Dullness occupied…
మనస్సంతా నిస్సత్తువ.. ఏదీ ఆసక్తిగా లేదు..
అన్ని పరిస్థితులూ అనుకూలించనట్లే ఉంటుంది…
అందరు మనుషులూ విచిత్రంగా ప్రవర్తిస్తూ దూరం అవుతున్నట్లే ఉంటుంది…
ఈ ప్రపంచంలో ఇమడలేకపోతున్నామన్న అసహనం.. అన్నింటికీ మించి "నాకే ఎందుకిలా అవ్వాలి" అనే మిలియన్ డాలర్ల ప్రశ్న!!
——————————————————————–
అంతా బాగుందనుకున్న స్థితి నుండి "అంతా గందరగోళంగా ఉందేమిటి" అని భయపడే స్థితికి చేరుకోవడానికి కొన్ని సంఘటనల సీక్వెన్స్ చాలు..
అంతా బాగుందన్న సంతోషంలో ఉన్నప్పుడు చిన్న సమస్య వస్తే దాన్ని చిన్నదిగానే ట్రీట్ చేస్తాం… కానీ అంతా disturbedగా ఉందనుకున్నప్పుడే ప్రతీ చిన్న సమస్యా.. మనం అప్పటివరకూ ఉన్న మూడ్‌ని మరింత కాంప్లికేట్ చేస్తుంది… అగాధంలోకి కూరుకుపోతుంటాం…
యెస్.. నెగిటివ్ ఎమోషన్లు మైండ్‌ని చాలా అల్లకల్లోలం చేస్తాయి…. It’s all matter of thoughts and emotions we carry in our mind..
కారణం ఏమిటో తెలీదు.. కానీ చాలా శూన్యత… ఏం చేయబుద్ధీ కాదూ… ఎవరితో మాట్లాడబుద్ధీ కాదూ…
వంచుకున్న తలని పైకెత్తి చూస్తే మనల్ని వదిలేసి ప్రపంచం తన మానాన తాను పరిగెత్తుతున్నట్లు అన్పిస్తుంటుంది… ఆ పరుగు మనకు మరింత ఒంటరితనపు ఫీలింగ్‌ని పెంచి పారేస్తుంది…
——————————————————————-
అంతా మైండ్ గేమ్…
ఒకదానితో మరొకటి inter connect అయి సాగే ఆలోచనల దిశని మళ్లించగలిగితే చాలు… అన్నీ చక్కబడతాయి… శూన్యతా, ఒంటరితనమూ అన్నీ చప్పున ఎగిరిపోతాయి…. 🙂
మనం ఏ state of mindలో ఉన్నామన్నది మన కంట్రోల్లో ఉన్న విషయమే… దానికి సిట్యుయేషన్స్నీ, మనుషుల్నీ కారణం చేసేసి… ముడుచుకుని పడుకోవడం సరైనది కాదు…
ఈ క్షణం మనస్సులో వెలితి ఉన్నా మరుక్షణంలో నిండుతనాన్ని నింపుకునే నేర్పు అలవర్చుకుంటే అస్సలు ఏదీ బాధించదు..
మన ఏటిట్యూడ్లో చిన్న మార్పు చాలు.. మన ఆలోచనల్లోనూ, ఎమోషన్లలోనూ గొప్ప మార్పులు తీసుకు రావడానికి!!
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply