తళుకుబెళుకుల తారాలోకం అది! ఆ తళుకులకు ఆకర్షింపబడని మిణుగురు పురుగులు ఉండవేమో! మిణుగురులు అంత స్థాయిలో కాకుండా తారల గురించి, సినిమా రంగం గురించి తెలుసుకోవాలని చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. తారాలోకంలోకి ఓ సినిమా పత్రిక సబ్ ఎడిటర్ గా యాధృచ్చికంగా నా ప్రవేశం తటస్థించింది. ఆ పత్రిక పేరు అప్రస్తుతం. పత్రిక పేరుతో ముడిపెడితే మున్ముందు చేసే పోస్టులు స్వేచ్ఛగా చేయలేను. ఈరోజు అగ్రస్థానంలో అభిమానులందరి నీరాజనాలు అందుకుంటున్న తారలందరితో స్వయంగా ఇంటర్వ్యూలు చేసిన అనుభవాలు, వారితో సమీపంగా మెలిగిన సందర్భాలూ ఉన్నాయి. అందరూ ఎంతో గొప్పగా చూసే సినీ తారల వ్యక్తిత్వాలను దగ్గరగా చూడగలగడం ఓ రకంగా అదృష్టమే. స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి దగ్గర్నుండి షావుకారు జానకి వంటి పాతతరం నటీనటులను కలిసే అవకాశం, అనేకమంది కొత్తతరం నాయకానాయికలను తరచిచూసే అవకాశమూ, లైలా (ఎగిరే పావురమా) చెల్లెలకు ఒక అన్నగా చెలామణి అవడమూ.. ఇలా ఎన్నో అనుభవాలు మన బ్లాగు మిత్రులందరితో పంచుకోదలుచుకున్నాను. కేవలం సరదాగా కాకుండా సినిమా రంగాన్ని అతి చేరువగా చూసిన అనుభవంతో సినిమా రంగపు నేటి పరిస్థితి, గత పదేళ్ల కాలంలో చోటుచేసుకున్న పరిమాణాలు, నేను పాలుపంచుకున్న వివిధ షూటింగ్ విశేషాలు, సినిమా రంగంలోని వ్యవస్థాగతమైన లోపాలు వంటి అనేక అంశాలను వీలున్నప్పుడు ఓ సీరియల్ గా “సినిమా మనిషి కబుర్లు” అనే టైటిల్ క్రింద వివిధ భాగాలుగా పంచుకుంటాను. మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
– నల్లమోతు శ్రీధర్
manchi interesting topic gohead all the best.
edurucustuntaamu .:)
Waiting for the interesting kaburlu 🙂
Interesting. Look forward to it.
Wow!!! So another interesting angle of you, great!!! Inkenduku aalasyam, memandaramu eduru chustunnamu 🙂
please tvaraga raayandi …
కబుర్ల జడివానలో పాఠకులని తడిసేలా చేసీ మురిపిస్తున్నారు మన బ్లాగు మిత్రులు. మరి మీరు (కూడా) కురిపించ బోయే కబుర్ల జడివానలో తడిసి, మురిసి, జాలువారిన ముత్యాలని ఏరుకోడానికి ఎదురుచూస్తూ సిద్ధంగా ఉన్నాము. ఇంకెందుకాలస్యం.. పదండి ముందుకు, పదండి తోసుకు..
రవిగారు, శివ గారు, నిరంజన్ పులిపాటి గారు, కొత్తపాళీ గారు, లక్ష్మి గారు, చైసా గారు, రమణి గారు మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. నేను సినిమా రంగంలో చూసిన అనేక అనుభవాలను తప్పకుండా రాస్తాను.