“గుళ్లో కొబ్బరికాయలు కొట్టడం కన్నా మానవత్వం మిన్న” – వాట్సప్‌లో ఇలాంటి కొటేషన్స్ వేలంవెర్రిగా చలామణి అవుతుంటాయి!
ఇది ఎవరి perceptive? రాసిన వ్యక్తి ఆలోచనా లేక షేర్ చేసిన వ్యక్తి భావనా.. Are they experience both of those activities? “మిన్న” అనే పదం వాడినప్పుడు ఏ విషయంలో మిన్ననో స్పష్టత ఉండాలి కదా? రెండు పనులనూ ఏ ప్రాతిపదికన కంపేర్ చేస్తున్నాం? సంతృప్తి అనే కోణంలోనా? అంటే గుళ్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు 50 శాతం సంతృప్తి వస్తే మానవత్వం చూపిస్తే 100 శాతం సంతృప్తి వస్తోందా? సాంఖ్య శాస్త్రం సైన్స్‌లా కాకుండా హ్యూమన్ ఎమోషన్ కూడా కౌంటబుల్ అని చెబుతోంది. కానీ ఎంత కౌంటబుల్, దేనితో కొలిచారు?
ఒక మనిషికి సాయం చేసినప్పుడు సంతోషం పొందడంలో మళ్లీ హెచ్చుతగ్గులు ఉంటాయి. అవి డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్. తనకి ఎవరూ లేని వ్యక్తి ఒక ఇతర వ్యక్తికి సాయం చేస్తే అతని మొహంలో వచ్చే సంతోషం ఎక్కువ. కానీ తన చుట్టూ నిరంతరం మనుషులు ఉండే వ్యక్తి ఎదుటి వ్యక్తికి సాయం చేసినప్పుడు పెద్దగా ఎమోషనలైజ్ అవకపోవచ్చు. ఇలా చాలా చాలా అంశాలు ఒక మనిషి ఆ క్షణం యొక్క దృష్టిని ప్రభావితం చేస్తాయి. అలాంటప్పుడు ప్రతీ వ్యక్తీ తనకి తాను అనుభవించకుండా జనరలైజ్డ్గా ఎలా కొటేషన్లు షేర్ చేస్తారు?
అసలు మానవత్వం అంటే డెఫినెషిన్ తెలుసా? దానికి సర్టెన్ సెట్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నాయా?
ఇదంతా ఎందుకు రాశానంటే.. కొటేషన్లు వేరు, జీవితం వేరు. జీవితంలో ఒక్కో అనుభవం ఒక్కొకరికి అపరిమితమైన ఆనందం ఇవ్వొచ్చు, నిరుత్సాహం ఇవ్వొచ్చు. They have to experience it. అలా ప్రతీ సోల్ తన జర్నీలో అన్ని డైమెన్షన్స్నీ టచ్ చేస్తూ డిటాచ్డ్గా తయారవుతూ ముందుకు సాగినప్పుడే ఫోర్త్ డైమెన్షన్లో జర్నీ పూర్తవుతుంది.
సో మేధస్సు పేరిట, అభిప్రాయాల పేరిటా.. నీతి పేరిటా చాలా కండిషనింగ్ జరుగుతోంది. జీవితాన్ని ఓ ఛట్రంలో ఇరికించే ప్రయత్నం జరుగుతోంది.
“మెడిటేషన్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది” అని నాబోటి వాడు రాస్తాడు అనుకోండి. అది నా అనుభవం. అది ఇండివిడ్యువల్ మాత్రమే. దాన్ని చదివి మీరు మెడిటేషన్లో కూర్చుంటే మీకు సెట్ కాకపోవచ్చు.. డిజప్పాయింట్మెంట్ అనే శాక్రల్ చక్ర ఎనర్జీ బ్లాక్ అయ్యే ఎమోషన్ కలగొచ్చు. “నేను మెడిటేషన్ చెయ్యడానికి అర్హుడిని కాదు” అని మణిపూరక చక్ర ఎమోషన్లో ఇరుక్కుపోవచ్చు. అంటే నాలెడ్జ్ పేరిట బయట చలామణి అయ్యేదంతా హ్యూమన్ ఎక్స్‌పీరియెన్స్‌ని కండిషన్, ప్రభావితం చేస్తోంది కదా!
అపరిమితమైన స్వేచ్ఛ అనేది జీవుడికి కావలసిన ప్రాథమిక విషయం. పురాతన కాలంలో ఇలా ఒకరి నుంచి మరొకరు ప్రభావితమయ్యే వాళ్ళు చాలా తక్కువ. ఎవరి లైఫ్ వాళ్లు, జీవితంలో ప్రతీ డైమెన్షన్ ఎక్స్ప్లోర్ చేసేవారు. ఇప్పుడు ముందు చూపు పేరిటా, భవిష్యత్ ప్లానింగ్ పేరిటా, నీతి పేరిటా, మేధస్సు పేరిటా ఒకరి అనుభవాన్ని మరొకరు పంచుకునే స్వభావం పెరిగిపోతోంది. అంతెందుకు నేను మెడిటేషన్ గురించి నా అనుభవం ఫేస్బుక్లో రాసినప్పుడు “మీలా ఆలోచనల నుండి డిటాచ్ అవ్వాలంటే ఎలా సర్” అంటారు. సో they are expecting techniques from me? ఏమని చెప్పాలి.. వాళ్లకి వాళ్లు ఏళ్ల తరబడి మెడిటేషన్ చేసి స్వయంగా తెలుసుకోవలసిన విషయాలను విక్రమ్ గైడ్లో మాదిరిగా స్టెప్ 1. కళ్లు మూసుకోండి స్టెప్ 2. ఇలా చేయండి.. అంటూ ఓ విధానంలోకి ఇరికించి చెప్పడం ఓ ఆకాశమంత జ్ఞానాన్ని, ఓ జీవితమంత అనుభవాన్ని నాలుగు స్టెప్స్లోకి ఎలా ఇరికించగలను? అసలు వాళ్లు ఆ స్వీయ ప్రాక్టీస్ అనే డైమెన్షన్‌లోకి వెళ్లకుండా దేన్నయినా ఎలా ఇతరుల perceptionలో అర్థం చేసుకోగలరు?
“ఏమీ తెలియని వ్యక్తికి కొన్ని టెక్నిక్స్ చెబితే నష్టమేంటి” అనే లాజిక్ మళ్లీ చాలామంది మైండ్లోకి వస్తుంది. నీలో తపన ఉన్నప్పుడు క్రిందా మీదా పడ్డా నువ్వు సరైన మార్గంలోకి వెళతావు. దీని కోసం డిపెండెన్సీ అవసరం లేదు. డిపెండ్ అయ్యావంటే ఫోర్త్ డైమెన్షన్ ప్రధాన లక్షణం అయిన ప్రాసెస్‌ని పూర్తి చెయ్యకుండా గోల్ కోసం, అంటే ఎండ్ రిజల్ట్ కోసం పాకులాడుతున్నట్లు లెక్క.
తెల్లారి లేస్తే మనం వాట్సప్‌లో, ఫేస్బుక్లో షేర్ చేసుకునే కొటేషన్స్ అన్నీ కండిషనింగే. అనుభవం పేరిటా, మేధస్సు పేరిటా, నైతిక విలువల పేరిటా ఒక సోల్ తనకు తాను తన జీవితాన్ని జీవించి ప్రతీ క్షణం నుండి డిటాచ్ అయి పూర్తి చెయ్యాల్సిన జర్నీని కేవలం కొటేషన్ల లాంటి కొన్ని అక్షరాల్లో మైండ్‌సెట్ ప్రభావితం చేయాలని చూస్తున్నాం.
అందుకే నాలెడ్జ్‌నీ, ఈ మేధస్సుకీ, నిజ జీవితానికీ, జీవితంలోని ప్రతీ డైమెన్షన్కీ పొంతన కుదరక మైండ్ గందరగోళానికి గురవుతుంది. మైండ్ గందరగోళంలో ఉన్నప్పుడు సోల్‌కి యాక్సెస్ ఉండదు. సోల్ తన జర్నీ పూర్తి చెయ్యదు.
- Sridhar Nallamothu