సైలెంట్‌గా కూర్చుని చూస్తుండండి.. కళ్లెదురు చాలామంది చాలా రకాల actions సూపర్ హిట్ సినిమా కన్నా ఇంట్రెస్టింగ్గా జరిగిపోతుంటాయి..
కళ్లెదుట కన్పించే ప్రతీ actionకీ మన మెదళ్లలో ఓ ప్రతిస్పందన పుట్టేస్తుంది.
మనుషులు కంట్రోల్ చేసుకోలేక actions ద్వారా తమ బలహీనతల్ని బహిర్గతపరుచుకుంటుంటారు.. మనం నోరు మూసుకుని ఆలోచనల్లోనే రియాక్షన్లని ఆస్వాదిస్తూ ఉత్తములుగా ప్రదర్శించుకోబడుతుంటాం.
వికృతమైన ఆలోచనని జయించిన వాడు మౌనీ, మునీ! ఆలోచనారహితమైన స్థితే సంపూర్ణమైన మౌనాన్ని అందిస్తుంది తప్ప నోరు మూసుకుంటే మౌనంగా ఉన్నట్లు కాదు. ఆలోచనారహితమైన మౌనంలో ఉన్నప్పుడు ఏ కల్మషాలూ మనస్సుకూ, బుద్ధికీ అంటవు.
ఎదుటి వ్యక్తి మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు మనం చాలా బలవంతులమన్న భ్రమ కలుగుతుంది. కానీ ఆ భ్రమని చెల్లాచెదురు చేస్తూ ఎప్పుడోసారి మనమూ బలహీనులం అవుతాం.. అప్పుడు ఎదుటి వ్యక్తి తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. ఇదంతా actions, reactions చక్రం.
తెల్లారిపోతోంది.. జీవితం మొత్తం.. బలాలూ, బలహీనతల బేరీజులతో!!
కొన్నిసార్లు ఓ వెకిలి నవ్వుని చూస్తుంటాం.. ఆ నవ్వుని తట్టుకోలేక ఆవేశం తన్నుకొస్తే హృదయమంతా రగిలిపోతుంది. అలా రగిలిపోవడం ఒక్కటే కాదు సొల్యూషన్.. అస్సలు అది సొల్యూషనే కాదు. వెకిలి నవ్వులకు సరైన సమాధానం హృదయం విప్పార్చుకుని మనస్ఫూర్తిగా నవ్వడం!! ఇలా ప్రతీ actionకీ మనం అనుకున్న predefined actionsకి alternativesగా పాజిటివ్ రియాక్షన్లు ఉంటూనే ఉంటాయి. కానీ మనం వాటిని వాడుకోం.
మనం మానసికంగా బలహీనులం.. ఎవడో పతనం అయిపోతుంటే మనకు నవ్వు తన్నుకొస్తుంది… ఎవడో ఎదిగిపోతుంటే లోపల్లోపల ఏడుపు బ్లడ్ వెస్సల్స్లో బ్లీడింగ్ అవుతుంటుంది.. BPలు పెరిగిపోతాయి..
ఇక్కడెవడూ శాశ్వతం కాదు.. ఎవడినో క్రిందికి లాగి సాధించేదీ లేదు.. అకారణంగా ఎవడినో ద్వేషించి బావుకునేదీ ఏం లేదు. కళ్లు మూసుకునీ.. లేదా కళ్లు తెరిచీ నిర్లిప్తంగా మన పని మనం చేసుకుంటూ పోతే దైవత్వం ఆపాదించబడదా చెప్పండి మనకి?
మనస్సులో విషం నింపుకుని ఆ విషంతో అష్టవంకరలూ తిరుగుకుంటూ.. విచిత్ర వేషాలు వేసుకుంటూ బ్రతికే కన్నా.. అందర్నీ ప్రేమిస్తూ.. అభిమానిస్తూ అమృతాన్ని ఎందుకు ఆస్వాదించకూడదు…? ఆలోచించండి!!
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply