కొందర్ని చూస్తే అసూయగా ఉంటుంది… అలాంటి ఓ వ్యక్తి ఈరోజు నన్ను కలిశారు.
ఓ ప్రభుత్వ శాఖకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న "కంప్యూటర్ ఎరా" పాఠకులాయన.
ఆయనకు గంట అప్పాయింట్మెంట్ ఇచ్చి కూడా.. టైమ్ ఎలా అయిపోయిందో తెలీక ఇంకాసేపు ఆయనతో స్పెండ్ చేద్దాం అన్పించింది.. కానీ నాకు వేరే పనులు ఉండడం వల్ల కూర్చోండని చెప్పలేకపోయాను.
ఆయనకు అస్సలు విన్పించదు.. అయినా మెరిట్ మీద (ఎగ్జామ్లో టాపర్ అవడం వల్ల ఫిజికల్లీ ఛాలెండ్జ్ కోటాలో కాదు) అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో నియమించబడ్డారాయన.
మంత్రులతోనూ, కలెక్టర్లతోనూ కాన్ఫరెన్సుల్లో పాల్గొనేటప్పుడు వినికిడి లోపం చాలా ఇబ్బంది అవుతోందనీ రియల్ టైమ్లో voice to text (Dragon Naturally Speakingలా ఎలాంటి ట్రైనింగ్ లేకుండా) సదుపాయం ఏమైనా ఉందేమో కనుక్కోవడానికి కలిశారు. అందుబాటులో ఉన్న అన్ని పాజిబులిటీస్ గురించీ ఆయనకు చెప్పాను.
ముఖ్యంగా ఆయన నన్ను చాలా inspire చేశారు… ఆయన ప్రశ్నలు అడగడం, నేను పేపర్ మీద ఆన్సర్లు రాస్తుంటే చాలా వేగంగా చదువుతూ.. "ఓహో.. అయితే ఇదెలా.." అంటూ అంతే వేగంగా ఆయన మాట్లాడుతున్న తీరు చాలా ఆశ్చర్యపరిచింది.
ఎంత గ్రాస్పింగ్ పవరో.. అలాగే ఎంత మంచితనమో… అన్నీ ఉన్నా ఎప్పుడూ ఏవో కంప్లయింట్లు చేసే మనకన్నా ఆయన లాంటి వాళ్లు వంద రెట్లు బెటర్ అన్పించింది…
నిజంగానే మనకు బ్రతకడం చేతకాదు… అలాగని చావడానికీ ధైర్యం లేదు… రెండింటి మధ్యా ఊగిసలాడుతూ మొహాలు వేలాడేసుకుని బ్రతికేస్తున్నాం భారంగా!!
ఇలాంటి వారిని చూసైనా జీవితం పట్ల గౌరవాన్ని తెచ్చుకోవాలి… ఆయన ప్రతీ మాటా వింటుంటే… ఆయనలో చలాకీతనం చూస్తుంటే… ఏదో కష్టపడిపోతున్నానని ఫీలయ్యే నేను చాలా వేస్ట్ అన్పించింది….
బ్రతికితే అలా సజీవంగా బ్రతకాలి.. నిర్జీవంగా దొర్లుకుంటూ కాదు!!
ధన్యవాదాలు…
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
శ్రీధర్ గారు నాకు మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపిస్తుందండీ. మీ దగ్గరనుండి చాలా నేర్చుకోవాలి.
మంచి పోస్టు శ్రీధర్ గారు. ఆటంకాన్ని అవరోధంగా భావించకుండా విజేతగా నిలిచిన అతను నిజంగా రియల్ హీరోనే. ఇటువంటి వ్యక్తులే సమాజమనుగడకు స్పూర్తిదాయకం.
జ్యోతిర్మయి గారు 🙂 మీరలా అనడం మీ గొప్పదనం. ధన్యవాదాలండీ.
పల్లా కొండలరావు గారు, అవును సర్, ఇలాంటి వ్యక్తులు కొద్దిమంది వల్లనే సమాజం సజీవంగా నిలుస్తోంది.