దేశ సరిహద్దుల్లో కొంతమంది సైనికులు గస్తీ కాస్తున్నారు. నియంత్రణ రేఖ వెంట అటూ ఇటూ తిరుగుతున్నారు.
దేశ సరిహద్దులను రక్షించడం వారి బాధ్యత. అంటే వారు బౌండరీస్‌ని నిరంతరం కనిపెట్టుకుని ఉంటారన్నమాట.
మనం కూడా అంతే! We set our boundaries and we continuously check whether they are safe or not.
ఒక మనిషికి సహజంగా వచ్చే ఆలోచనల్లో 90 శాతం ఈ బౌండరీసే!
ఉదా.కి.. రాము అంటే సోముకి ఇష్టం లేదు అనుకోండి. సోము హైటెక్ సిటీ ప్రాంతంలో ఏదో ఆఫీసులో కూర్చుని సీరియస్‌గా పనిచేసుకుంటూ కూర్చుని కూడా రాము గురించి మధ్యలో ఆలోచిస్తాడు. రాము అనే వాడు సోము అనే వాడికి ఓ బౌండరీ అన్నమాట. రాముని మించి సోము ఆలోచించలేదు. వాస్తవానికి రాము బదులు బిల్ గేట్స్ గురించి సోము బౌండరీ పెట్టుకోవచ్చు. కానీ రాము గురించి మళ్లీ మళ్లీ ఆలోచించేసి సోము మైండ్ ఆ చిన్న బౌండరీ దాటలేకపోతోంది.
మనకు ఓ ప్రాబ్లెం ఉంది అనుకోండి. కళ్లు మూసుకున్నా, తెరిచినా దాని గురించి ఆలోచిస్తూ అది సేఫ్‌గా ఉందా లేదా ఛెక్ చేసుకుంటూ ఉంటాం. కానీ మన మైండ్ మాత్రం పైకి “నేను ఆ ప్రాబ్లెంకి సొల్యూషన్ ఆలోచిస్తున్నాను” అని అబద్ధం చెబుతుంది.
Know reality అనేది మైండ్‌కి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఆలోచించిన విధంగానే మళ్లీ మళ్లీ ఆలోచించడం మైండ్‌కి ఇష్టం. కారణం మనం కాన్షియస్గా ఇదీ అని ఆలోచించకుండా, “నీ పాటికి నువ్వు ఆలోచించు” అని మైండ్‌కి పెత్తనం అప్పజెప్పేస్తాం. దాంతో మైండ్ ఆటో-పైలైట్ మోడ్‌లో తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. తెలిసిన విషయాల గురించే, తెలిసిన వ్యక్తులు, తెలిసిన సమస్యలు ఇలా అన్నీ తెలిసిన వాటి గురించి మళ్లీ మళ్లీ ఎలా ఆటో-పైలైట్లో ఆలోచించాలో దానికి ఐడియా ఉంది కాబట్టి అదే ఆ బౌండరీస్ చుట్టూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ బౌండరీస్‌ని ఎలా అధిగమించాలో దానికి తెలీదు.
ఏ వ్యక్తయితే కాన్షియస్గా వ్యక్తుల రూపంలోనూ, పరిస్థితుల రూపంలోనూ, సామర్థ్యాల రూపంలోనూ ఉన్న తన బౌండరీస్‌ని దాటుకుని ఆలోచిస్తాడో, వెళతాడో అతను known realityని అధిగమించి కొత్త ప్రపంచాన్ని చవిచూస్తాడు. I always practice it.
- Sridhar Nallamothu