పార్ట్ 1లో చెప్పుకున్న 3 రకాలైన అవసరాలతో పాటు ఇవి కూడా కావాలి. పార్ట్ 1 ఇప్పటికే చదవకపోతే ఇక్కడ చదవొచ్చు
4. ఆత్మగౌరవం
ఇతరుల చేత గౌరవించబడడం, తన పట్ల తాను గౌరవం కలిగి ఉండడం, తన మీద తనకు కాన్ఫిడెన్స్ ఉండడం, అలాగే మన తోటివారి మీద నమ్మకం ఉండడం.. ఇవన్నీ ఖచ్చితంగా ప్రతీ మనిషికీ తీరాలి.
ఇవి గనుక తీరకపోతే మానసికంగా చాలా ఇబ్బందులొస్తాయి. ఈ మానసిక ఇబ్బందులు ఆ వ్యక్తినే కాకుండా సొసైటీనీ చాలా influence చేస్తాయి.
ఉదా.కు.. ఇతరులచే గౌరవించబడడం అనేదే తీసుకుంటే… ఇతరులు మనల్ని గౌరవించకపోతే కారణాలు వెదికి సరిదిద్దుకోవడం కన్నా ఆ ఇతరుల పట్ల మొదట ద్వేషం పెరుగుతుంది. అందరిలోనూ తప్పులు చూస్తాం… తప్పుపడతాం, మానసికంగా వారిని హింసపెడతాం.
అలాగే తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేని వ్యక్తి ఎప్పుడూ ఇన్ సెక్యూర్డ్ ఫీల్‌లో ఉంటాడు.. ఆ ఇన్సెక్యూరిటీ వల్ల అతని ద్వారా వ్యక్తమయ్యే ప్రవర్తనాపరమైన లోపాలెన్నో! ఆ లోపాలు ఎన్ని external factors మీద ప్రభావం చూపిస్తాయో!
తోటి వారి మీదా, వ్యవస్థ మీదా, సమాజం మీదా నమ్మకం కలిగి ఉండడం కూడా ఆరోగ్యవంతంగా ఆలోచించడానికి చాలా అవసరం. ఏ క్షణమైతే మనుషుల పట్లా, వ్యవస్థల పట్లా ఆశలు కోల్పోతామో ఆ క్షణం ఆటంబాంబుల్లా సమాజంలో విస్ఫోటనం సృష్టిస్తుంటాం. మన మాటల్ని ఎన్నో బుర్రల్ని తప్పుదారి పట్టిస్తుంటాయి.
అందుకే సమాజంపై చాలామంది వ్యక్తపరిచే అనేక అర్థరహితమైన ఆవేశాల్ని "అది వారి పై అవసరాలు తీరకపోవడం వల్ల ఏర్పడిన మానసిక లోపంగా" భావించడమే కరెక్ట్ తప్ప.. ఆ ఆవేశాలనన్నీ మన బుర్రకు ఎత్తుకుంటే మనమూ మానసికంగా పొల్యూట్ అవుతాం. వ్యవస్థకూ మంచిది కాదు.
మనుషుల్ని ప్రేమించాలి, మనుషుల పట్ల నమ్మకం కలిగి ఉండాలి, వ్యవస్థని మన లాంటి మనుషుల సమూహంగా భావించాలి.
పై అవసరాలన్నీ తీరాక మాత్రమే మనిషి తిన్నగా ఆలోచిస్తారు. వాస్తవాల్ని అంగీకరిస్తారు. నీతి నియమాల్ని చిత్తశుద్ధిగా ఆచరిస్తారు. అహం త్యజిస్తారు. పైవేవీ తీరకుండా ఉంటే మన నుండి ఎలాంటి హైబ్రిడ్ ప్రవర్తనలు పుట్టుకొస్తాయో ఇప్పుడు చెప్తాను.
ఉదాహరణ 1:
"పక్కవాడికి సాయం చేయండి" అని నేను ఓ నీతి చెప్పాననుకుందాం. అది చిన్నప్పుడు చదువుకున్న సూక్తిగానో, ఎవరో ఏదో ఉపన్యాసంలో మాట్లాడిన మాటగానో నాకు గుర్తుండిపోయి ఉంటుంది. నేనూ, మీరూ, మనమూ చాలా కాజువల్‌గా ఇలాంటి కొటేషన్లనీ, నీతుల్ని చెప్పుకుంటూ వెళ్తాం.
నాకు ఓ వైపు సమాజం పట్ల గౌరవం లేదు అనుకుందాం. తోటి వ్యక్తుల పట్ల respect లేదు అనుకుందాం. లేదా మనుషులచే రకరకాలుగా బాధలు పెట్టబడ్డాననుకుందాం. సో నాకు అస్సలు మనుషులపై నమ్మకమే లేదు అనుకుందాం ఫైనల్ గా!
కానీ….
"పక్క వ్యక్తికి సాయం చేయండి" అని నేను థీరిటికల్గా మాట్లాడుతూనే ఉంటాను.
ఇక్కడ నేను నీతిని ఫాలో అవట్లేదు. ఓ నీతిని ఓ నా అవసరాన్ని తీర్చుకోవడానికి వాడుకుంటాననన్నమాట.
ఇంతకీ ఆ నా అవసరం ఏమిటంటే.. "నాకు సమాజం నుండి రాని గౌరవాన్ని ఇలాంటి నీతుల ద్వారా పొందడం"
సో పై ఉదాహరణ ద్వారా తెలుస్తుందేమిటంటే.. అన్ని అవసరాలూ తీరాక మాత్రమే తిన్నగా ఆలోచించే మనం.. ఎన్నో లోపాల్ని కప్పిపుచ్చుకుంటూ కూడా తిన్నగా ఆలోచిస్తున్నామని… మనం మాట్లాడే మాటల ద్వారా ప్రపంచానికి ప్రకటింపజేయాలనుకుంటాం.
Part 1, ఈ Part 2లలో చెప్పిన బేసిక్ అవసరాలు తీరకపోవడం వల్ల మన ప్రవర్తనలు ఎలా influence చేయబడతాయి అన్నది మరికొన్ని ఉదాహరణల ద్వారా తర్వాతి partలో చెప్తాను.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply