మీ తాత ముత్తాతలకు ఉన్న ఎలర్జీస్ మీకెందుకు వస్తున్నాయో తెలుసా.. జెనెటిక్స్ అని ఈజీగా అనేస్తారు కదా, దాని వెనుక రహస్యం ఇది.
స్పిరిట్యువల్ ప్రాక్టీసెస్‌లో భాగంగా ఒక సోల్, బాడీ, స్పిరిట్ ఈ మూడు ప్రధానమైన అంశాల గురించి నన్ను నేను గమనించుకుంటూ, శాస్త్రీయంగా స్టడీ చేస్తూ అనేక రహస్యాలు తెలుసుకుంటున్నాను. అందులో భాగమే ఇది కూడా!
మనిషి శరీరం అనేది అతని సోల్‌ని (ఆత్మ)ని అకామిడేట్ చెయ్యడానికి ఏర్పడిన భౌతిక రూపం. ఒక సోల్ భౌతిక ప్రపంచంలో చేయాల్సిన కర్మలన్నీ చేయడానికి ఓ ప్లాట్‌ఫాం క్రియేట్ చెయ్యడానికి, ఆరోగ్యపరంగా ఈ భూమ్మీద, తన చుట్టూ వాతావరణంలో వీలైనంత ఎక్కువ కాలం సర్వైవ్ అవుతూ జీవించడానికి శరీరం ఉపయోగపడుతుంది. సో శరీరం అనేది ఈ భూమ్మీద సర్వైవల్ని కోరుకుంటుంది అన్నది మొదట గుర్తు పెట్టుకోండి. బయట విషయాల గురించి మనకు ఎలా నాలెడ్జ్ ఉంటుందో తన చుట్టూ పరిసరాల గురించి శరీరానికి నాలెడ్జ్ ఉంటుంది. దాన్నే బాడీ ఇంటెలిజెన్స్ అంటారు. నిరంతరం శరీరంలోని వివిధ ఆర్గాన్లకి మధ్య, మెరిడియన్స్, చక్రా ఎనర్జీ రూపంలో ఈ ఇంటెలిజెన్స్‌కి అనుగుణంగా ప్రతీ కణం బయో ఫోటాన్స్ అనే కాంతి పుంజాలుగా ఈ ఇంటెలిజెన్స్‌ని ఒక సెల్‌కి మరో సెల్ పంచుకుంటూ ఉంటాయి. ఈ కమ్యూనికేషన్ అంతా కలిపి శరీరం మొత్తం వివిధ ప్రమాదాల నుండి కాపాడబడడానికి, సర్వైవల్‌కి ఉపయోగపడుతుంది.
మీ ఇంట్లో షార్ప్ అంచులు కలిగిన గ్లాస్ సెంటర్ టేబుల్ ఉంది అనుకోండి. దాని వైపు నడిచేటప్పుడు మీ ప్రమేయం లేకుండానే ఎక్కడ అంచులు తగులుతాయో అని కొద్దిగా దూరంగా నడుస్తారు కదా. దీనికి కారణం షార్ప్ అంచులు తగిలితే స్కిన్ కట్ అవుతుంది అనే మీ సబ్ కాన్షియస్ నాలెడ్జ్ బాడీ ఇంటెలిజెన్స్‌గా శరీరంలో ప్రతిఫలించి.. అది ప్రమాదం కాబట్టి, ప్రమాదాలకు దూరంగా ఉంటేనే మీ శరీరం సేఫ్‌గా ఉంటుంది కాబట్టి దూరంగా నడిచేలా మీ బాడీ ఇంటెలిజెన్స్ కాపాడుతుంది.
మీ తాత గారికి ఒకసారి పొలంలో పనిచేస్తుండగా కొద్దిగా నూగు (డస్ట్) ఆయన ముక్కులోకి వెళ్లి శ్వాసకి అడ్డుపడి.. దాన్ని ఆయన బలవంతంగా బయటకు తోసివేసే ప్రయత్నంలో భాగంగా మానసికంగా కొంత రెసిస్టెన్స్ సృష్టించుకోవడం వల్ల తుమ్ములు వచ్చి ఆ తర్వాత, ఆ తుమ్ములను కూడా ఆయన డస్ట్ వల్ల ఏర్పడిన సమస్యగా భావించి (వాస్తవానికి డస్ట్ వల్ల ఏర్పడిన సమస్య కాదు అది, ఆయన ఒక దాన్ని రెసిస్ట్ చెయ్యడం వల్ల బాడీ ఇంటెలిజెన్స్ ఈ పదార్థం ఈయన సర్వైవల్‌కి మేలు చేసేది కాదని ఆయన సబ్ కాన్షియస్ మైండ్ భావిస్తోంది కాబట్టి దీన్ని బయటకు నెట్టేద్దాం అని తుమ్ముల రూపంలో బయటకు పంపించే ప్రయత్నం చేస్తుంది) ఉండడం వల్ల డస్ట్ అంటే ఆయనకి రెసిస్టెన్స్, అది కాస్తా హిస్టమిన్స్ విడుదల అయి మళ్లీ మళ్లీ తుమ్ములు రావడం, ఆ సెక్రేషన్స్ ఎక్కువ సేపు ముక్కులో ఉండడం వల్ల బ్యాక్టీరియా ఏర్పడడం (తేమ ఎక్కువసేపు ఉంటే బ్యాక్టీరియా పుట్టుకు వస్తుంది), ఆ బ్యాక్టీరియా వల్ల ఎలర్జీ ఏర్పడడం, అది ఒకటి రెండు రోజులు గడిచేసరికి గొంతు అనే ఫిల్టర్‌ని దాటుకుపోయి బ్రాంకైనల్ ట్యూబ్స్ వాపుగానూ, ఆ తర్వాత ఊపిరితిత్తుల్లో నిమ్ముగానూ డెవలప్ కావడం ఇదంతా రెసిస్టెన్స్ యొక్క వివిధ దశలు.
ఈ దశల్లోనే ఇదేదో నాకు వచ్చింది.. దీన్ని వదిలించుకోవాలి అనే చిరాకు, రెసిస్టెన్స్ వల్ల దాన్ని బయటకు నెట్టేయడానికి తరచూ తుమ్మడం, శరీరం సెక్రేషన్స్ విడుదల చేసి ముక్కులు కారడం, గొంతు సరిచేసుకోవడం, ఊరికే దగ్గు రావడం, కఫాన్ని బయటకు పంపించే ప్రయత్నం చెయ్యడం.. ఇలా ఇవన్నీ జరుగుతాయి. అంటే ఇక్కడ మీ తాతగారు డస్ట్ అనేది తనకు ప్రమాదకరం అని భావించిన మొదటి క్షణం సమస్య మొదలైంది. ఆయన దాని పట్ల రెసిస్టెన్స్ పెంచుకుంటూ వెళ్లే కొద్దీ బాడీ ఇంటెలిజెన్స్ దాన్ని తరిమేసే ప్రయత్నంలో భాగంగా మరింత సెక్రేషన్స్, మ్యూకస్ విడుదల చేస్తూ ఫైట్ చేస్తూనే ఉంది. కానీ మనం ఏం అనుకుంటామంటే లోపల వైరస్, బ్యాక్టీరియా ఉంది కాబోలు దాన్ని శరీరం బయటకు నెట్టేస్తోంది అనుకుంటాం. వాస్తవానికి లోపల అంతా సెట్ అయినా కూడా మన ఇమ్యూనిటీ సిస్టమ్ బ్యాక్టీరియాని చంపేసి ఉన్నా కూడా మన రెసిస్టెన్స్ మాత్రమే మన లక్షణాలు తగ్గకుండా చేస్తుంది.
ఇప్పుడు మీ తాతగారు ఇలా జీవితాంతం డస్ట్ అలర్జీ, చల్లదనానికి ఎలర్జీతో జీవితాంతం ఫైట్ చేసి ఆ రెసిస్టెన్స్‌ని తన సబ్ కాన్షియస్ మైండ్‌లో భాగంగా చేసుకుని చనిపోయారు. ఆయన తన సంతానమైన మీ తండ్రికీ తన సబ్ కాన్షియస్ మైండ్‌లో ఈ డస్ట్ నీకు ప్రమాదకరం అనే బాడీ ఇంటెలిజెన్స్‌ని DNA రూపంలో పంపిస్తారు. కారణం సృష్టిలోని ప్రతీ జీవీ తాను ఎదుర్కొన్న అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుని, తన తర్వాతి తరాలు ఇబ్బంది పడకుండా ఆ సమాచారాన్ని DNA రూపంలో ప్రోగ్రామింగ్ కోడ్ బదిలీ చేస్తాయి. ఇప్పుడు మీ నాన్న గారికి పుట్టుకతోనే డస్ట్ ఎలర్జీ మొదలై ఉంటుంది. ఆయన కూడా జీవితాంతం దాంతో సఫర్ అయి ఉంటారు. ఇక మీ వంతు వచ్చేసరికి అది మరింత పెరిగి పెద్దది అవుతుంది.
ఈ సైకిల్ మొత్తంలో జరిగిందేమిటో ఓసారి పరిశీలించండి. మన థింకింగ్ మైండ్‌తో “ఇది నాకు హాని చేస్తుంది” అని చాలా లోతుగా సబ్ కాన్షియస్లోకి ఆ సమాచారం వెళ్లేలా డస్ట్ పట్ల రెసిస్టెన్స్ సృష్టించుకున్నాం. సో అది మీ సర్వైవల్‌కి ఇష్టం లేదని, సరిపడదని మీ బాడీ ఇంటెలిజెన్స్ నమ్మేసింది. సో ఇక దుమ్ములోకి వెళ్లినా, చల్లదనంలోకి వెళ్లినా మీ శరీరం తనకు తెలీకుండానే అన్ కాన్షియస్ యాక్టివిటీగా ఆ వాతావరణం మీద ఫైట్ చెయ్యడంలో భాగంగా దాన్ని బయటకు నెట్టేసే ప్రయత్నంలో తుమ్ములు, అసౌకర్యం, చిరాకు లాంటివి సృష్టిస్తుంది. ఈ నెగిటివ్ దృక్పధం మోసుకు తిరిగినంత కాలం ఎన్ని మాంటేక్యులాస్, సిట్రిజెన్ టాబ్లెట్స్ వేసుకున్నా అప్పటికప్పుడు లక్షణాలు తగ్గినట్లు కనిపిస్తాయి గానీ సమస్య తగ్గదు. ఇంగ్లీష్ మెడిసిన్ కేవలం లక్షణాల మీద మాత్రమే పనిచేసి చాలా గొప్పదిగా చలామణి అవుతూ ఉంటుంది. కానీ అడ్రస్ చెయ్యాల్సింది మూల కారణాన్ని! అదే మీ బాడీ ఇంటెలిజెన్స్నీ, డస్ట్, ఇతర ఎలర్జీస్ పట్ల మీ దృక్పధాన్ని!!
దీనికి ఓ బెస్ట్ టెక్నిక్ చెబుతాను.. రోజూ కనీసం పది నుండి 20 నిముషాలు కొన్ని రోజుల పాటు ఈ ప్రాక్టీస్ చేయాలి. మీకు డస్ట్ ఎలర్జీ అయితే.. కళ్లు మూసుకుని మీరు గదంతా డస్ట్ ఉన్న రూమ్‌లో ఉన్నారని ఊహించుకోండి. అయినా కూడా ఎలాంటి ఇబ్బందీ లేకుండా చాలా సౌకర్యంగా గంటల తరబడి అక్కడ కూర్చున్నట్లు అనుభూతి చెందండి. ఎంత డీప్‌గా అనుభూతి చెందాలంటే రియాలిటీకి, మీ ఊహకి తేడా ఉండకూడదు. ఇలా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాక తెలీకుండానే డస్ట్ పట్ల మీ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. మీ అలర్జీ మాయమైపోతుంది.
- Sridhar Nallamothu