వైద్యశాస్త్రంలో శరీరంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల అవయవాలు ఉన్నాయని మాత్రమే గుర్తించగలుగుతారు గానీ, ప్రాచీన యోగ శాస్త్రంలో శరీరంలోని వివిధ ప్రదేశాల్లో నిగూఢంగా ఉన్న శక్తి స్థానాలు (వీటినే chakras అంటారు) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కుంఢలినీ లాంటివి సాధ్య పడాలంటే ఆయా సంబంధిత చక్రాల ఎనర్జీ బ్లాక్స్‌ని మెడిటేషన్, ప్రాణాయామం, యోగాసనాలు వంటి వివిధ ప్రాక్టీసెస్ ద్వారా అధిగమించుకుని వెన్నెముక అడుగుభాగంలో ఉండే శక్తిని (దీన్ని మెడికల్ భాషలో చెప్పాలంటే cerebrospinal ఫ్లూయిడ్‌ని) బ్రెయిన్లోని పీనియల్ గ్లాండ్పై వత్తిడి సృష్టించే విధంగా చేసుకుంటూ వెళితే అప్పుడు జ్ఞానేంద్రియాలకు అర్థం కాని, విశ్వంతో కమ్యూనికేట్ చేసే, విశ్వం యొక్క ఫ్రీక్వెన్సీని అర్థం చేసుకునే extrasensory perception లభిస్తుంది.
వెన్నెముక అడుగుభాగంలో పాములా చుట్ట చుట్టుకుని కుంఢలినీ శక్తి నిక్షిప్తమై ఉంటుందని ప్రాచీన యోగ శాస్త్రం స్పష్టం చేసింది. దీనికి శాస్త్రీయమైన దృక్కోణాన్ని నేను వ్యక్తిగతంగా తెలుసుకోవటానికి ప్రయత్నించాను. ఆ నిగూఢమైన శక్తే సెలబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని తెలుసుకున్నాను. శరీరంలోని కింది ఊపిరితిత్తుల నుండి అంటే నాభి నుండి మెల్లగా ఊపిరి తీసుకుంటూ పూరక, రేచక, కుంభక, శూన్యక అనే నాలుగు దశల ప్రాణాయామం ద్వారా సెరబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ వెన్నుముక ప్రాంతం నుండి అన్ని చక్రాలను యాక్టివేట్ చేసుకుంటూ గొంతు భాగానికీ, ఆ తర్వాత మెదడులోని అంగిటికి కొన్ని పొరల పైన ఉండే పీనియల్ గ్లాండ్పై వత్తిడి సృష్టించే స్థితికి చేరుకుంటూ ఉంటుంది. ప్రాణాయామం చేసేటప్పుడు ఎనర్జీ ఏ దిశగా కదలాడుతోంది అన్న దానితో పాటు మన ఇంటెన్షన్ కూడా స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే, అలాగే సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇలా పీనియల్ గ్లాండ్ మీద వత్తిడి సృష్టించడం సాధ్యపడుతుంది.
గతంలో ఒకసారి నేను రాసినట్లు, పీనియల్ గ్లాండ్‌లో చిన్న చిన్న ఉప్పు రేణువుల లాంటి మైక్రో క్రిస్టల్స్ ఉంటాయి. వాటిపై ఒత్తిడి ఏర్పడినప్పుడు, అంటే మెకానికల్ చర్యకు గురైనప్పుడు వాటి నుండి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ తరంగాలు ఉత్పన్నం అవుతాయి. దాంతో అది మెల్లగా రేడియో స్టేషన్లా మారిపోతుంది. అంటే మన దగ్గర ఒక రేడియో ఉంటే అది వివిధ స్టేషన్లని ఎలా వినడానికి హెల్ప్ అవుతుందో, విశ్వం యొక్క ఫ్రీక్వెన్సీని, విశ్వంలో ప్రతీ జీవి జరిపే కమ్యూనికేషన్నీ స్వీకరించి, అర్థం చేసుకునే సామర్థ్యం ఆ పీనియల్ గ్లాండ్కి వస్తుంది. దానినే థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ అయిందనీ, మూడో కన్ను తెరుచుకుందని, intuition శక్తి ఇంప్రూవ్ అయిందని రకరకాలుగా చెప్తుంటారు.
ఒక సాంకేతిక నిపుణుడిగా మరింత లోతుగా దీన్ని స్టడీ చేశాను. మన ఫోన్లలో, కంప్యూటర్లలో తెల్లటి కాంతి లోపల దాగి ఉండే బ్లూ లైట్ పీనియల్ గ్లాండ్కి ప్రధానమైన శత్రువు. ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్లు వాడే వారు బ్లూ లైట్ ఫిల్టర్ కళ్లజోళ్లు గానీ, యాప్స్ గానీ అమర్చుకోకపోతే బ్రెయిన్లోని పీనియల్ గ్లాండ్ ఉత్పత్తి చేసే మెలటోనిన్ అనే హార్మోన్ విడుదల ఆగిపోయి నిద్రలేమి వంటి భౌతికమైన సమస్యలతోపాటు స్పిరిట్యువల్‌గా ఎంత మెడిటేషన్ చేసినా, ఏం చేసినా ఉపయోగం ఉండదు. మెడిటేషన్ చేసే వారు కళ్లు మూసుకుని మెడిటేషన్ చెయ్యడానికి ప్రధాన కారణం ఇదే. కళ్లు మూసుకున్నప్పుడు ఏర్పడే చీకటిని మన బ్రెయిన్ గుర్తించగానే మెల్లగా మెలటోనిన్ ఉత్పత్తి మొదలవుతుంది.
శరీరంలోని వివిధ చక్రాలు ఆయా ప్రదేశాల్లో ఉండే అవయవాలకు, మన ప్రవర్తనలో ఉండే అనేక అంశాలకు, హార్మోనల్ రిలీజ్‌కి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాయి. ఉదాహరణకు రూట్ చక్ర ఆడ, మగలో పునరుత్పత్తి అవయువాలకు ప్రాతినిధ్యం వహించడం తోపాటు మానసిక స్థాయిలో చూసుకుంటే ఒక మనిషి జీవితం పట్ల ఇన్ సెక్యూర్డ్‌గా ఉంటే, ఎంత సంపద ఉన్నా ఏమీ లేనట్లు లోటుగా భావిస్తుంటే, ఇంకా ఇంకా కావాలి అనే ఆరాటం ఉంటే అతని రూట్ చక్ర ఎనర్జీ బ్లాక్ అయి ఉంటుంది. అప్పుడు అతను మెడిటేషన్ చేసినా, ప్రాణాయామం చేసినా ఆ ఎనర్జీ సెంటర్ యాక్టివేట్ జరగదు. దాని బదులు అతను మొట్టమొదట తన ఆలోచనా ధోరణిని మార్చుకోవాలి. అందుకే చేతిలో పదివేలు ఉన్నా చాలా సంతృప్తిగా బ్రతికే వారి రూట్ చక్ర ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి ఎనర్జీ బ్లాక్ ఉండదు. ఇలా వివిధ చక్రాల పనితీరు గురించి మరో ఆర్టికల్‌లో రాస్తాను.
మైండ్ లెవల్ థింకింగ్, మనుషులు, వస్తువులు, త్రీ-డైమెన్షనల్ ప్రపంచంలో నిరంతరం కొట్టుకుపోయే వారు ఎంత మెడిటేషన్ చేసినా, ఎన్ని యోగాసనాలు వేసినా ఆయా అవయవాలకు సంబంధించి చిన్న చిన్న ప్రయోజనాలు లభించడం తప్పించి వారి ఎనర్జీ సెంటర్స్ పూర్తిగా యాక్టివేట్ అవవు. ఈ విషయం లోతుగా గ్రహించిన తర్వాత 90 శాతం నా రోజంతా నేను వస్తువులకు, మనుషులకు, భావోద్వేగాలకు డిటాచ్ అవడం మొదలుపెట్టాను. చాలా ఏళ్లుగా గంటల తరబడి చేసిన మెడిటేషన్ ప్రాక్టీస్ నాకు ఈ విషయంలో హెల్ప్ అయింది. గత సంవత్సర కాలంగా నాతో కాసేపు నేరుగా గడిపిన ప్రతీ వ్యక్తికీ నేను ఎంత కూల్‌గా, దేనికీ కనెక్ట్ అవని విధంగా ఉంటున్నానో నేరుగా చూసి ఉంటారు. అది నా గొప్పదనం ఏమీ కాదు. మన స్పిరిట్యువల్ ప్రాక్టీసెస్ గొప్పదనం. ఇంకా చెప్పాలంటే “నేను” అనే దాన్ని అధిగమించాకే (ఎప్పుడైనా అది అరుదుగా సర్ఫేస్ మీదకు రావొచ్చు, బట్ నేను అనే ఇగోయిస్టిక్ మైండ్ వల్ల స్పిరిట్యువల్ హైట్స్‌కి వెళ్లలేమన్న అవగాహన వచ్చాక మనల్ని మనమే సరిచేసుకుంటాం). మైండ్, సోల్ రెండూ స్పష్టంగా అర్థమవుతాయి.
మరింత వివరంగా మరో ఆర్టికల్‌లో రాస్తాను. దీన్ని ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. బట్ రాసిన Nallamothu Sridhar అనే నా పేరు ఉంచి షేర్ చేసుకోవచ్చు. ఇది వ్యక్తిగా నా పేరు మీద మమకారం కాదు. కౌటిల్యుడి అర్థశాస్త్రాన్ని రాశాడు, పతంజలి యోగ శాస్త్రాన్ని అందించాడు.. అని ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే విద్యకి అప్పట్లో ఇచ్చిన విలువ. పేర్లు తొలగించి మీరు షేర్ చేసేది ఏమీ మీకు ఏ ప్రత్యేకతను ఇవ్వదు. ఇంకా చెప్పాలంటే కొన్ని రాయడం ఆ రాసే అర్హత ఉన్న వాళ్లకే సాధ్యం. మీరు మీ పేరుతో షేర్ చేసినంత మాత్రాన ఎవరూ వాటిని పాటించరు.
ధన్యవాదాలు
– Sridhar Nallamothu