లిఫ్ట్ డోర్ క్లోజ్ అయింది.. పై నుండీ క్రిందికి దిగుతోంది…
కొన్ని క్షణాలు సైలెన్స్.. ఎవరికి వారికి తెలీని discomfort. ఎప్పుడూ చూడని మొహాలు అతి సమీపంగా ఉన్నా.. అందరూ అందర్నీ గమనించాలని క్యూరియాసిటీ తన్నుకొస్తున్నా అంతా తొక్కిపెట్టి.. అందరి దృష్టీ లిఫ్ట్ బటన్ల వైపూ.. డిస్ప్లే వైపే బలవంతంగా మళ్లించబడుతోంది..
దిగడం మొత్తం మహా అయితే 30 సెకండ్లే.. ఆ నిశ్శబ్ధం భరించలేక ఇద్దరు కపుల్స్ మాట్లాడుకోవడం మొదలెట్టారు. అంత ముఖ్యమైన విషయాలేమీ కాదు. 30 సెకండ్లలో మాట్లాడాల్సిన అర్జెంట్ విషయాలూ కాదు. Just because of silence మాత్రమే. ప్రతీ ఇబ్బందికరమైన సిట్యుయేషన్నీ ఆర్టిఫీషియల్ పెద్ద పెద్ద నవ్వులతో overcome చేయడం కామన్ హ్యూమన్ సైకాలజీ. అందుకే మాటల కన్నా రెండు నవ్వులే ఆ ఇరుకు లిఫ్ట్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాయి.
ఇరుకు లిఫ్టే కాదు.. ఒకర్నొకరు ఎంటర్టైన్ చేసుకోవాల్సింది తప్పించి ఇంకెవరూ తెలిసిన వాళ్లు లేని ప్రతీ పబ్లిక్ గేదరింగ్లోనూ ఓ ఇద్దరు మాటలున్నా లేకపోయినా ఏవో ఉబుసుపోని కబుర్లతో అసౌకర్యాన్ని నెగ్గుకు రావడానికి కుస్తీలు పడుతుంటారు.
పెద్దగా మాటలేం ఉండవు.. “ఫలానా పర్సన్ ఎలా ఉన్నాడు.. వాడు మారడు.. మనం ఎంత చెప్పినా..” అనే ఓ డైలాగూ… ఆ తర్వాత ఓ నవ్వూ… ఓ 2 నిముషాలు ఎలాగోలా గడిచిపోయాయి.. మధ్యలో ఓ సైలైన్స్. ఈ లోపల ఇద్దరి బ్రెయిన్ ఇద్దరికీ రిలేటెడ్ పాత టాపిక్స్ వైపో, కామన్ ఇంట్రెస్టుల వైపో Octa Core ప్రాసెసర్ల కన్నా వేగంగా ప్రాసెసింగ్ మొదలెడతాయి. ఏదో గుర్తొస్తుంది…
“అన్నట్లూ అప్పుడెప్పుడో ఫలానా హెల్త్ ప్రాబ్లెం అయింది కదా.. ఇప్పుడెలా ఉంది..?” – అంటూ మరో క్వశ్చన్! అడగబడిన వాడికి అదే క్వశ్చన్ చాలామందిచేత వినబడి విసుగొచ్చి చెప్పే మూడ్ లేక ఏదో ముక్తసరిగా చెప్పేసే మానసిక స్థితి ఓ వైపు వింటే.. క్వశ్చన్ అడిగిన వాడికి ఏదో మాట వరుసకి అడిగాడే గానీ సమాధానంతో పనిలేదు. వింటున్నట్లు నటిస్తూ దిక్కులు చూస్తుంటాడు. ఓ రెండు నిముషాలు ఇప్పుడు గడిచిపోయాయి… next ఎలా గడపాలా అని పరిసరాలు గమనిస్తూ.. ఇంకెవరితోనైనా ఎంటర్టైన్ అవడానికి ప్లాన్ గీస్తూ!
మనుషుల మధ్య మనుషులకు discomfort. ఇది చిన్న విషయం కాదు.. రోజురోజుకీ మాటలు తగ్గిపోతున్నాయి.. ఫీలింగ్స్ తగ్గిపోతున్నాయి.. మనుషులకు మధ్య ఇంటరాక్షన్ ఉండట్లేదు.. సైలెన్స్ పెరిగిపోతోంది.. ఆ సైలెన్స్ తట్టుకోలేకా.. ఎలా బ్రేక్ చేయాలో తెలీకా పనికిమాలిన ముక్తసరి మాటలు…
ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడా heart లేదు.. ఏదో కాలక్షేపానికి తెరుచుకునే నోరు తప్పించి! Heart ఉంటే మాటలు వాతంటత అవే తన్నుకొస్తాయి. అలాగే ఏ సైలైన్స్ అయినా పెద్దగా బాధించదు.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply