రెలెటివ్స్ కావచ్చు.. పెద్దగా చనువు, అటాచ్ మెంట్ లేని ఫ్రెండ్స్ కావచ్చు.. ఫోన్లలో మాటలు చెప్పుకునేటప్పుుడు చాలా ఆస్వాదిస్తుంటాం. బై డీఫాల్ట్ ఎవరికి వారు పాలిష్డ్ గానూ, ఆత్మీయంగానూ, టోన్ లో ప్రేమని ఒలకబోస్తూనూ.. మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు నిజంగానే ప్రేమగానూ మాట్లాడొచ్చు..
కానీ అదే మనుషులతో నేరుగా ఓ వారం రోజులు గడపవలసి వస్తే మనకు చాలా చాలా ఇరిటేషన్ వస్తుంది. దూర ప్రాంతం నుండి వచ్చి వారు మన కళ్లెదుట కన్పించిన మొదటి క్షణం ఎంత ఆనందం ఉంటుందో.. మెల్లగా వారి అలవాట్లు, హావభావాలూ, ఇతరుల పట్ల వారు వ్యక్తపరిచే అభిప్రాయాలూ.. వంటి ప్రతీదీ గమనిస్తూ పోతాం.. ప్రతీదీ మనకు చిరాకు తెప్పిస్తుంది… చిరాకు వస్తూనే పైకి ప్రేమని నటిస్తుంటాం. చివరకు ఎప్పుడెప్పుడు వెళ్లిపోతారా అని ఫీలవుతాం.
అందుకే బంధుత్వాలూ.. స్నేహాలూ ఫోన్లలో, ఇ-మెయిల్స్ లో వికసించినంతగా నిజజీవితంలో నెగ్గుకురాలేవు. ఎవర్నీ భరించే శక్తి మనకు లేదు.. మనకు మనమే భారమైపోయాం కదా 😛
సో ప్రపంచంలో ఉన్న ప్రేమనంతా ఒలకబోసి… రోజుకి వందమందితో వంద గొప్ప గొప్ప స్నేహాలు చేయగలం తప్ప.. ఒక మనిషి భౌతిక సాన్నిహిత్యాన్ని ఓ వారం రోజుల పాటు కూడా తట్టుకోలేనంత ఎఫెక్షన్లు మనవి.
ఒక్క మాటలో చెప్పాలంటే మన ప్రేమలూ, స్నేహాలూ అన్నీ ఒట్టి భ్రమలు!! మెస్మరైజింగ్ మాటలో, అందమైన రూపమో, ఏదో ఒక అవసరమో ఉన్నంతకాలమే అవి కొనసాగేది.
అదే మనిషి ఎదురు పడ్డప్పుడు వారి మాటలో ప్రేమతో పాటే ఇతరుల పట్ల కర్కశత్వమూ బయటపడితే మన మనస్సు కలతపడుతుంది..
అదే మనిషి అందంలో ప్రత్యేక ఆకర్షణ మన ఊహాజనిత కల్పన అని అర్థమైన క్షణం ఆ అటాచ్మెంట్ పలుచబడుతుంది
అదే మనిషితో ఇంకే అవసరమూ లేదనుకున్నప్పుడు దానంతట అదే మనస్సు ద్వారం మూసుకుపోతుంది.
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే.. నిజంగా ఎదురొస్తే ఆ మనుషుల్ని భరించలేని అద్భుతమైన మానవ సంబంధాలు మనవి!!
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
You are 100% correct Sir….
చెప్పలేని భావాలకి అక్షరరూపమిచ్చారు.