రోజుకో ఇష్యూ కావాలి కదా మనకు…
టివి ఛానెళ్లకి ప్రతీ అరగంటకూ ఓ పరీక్షే.. ఏదో ఒకటి కొత్త ఇష్యూ, కొత్త సెన్సేషన్, కొత్త వార్తా కావాలి.. అందరి దృష్టినీ దానివైపు మళ్లించగలిగితే TRP రేటింగులు పెరుగుతాయి…
ఈ టెండెన్సీకి మనమూ బానే అలవాటు పడిపోయాం.. మనకూ రోజుకో ఇష్యూ కావాలి.. ఆ రోజు పొద్దున్నే పేపర్లో చూసిందో, టివిలో చూసిందో ఏదో ఒకటి మైండ్లోకి తీసుకుని మన మేధస్సంతా రంగరించి వండి వారిస్తే ఆ సంతృప్తే వేరు.
మనం అవసరానికి మించీ, మనకు సంబంధం లేని విషయాల్లో సైతం విపరీతంగా expressive అవుతున్నాం అన్నది ఎవరికి వాళ్లం నిశితంగా గమనించుకుంటే అర్థమవుతుంది.
ఏదో ఒకటి మాట్లాడకపోతే తోచని స్థితి అన్నమాట.. తోచట్లేదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడేసేయాలి. దానికి తగ్గట్లు ఏదో ఒక ఇష్యూ రోజూ దొరుకుతూనే ఉంటుంది మన మెదళ్లకి..
ఇదంతా ఎవర్నీ కించపరచడానికి రాయట్లేదు. జస్ట్ జరుగుతున్న విషయాన్ని విశ్లేషిస్తున్నానంతే..
—————–
ఉన్నది ఒక్కటే లైఫ్.. అది అందరికీ తెలుసు.. కానీ ఆ లైఫ్ ఎలా గడపాలో తెలీని కన్ప్యూజన్ అంతే. Quality of Life అనేది మన ఆలోచనలపై డిపెండ్ అయి ఉంటుంది. మన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మనం సమాజం గురించి ఆలోచించాలి తప్ప మన బాధ్యతలు విస్మరించి సమాజం గురించి ఆలోచించడం వృధా.
మన ఆలోచనలు మీడియా చేతో, జనాలందరూ మాస్ హిస్టీరిక్గా మాట్లాడుకునే పబ్లిక్ ఇష్యూస్ దగ్గరో stuck అయిపోతే రోజూ ఏదో ఒక ఇష్యూ మన ప్రొడక్టివిటీనీ, ఆలోచనల్నీ హైజాక్ చేస్తూనే ఉంటుంది. సో మన లైఫ్ మనం లీడ్ చెయ్యడం మానేసి ఏరోజుకారోజు మెదడుకి ఏ మేత దొరుకుతుందా అని టివిల్లోనూ, పేపర్లలోనూ వెదుకులాడుతునే దుస్థితికి చేరతాం అన్నమాట.
———-
అందరూ “సామాజిక స్పృహ కలిగి ఉండాలి, సమాజంలో జరిగే వాటిని గమనిస్తూ తమ అభిప్రాయాలు వెల్లడించాలి, అప్పుడే సమాజం మారుతుంది” వంటి మాటలూ, భావజాలం తప్పుగా ఇంటర్ప్రెట్ చేసుకోబడ్డాయి. నిజమే సామాజిక స్పృహ కలిగి ఉండాల్సిందే.. కానీ అస్సలు స్వీయసృహే లేని వ్యక్తి సామాజిక సృహ కలిగి ఉండి లాభం ఏమిటి?
మనం ఒక్కళ్లం సమాజం గురించి మాట్లాడకపోతే ఏమీ ప్రళయాలు ముంచుకురావు.. కానీ మనం ఒక్కళ్లం మన బాధ్యతలు మర్చిపోతే మాత్రం మన జీవితంలో ఖచ్చితంగా ప్రళయం వచ్చి తీరుతుంది. ఈ ఒక్కమాటా అర్థమైతే చాలు మన పనులూ, బాధ్యతలూ అన్నీ least ప్రయారిటీ నుండి నార్మల్ అవుతాయి.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply