ముందు రోజు కార్లో వెళ్తూ… కార్ గ్లాస్ నుండి నాకు కావలసినవి షూట్ చేశాను… అస్సలు శాటిస్ఫేక్షన్ లేదు…
ఇలా కాదని next day రెలెటివ్ టూ వీలర్ డ్రైవ్ చేస్తుంటే వెనుక కూర్చుని కెమెరా పట్టుకుని… షూట్ చేసుకుంటూ పోయాను….
ఇంతకీ షూట్ చేస్తున్నదేమిటంటే… చిన్నప్పటి నుండి నా జ్ఞాపకాల్లో చిక్కుబడిపోయిన ప్రదేశాలూ, గుర్తులూ, వ్యక్తులూ…
చీరాల ILTD కంపెనీని షూట్ చేస్తుంటే.. సెక్యూరిటీ అతనికో క్లారిఫికేషనూ… బాపట్ల ఆర్ట్స్ కాలేజీని వెకేషన్లో షూట్ చెయ్యడానికి ఓల్డ్ ప్రిన్సిపాల్ రికమండేషన్ ఫోన్ కాల్… బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ లోపల కెమెరా పట్టుకుని అలా షూట్ చేసుకుంటూ వెళ్లడానికి అక్కడే పనిచేస్తున్న నా క్లాస్మేట్ సహకారం…
కేవలం కాలేజీలో కాదు… బాపట్లకీ, చీరాలకీ మధ్య ఓ ట్రెయిన్ బ్రిడ్జ్ ఉంటుంది…. కాలేజ్ డేస్‌లో ఆ బ్రిడ్జ్ మధ్యలోకి వెళ్లి… ఫొటో దిగాను… సడన్‌గా ట్రెయిన్ వస్తే.. నీళ్లల్లోకి దూకాల్సిందే… మొన్న అదే బ్రిడ్జ్‌ని కెమెరాలో షూట్ చేస్తుంటే మాత్రం నిజంగానే ట్రెయిన్ వచ్చింది.. నా కెమెరాలో పదిలంగా ఉంది.
అలాగే లాస్ట్ టైమ్ ఓసారి రాసిన బాపట్ల పెన్ సెంటర్ ఫ్రెండ్ షాపూ, బాదంపాలుకి ఫేమస్ అయిన కేశవ కూల్ డ్రింక్స్, నేను అప్పట్లో రెగ్యులర్‌గా టీ తాగే మోడ్రన్ కేఫ్… రధంబజార్… ఇలా కొన్ని జ్ఞాపకాల్ని అలా షూట్ చేసుకుంటూ వెళ్లాను…
కొంతమంది ఏ ఛానెల్ నుండి అని అడిగారు… కొంతమంది మా షాపుని కూడా తీయండి… అని కోరారు… 🙂 కొంతమంది ఇతనెవరు, ఇలా షూట్ చేసుకుంటూ వెళ్తున్నాడు.. అని విచిత్రంగా చూస్తూ వెళ్లారు…
మొత్తానికి… నా జ్ఞాపకాల్లో మాత్రమే మిగిలి ఉన్న అనేక మధురస్మృతుల్ని నా కెమెరాలో బంధించాను… ఇంకా కొన్ని ఊళ్లు వెళ్లాలి… కొందర్ని కలవాలి…. వారితో ఎఫెక్షనేట్‌గా గడిపిన రోజుల్ని తలుచుకుంటూ మనస్సువిప్పి మాట్లాడాలి…
ఇంత బిజీ లైఫ్‌లో ఇదంతా… చాలా ఛాదస్తంగా అన్పిస్తుంది… మరీ అంత సెంటిమెంటల్‌గా మిగిలిపోతే ఎలా.. అని కూడా అన్పించొచ్చు… ఇక్కడ ప్రతీదీ వందమందికి వంద రకాలుగా అన్పిస్తుంది…. రోడ్ల మీద నడుచుకుంటూ ఓ వీడియోగ్రాఫర్లా షూట్ చేస్తున్నప్పుడు… ఇలా ఎవరేమనుకుంటారో
అన్న ఫీలింగ్ నన్ను డామినేట్ చేసి ఉంటే ఇదంతా చెయ్యగలిగే వాడిని కాదు… మనదైన జీవితం మనకు నచ్చినట్లు, మన ఇష్టాఇష్టాలకు తగ్గట్లు బ్రతకడంలో ఎప్పుడూ వెనుకాడకూడదు….
ఆర్ట్స్ కాలేజీలో కామర్స్ KVగారు అని ప్రిన్సిపాల్‌గా పనిచేసి రిటైర్ అయిన మా లెక్చరర్.. బాపట్ల రోడ్ మీద కన్పించారు…. ఆయన చాలాసార్లు నన్ను టివిలో చూశారట… మాటల మధ్యలో ఇలా షూట్ చేసుకుంటూ వెళ్లడం వెనుక ఉద్దేశం చెప్తుంటే.. ఆయన Roots అని ఓ ఇంగ్లీష్ బుక్ ఉందట…. ఓ వ్యక్తి తన పూర్వీకులకు సంబంధించిన జ్ఞాపకాల కోసం వెదుక్కుంటూ వెళ్తే సబ్జెక్ట్‌తో… perception అనేది వ్యక్తికి సంబంధించినది… అది సంబంధిత వ్యక్తి మాత్రమే అనుభూతి చెందగలుగుతారు… అంటూ భలే అనలైజ్ చేశారాయన…
మొత్తానికి గత నాలుగు రోజుల అతి ముఖ్యమైన నా వ్యక్తిగత ట్రిప్‌లో ఓ ఆత్మీయుల ఫంక్షన్‌ని కవర్ చేశాను… పనిలో పని ఎప్పటి నుండో నేను అనుకుంటూ వస్తున్న ఈ "స్వీట్ మెమరీస్" షూటింగ్‌కి ప్రారంభం చేశాను… వీలువెంబడి వాటిని ఆడియో నేరేషన్‌తో మీ ముందు ఉంచుతాను…
నిజంగా చాలా సంతృప్తిగా ఉంది…. కొన్ని జ్ఞాపకాల్ని షూట్ చేసిన తర్వాత..!!
మీలోనూ చాలామంది… తరచూ మీ ఊళ్లకు వెళ్లొచ్చు.. కొన్ని ప్రదేశాలూ, కొందరు వ్యక్తులూ మర్చిపోలేని విధంగా ముద్రించుకుపోయినా… కాజువల్‌గా కదిలిపోతూ ఉంటాం… కానీ కొన్నాళ్లకు ఆ జ్ఞాపకాలు కూడా మిగుల్చుకోలేని స్థితికి చేరిపోతాం… జీవితం ఎలా ప్రారంభం అయిందో, ఎలా సాగుతోందో,
ఎలా ముగుస్తోందో… గమనించుకుంటూ పోతే జీవితం పట్ల స్పష్టతా వస్తుంది…. కాలక్రమేణా ఏమైనా మనకు కొమ్ములు వచ్చినా… వాటిని వదిలించుకోనూగలుగుతాం… మన మూలాలను ఎన్నటికీ మర్చిపోకుండా ఉండగలుగుతాం…
అన్నింటికీ ముఖ్యంగా.. జీవితాన్ని ప్రస్తుతం ఉన్న మెరుగైన దశలో అర్థం చేసుకోవడం కన్నా… ఈ మెరుగైన దశకు చేరడానికి ప్రయాణించిన మార్గం ఆధారంగా అర్థం చేసుకోవడం ఎంత మంచిదో అర్థమవుతుంది..
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
so sweet your memories.
your memories are so sweet….