"సూపర్ హిట్" సినిమా మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా 1996 – 1998 మధ్య పనిచేసినప్పటి కొన్ని జ్ఞాపకాలు ఈ ఫొటోలు. అంతకు ముందు సంవత్సరమే డ్రగ్స్ మానేసి ఉండడం, ఇతరత్రా కారణాల వల్ల అప్పటి నన్నూ ఇప్పటి నన్నూ పోల్చుకోలేరనుకోండి. డ్రగ్స్ అంటున్నానేమిటి అనే సందేహం మీకు వస్తే ఆ వివరాలను http://nallamothusridhar.com/?p=189 అనే లింక్ లో చూడొచ్చు.
ఇకపోతే అక్కినేని, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, కృష్ణ, రజనీకాంత్, కమల్ హాసన్, పవన్ కళ్యాణ్, రాజశేఖర్, అర్జున్, రాజేంద్ర ప్రసాద్, మాధురీ దీక్షిత్, మనీషా కొయిరాలా, ఆమని, కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, దేవీవరప్రసాద్, మురారి, సి. అర్జునరావు, అశ్వనీదత్, దాసరి నారాయణ రావు, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, సాగర్, తమిళ్ డైరెక్టర్ శంకర్, ఎన్ కౌంటర్ శంకర్ వంటి అనేక మంది నటీనటులూ, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేసే అవకాశం దొరకడం జీవితంలో మరో కోణాన్నీ తడిమి చూసిన మంచి అనుభూతి.
మనీషా కొరియాలాతో "ఒకే ఒక్కడు" షూటింగ్ ప్రారంభం సమయంలో ఇంటర్వ్యూ చేస్తూ..
అన్నమయ్య సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా స్వర్గీయ వేటూరి గారు మాట్లాడుతుండగా.. సుమన్, దొరస్వామిరాజు గార్లతో…
ముద్దుల మొగుడు సినిమా సాంగ్ షూటింగ్ కవరేజ్ కోసం కేరళ పాలక్కాడ్ వెళ్లినప్పుడు.. బాలకృష్ణతో.. (1997)
జగపతిబాబు "స్వప్నలోకం" సినిమా షూటింగ్ కవరేజ్ లో రాశిని ఇంటర్వ్యూ చేస్తూ..
రోబో డైరెక్టర్ శంకర్ తో ఒకే ఒక్కడు షూటింగ్ కవరేజ్ సమయంలో..
అప్పటి చెన్నై సినిమా జర్నలిస్ట్ మిత్రులం అందరం అన్నమయ్య నిర్మాత దొరస్వామిరాజు గారిని సన్మానించిన సందర్భంగా..
ఇందులో మా బి.ఎ. రాజు గారు, పసుపులేటి రామారావు, జగన్, ఉమా మహేశ్వరరావు వంటి మిత్రులం ఎందరమో ఉన్నాం. వయస్సుల్లో వాళ్లు పెద్దవాళ్లయినా ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ఈ మధ్య హైద్రాబాద్ లోనూ ఇద్దరు ముగ్గురు కలిసి "సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టి మంచి పని చేశారు" అంటూ మెహర్భానీలూ, అవకాశవాదుల గురించి చెప్తుంటే సినిమా రంగాన్ని స్వయంగా వదిలేశానే అన్న కొద్దిపాటి అసంతృప్తి తీరింది.
Congratulations! I have no words to express my feelings.
మాధురి గారు థాంక్యూ అండీ.