అందాన్ని చూసి సంస్కారంగానూ ఉండొచ్చు… అందాన్ని చూసి వికృతపు ఆలోచనలకూ గురవ్వొచ్చు..
మనుషుల రూపాల్లో అందం ఆడా మగా తేడా లేకుండా ఎవర్నైనా సమ్మోహితం చేస్తుంది.. కానీ అందంగా ఉన్న మనిషిని ఎలాగైనా లోబరుచుకుని స్వంతం చేసుకోవాల్సింది కాదు… అలాగే అందంగా ఉన్నామని మనుషుల బలహీనతలన్ని ఆసరాగా చేసుకుని వాడుకోజూసేదీ కాదు.
————–
జెనెటికల్ ప్రాపర్టీస్ కారణంగా రంగో, సొట్టబుగ్గలో, కర్లీ హెయిరో, సూదుల్లా గుచ్చుకునే కళ్లో, అమాయకపు గుండ్రని రూపమో, అల్లరి ఎక్స్ప్రెషన్లో.. ఏవో కొన్ని ప్రతీ మనిషిలోనూ స్పెషల్‌గా కన్పిస్తాయి. అందరి కన్నూ ఆ స్పెషాలిటీల మీదే ఉంటుంది.. ఆ మనిషి ప్రయాస కూడా లోపాలన్నీ కప్పిపెట్టుకుని ఆ స్పెషాలిటీల్ని మరింత బెటర్‌గా exbit చేసుకునే పనిలోనే ఉంటుంది.
———–
నాలెడ్జ్కీ, వ్యక్తిత్వానికీ.. ఇంకే విషయాలకూ లేనంత సోషల్ acceptance అందానికి ఉండడం వల్ల చాలా రిలేషన్లలో ఇది పెద్ద crucial factor అయి కూర్చుంది. అందమైన ఫేస్ వెనుక మూర్ఖత్వం ఉన్నా, క్రూయాలిటీ ఉన్నా సహించే బలహీనత మనది… అందుకే అందం ఒక్కటి క్వాలిఫికేషన్‌గా సోషల్ ఈక్వేషన్లు మార్చే ప్రయత్నాలూ జరగుతున్నాయి, ఈక్వేషన్లు అంతే వేగంగా మారుతూనూ ఉంటాయి.
—————–
Pigment melanin వల్ల డిసైడ్ అయ్యే వైట్, బ్లాక్ వంటి రంగులకూ, ఏ తల్లిదో, తండ్రిదో నోటి వంపు నుండి జెనెటికల్‌గా సరికొత్తగా తీర్చిదిద్దుకున్న ఓ వెరైటీ నోటి వంపుకీ, పెక్యులరియర్ నవ్వుకూ.. కళ్లప్పగించి చూసే సమ్మోహనం మనది.
సరిగ్గా ఈ అందమే మనుషుల్ని పిచ్చి వాళ్లని చేస్తోంది, మనుషుల వ్యక్తిత్వాల్ని కప్పిపెట్టి కేవలం అందం చేతే గొప్ప వాళ్లని చేస్తోంది.. ఆ అందాన్ని దక్కించుకోవాలనుకునే వారి చేత అఘాయిత్యాలూ చేయిస్తోంది.
తమ అందాన్ని చూసి గర్వపడే స్థాయి నుండి “ఎందుకు అందంగా పుట్టామా” అని వేధింపులు తాళలేక బాధపడే వాళ్లనూ చూస్తుంటాం.
అందం చేత ఎక్కువ ప్రభావితం అయ్యే సొసైటీ గనుక ఇది ఇవన్నీ తప్పట్లేదు.
————–
వయస్సుతో పాటు అందం ఎంత పోతపోసినట్లు తయారు చేయబడుతుందో అదే వయస్సుతో పాటు అదే అందం అంత వేగంగానూ హరించుకుపోతుంది.. అందం నుండి దృష్టి మళ్లించి వ్యక్తిత్వాలు మెరుగుపరుచుకోవలసిన అవసరం చాలానే ఉంది.
అందంగా పుట్టడం ఓ వరం.. అదే సమయంలో అందంగా పుట్టడం ఓ శాపం కూడా! భౌతిక అందాన్ని దాటి నీలోని గొప్పదనాన్ని ఏ మనిషీ చూడలేడు.. భౌతిక అందం అడ్డుపడ్డప్పుడు..!! దాంతో మనిషి చాలావరకూ unexploredగానే ఉండిపోతారు.
సో అందంగా ఉండొచ్చు.. అందానికి సమ్మోహితం కావచ్చు… కానీ అందానికి పిచ్చివాళ్లైపోవడమో, అందాన్ని నమ్ముకుంటూ, ప్రదర్శించుకుంటూ జీవితాన్ని ఇంకేమీ పనికిరాని నిస్సారమైనదిగా చేసుకోవడమో అవివేకం!
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply