టెక్నాలజీ నాకు ప్రాణం.. అదే సమయంలో టెక్నాలజీ నా జీవితంలో ఒక భాగం మాత్రమే! పరిస్థితుల వల్ల కావచ్చు, ఇతరత్రా కారణాల వల్ల కావచ్చు చిన్న వయస్సులోనే ఎంతో జీవితాన్ని, ఎందరో మనుషుల నైజాల్ని ఆమూలాగ్రం అర్థం చేసుకునే అవకాశం నాకు కలిగింది. జీవితం పట్ల, సమాజం పట్ల మరింత అవగాహన కలిగేకొద్దీ ఎన్నో చిక్కుముడులు వీడుతున్నాయి. ఎన్నో కొత్త ఆలోచనలు అంకురిస్తున్నాయి. ప్రతీ క్షణం నాలో కదలాడే భావజాలాన్ని ఒడిసిపట్టుకుని అక్షరరూపం ఇద్దామన్న ప్రయత్నంలో భాగమే ఈ వ్యక్తిగత వెబ్ సైట్. టెక్నాలజీ రంగంలో నన్నెంతగానో ఆదరించిన పాఠక మిత్రులందరూ, మన "కంప్యూటర్ ఎరా" పత్రికలో నా సంపాదకీయాలను పుస్తకరూపం తీసుకురమ్మని ప్రోత్సహిస్తూ వాటినీ అభిమానిస్తున్న మిత్రులందరూ ఈ వెబ్ సైట్ నీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
– మీ నల్లమోతు శ్రీధర్