నాతోపాటు మనలో 90% మంది బ్రెయిన్స్ ఓ మైండ్‌సెట్‌లో ఇరుక్కుపోయాయి…
మనం చాలామంది మనుషుల్ని చూశాం…. సో ఫలానా బిహేవియర్ ఉన్న మనిషిని ఫలానా విధంగానే ఉంటాడన్న జ్ఞానం కొద్దీ కొత్తగా ఏ మనిషినీ భిన్నంగా explore చెయ్యాలన్న ఆలోచనా, ఆసక్తీ, ఓపికా ఉండనే ఉండవు….
ఉదా.కు… నల్లమోతు శ్రీధర్ అంత కష్టపడి వీడియోలు చేస్తున్నాడంటే… మనకు అన్పించేదొక్కటే… ఏం లాభం లేకపోతే ఎవరైనా ఎందుకు చేస్తారు అనో.. లేదా పాపం బ్రతకడం చేతకాని మనిషి అనో… సో ప్రతీ ఒక్క ప్రవర్తనకూ మనకు predefined నేరేషన్లు రెడీగా ఉన్నాయి.. సో అభిప్రాయాల విషయంలో మనం ఓ 20 శాంపిల్ సైకాలజీలను ప్రపంచంలోని జనాభా అన్నింటికీ అప్లై చేయజూస్తున్నాం…
అలాగే మనం చాలా నేర్చుకున్నాం.. ఇంకా నేర్చుకోవడానికి ఏమీ లేదు… ఎవరేం చెప్పినా అన్నీ మనకు తెలిసినవిగానే అన్పిస్తాయి.. చాలా బోరింగ్‌గా అన్పిస్తాయి… సో we lost interest on life facts..
ఈ కారణం చేతే "ప్రాబ్లెమ్స్‌ని లైట్ తీసుకోవాలి…" అని మన ఫ్రెండ్ ఎవరైనా ఏదైనా చెప్తే… ఫేస్ చేసేవాడికి తెలుస్తుంది బాధ… అన్న ఫీలింగ్ లోపల్నుండి తన్నుకొచ్చి సంస్కారం అడ్డొచ్చి ఆగిపోతుంది…. యెస్ ఇక్కడా మనం ఇరుక్కుపోయాం… దేన్నీ స్వీకరించలేకపోతున్నాం…
ఎవరైనా దగ్గరకొస్తుంటే భయం… 🙂 ఏం హాని చేస్తారోనని….. ఇక్కడా నెగిటివిటీలో ఇరుక్కుపోయాం….
ఎవరైనా మనల్ని చూసి నవ్వితే…. "నన్ను చూసి వాళ్లెందుకు నవ్వాలి… ఏదో ఎగతాళి చేస్తున్నారేమోనన్న" ఇన్ఫీరియరో, ఇన్ సెక్యూర్డో ఫీలింగ్… సో మనుషులు మనస్ఫూర్తిగా కూడా నవ్వకూడదు… నవ్వితే మనకు చాలా డౌట్లు…. 🙂
మంచి ప్రొటీన్ ఫుడ్ తింటే ఒళ్లొస్తుందన్న భయం…. ఆ ఒళ్లు తగ్గించుకోవడానికి మార్గాలున్నాయన్న విషయమే… సుఖానికి అలవాటు పడ్డాక మర్చిపోయాం…
ఇకపోతే అమ్మాయిల్ని నమ్మకూడదనో, అబ్బాయిల్ని నమ్మకూడదనో… రాజకీయాల్ని నమ్మకూడదనో…. కొన్ని మొండి అభిప్రాయాలు… వాటితో కరుకుగా, మొండిగా, అనుమానంగా రూపుదిద్దుకునే మొండి ప్రవర్తనలు…
అసలు ఏ మాటకే మాటే చెప్పుకోవాలంటే…. గొలుసుతో కట్టేసిన dogకీ మనకీ తేడా లేదేమో…. మళ్లీ ఇలా అన్నానని ఫీలవకండి…. ఇలా ప్రతీ దానికీ ఫీలైపోయే రుగ్మతలోనూ ఈ మధ్య ఇరుక్కుపోతున్నాం…
లైఫ్ ఎంత స్వేచ్ఛగా బ్రతకాలి… అస్సలు లైఫ్‌ని ఎందుకు మన చేతుల్లోకీ తీసుకోలేకపోతున్నాం……
ఎవరో ఏదో చేశారని అందరూ అదే చేస్తారా….
అన్నీ వచ్చేసనా "ఎవరో నాకు చెప్పేదేమిటని" నేర్చేసుకోవడం మానేస్తామా….
ఫుడ్ మానేస్తే ఒళ్లు రావడం ఆగుతుందా… అస్సలు డిఫరెంట్ ఆలోచనలు, డిఫరెంట్ లైఫ్ స్టైలూ, ఏటిట్యూడూ, మైండ్ సెట్టూ ఎందుకు ప్రయత్నించలేకపోతున్నాం…
అదృష్టం కొద్దీ ఇందులో నేనేం రాశానో అర్థమయ్యే వాళ్లు కొంతమందైనా ఉంటే చాలా చాలా సంతోషం… ఇలా ఎవరికీ అర్థం కాదేమో అని నేను భ్రమపడడమూ ఓ చోట ఇరుక్కుపోయినట్లు కాదూ నా ఆలోచనలు 😛 నేనూ మారాలి…. బట్ ప్రతీదీ భిన్నంగా ఆలోచించాలి అని గుర్తించాను కాబట్టి మారతాను.. మీరూ ప్రయత్నించండి.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply