి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోనూ, కంప్యూటర్ రంగంలోనూ సెటిల్ అయ్యా.
తర్వాత ఓరోజు పనిమాలా నీలిమ గురించి ఎలాగైనా తెలుస్తుందేమోనని తెనాలి వెళ్లి ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ తిరిగా. ఫలితం లేదు. తను ఓ ఆర్మీ అతన్ని పెళ్లి చేసుకుంది అన్నది మాత్రం తెలిసింది.
ఇంటర్నెట్ లో అన్ని సైట్లలోనూ తన ప్రొఫైల్ కోసం వెదుకుతూనే ఉన్నా ఇప్పటికీ.
నాకు అతి పెద్ద కోరికల్లో ఇదొకటి .. నేను చనిపోయేలోపు ఒక్కసారైనా మా నీలిమాకిరణ్ ని కలవాలన్నది.
తను అంటుండేది “కల్మషం లేని చాలా మంచోడివి, మంచి టాలెంట్ ఉంది, బాగా కష్టపడతావు.. ఎప్పటికైనా గొప్ప స్థానానికి చేరతావు శ్రీధర్” అని. నాకే నమ్మకం ఉండేది కాదు. అలాంటిది తన ముందు ఇప్పుడు నిలబడాలని ఉంది. కానీ సాధ్యమవుతుందా?
______________________________
మీలాంటి, నాలాంటి ఇరుకు మనస్థత్వాలు ఎన్ని గొప్ప స్నేహాల్ని ఇలా పనికిమాలిన మాటలతో, రాతలతో, ఛేష్టలతో అవహేళన చేస్తున్నాయి?
ఎంతమంది నిజమైన స్నేహితులు స్నేహితులుగా బ్రతకలేక విడిపోతున్నారు?
నా విషయంలో మా నీలిమని కోల్పోయిన బాధ ఎంతమందికి అర్థమవుతుంది? నాకు ఎంతమంది స్నేహితులైనా ఉండనీయండి.. నేను ఏ స్థాయికైనా ఎదగనీయండి.. ఎవరైనా, ఏదైనా మా నీలిమాకిరణ్ తర్వాతే!! ఈ మాట నేను ఎప్పటికీ మనస్ఫూర్తిగా నా ప్రాణాన్ని గుర్తు తెచ్చుకుని చెప్పగలను.
థాంక్యూ నీలిమా.. నువ్వు నాకు అందుబాటులో లేకపోయినా నేను నీతోనే ఉన్నాను.
చివరిగా మిత్రులకు ఓ విన్నపం స్నేహం విలువ అవసరాలకు వాడుకునేది కాదు.. సంకుచితత్వంతో కార్నర్ చేసి spoil చేయాల్సింది కాదు. మనం అమాయక స్నేహాల్ని తప్పుగా చూస్తున్నామంటే ఆ పాపం ఊరికే పోదు. ఇది కర్మసిద్ధాంతం కాదు.. అలా చేసి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
dont leave hopes .. .. meelane thanu alochisthundemo .. .. prApancham gundramga untundi.. edo oka roju thanu meeku kanpisthundemo .. good luck ..
Sir, really touching..
mana alochana swachamainadi inapudu devudu kuda daniki thala vanchuthadu sir, (i believe that)..
meeru thanani kalustharu ani korukuntunnaru..
kalisina roju okasari cheppandi……
Good Luck….
Hi sir,
Really Heart Touching.. Almost same scenario i have faced in my life. Even i haven’t seen her but she inspired me with her letters..
I recalled my memories with your post..
Thank You Very Much…
You will get her sir don’t loos hope sir and really i have a friends like that sir.
Sir really great friedship…..
Really Heart Touching
sir
manam machi vala may but manatho vaydavalu kuda vunta ru kane valu vayda valu ane manaku thay liyadu.
frndship ki love ki meaning thay liyani valu
naku oka frnd undhi but mamu scholl maramu 6th lo but i didnt forget naku manchi frnd apati lo nay
but
really ur great sir
Bhadapadakandi sir….comformedga mee friend edo okaroju kanpaduthundi..all the best
really heart touching meeru tappakunda tanani kalustaru all the best
విభు గారు చేప్పినట్టు ప్రపంచం గుండ్రం గా తిరుగుతుంది. అలాగే మనం కూడా తిరుగుతున్నాం (వెతుకులాటలో )… అలా తిరిగే క్రమంలో ఎప్పుడో ఒకరోజు, ఒక క్షణం ఆమెతో మీరు మాట్లాడక తప్పదు. విధి చాలా బలీయమైనది. కచ్చితంగా జరుగుతుంది… మొన్న మీరే చెప్పారు కదా, ఉన్నది ఒక్క జీవితం అని. ఈ జీవితానికి న్యాయం జరుగుతుంది. ఈరొజు కాకపోతే రేపు. నన్ను నమ్మండి.
ఇట్లు,
మీ శ్రేయోభిలాషి ( మంగళంపల్లి అనుదీప్ కుమార్ )
hatsoff to ur true friedship
Friendship meeru entha value isthunnaro naaku ardham avuthundhi
mee lanti okka friend vunna chalu life lo
Naadhi TENALI meeku ye help kavalaina chesthanu cheppandhi sir
మీ ఆశయం నెరవేరాలని ఆ దేవుణ్ణి మనస్పూర్తిగా కోరుకుంటాను శ్రీధర్ గారు……….
me story vinnaka na meda naku asahyam vesthundi na best friends ni nenu eppati artham chesukoleka poyanu alage na friends kuda nannu artham chesukolekapoyaru mari na lanti vala situation enti sridhar garu
Dear sir,
i saw your FACEBOOK post then i read your story it is very heart touching nobody did not understand the relationship between friends they are always think it another …. I hope u will defiantly meet nileema kiran …Wish you good luck sir.
SREEKANTH B
Sir..
chaala bagundi.. kaani snehamtho kudina premaga undi.. ofcourse prema lendey ye relation nilavadu kada…Sir mari ICWAI chesi.. vadilesara…software vaipu yela..?
Friendship is Great sir..
Societyki bayapadi konthakalam snehitulu dooramga vunna…vaari manasulo snehithulu baagundaalani korika…Ekkadunnaro ane Vetukulata. Vuntundi….
Thank you
abba tammudu.. meru manchi frends ayyundochu.. mari intha emotional aa bayya..?? ante evari personal life vallakuntadi kada.. so may be ur friend after marriage..job+kids+husband+other headaches… anni kalipi she mite be really busy, in other words meru thana gurunchi alochinchinattu thanu me gurunchi intha la alochinchaka povachu..
naaku ilanti pure frends unde vallu, oka 2 girls (ivala society lo clarity undali ante PURE ane word vaadalemo..!!) vallu pellaipoyina taravaata picha lite babu.. ma mogudu abayi friends tho matladoddu annadu..so nuvu vere frends ni vethuko.. ani picha lite ga cheparu..
ofcourse me friend valla husband much more mature ayyundochu.. but naaku baaga embarrassing ga unde aa situation.. so.. good luck.. with ur professional life rather than meeting ur best friend..
move on…!!
Really Great friendship sir .
Really Great friendship sir . Mee Friend Neelimaa Kiran Mimmalni Kalavalani Korukuntunnanu……. All The Best Sir…………. 🙂