క్లారిటీ లేకపోతే జీవితంలో ఎంత struggle అవుతామో మనలో చాలామందికి తెలీదు..
అందరిలానే ఊహ తెలిసినప్పటి నుండి కొన్నేళ్ల పాటు నేను డిఫెన్స్‌లో బ్రతికేశాను..
“ఎదుటి వ్యక్తి బిహేవియర్‌ని బట్టి నీ బిహేవియర్ మార్చుకుంటూ బ్రతకాలి” అంటూ డిఫెన్స్‌లో బ్రతికేలా గైడ్ చెయ్యడానికి సొసైటీ మనపై చూపించే శ్రద్ధ అస్సలు మనకంటూ మనం ఎలాంటి వ్యక్తిత్వంతో ఉండాలో గైడ్ చెయ్యడంలో ఫెయిలవుతోంది.
ఎప్పుడు చూసినా.. అవతలి మనిషి బిహేవియర్‌ని చూసి బాధపడడం.. భయపడడం.. ఇన్‌సెక్యూర్డ్ ఫీలవడం.. అగ్రెసివ్ అవడం.. అపార్థం చేసుకోవడం.. వీలైతే కసి తీర్చుకోవడం.. ఇలా ఎదుటి వ్యక్తిని గమనించడంలోనే మన సగం జీవితం అయిపోతోంది.
నావరకూ నేను దాదాపు పదేళ్ల క్రితం నుండి ఎదుటి వ్యక్తుల బిహేవియర్‌ని పట్టించుకోవడం మానేశాను. ఒకవేళ కొన్నిసార్లు ఎమోషనలైజ్ అయినా ఆ కొన్ని నిముషాలు అంతే. తర్వాత మళ్లీ నా స్టైల్ ఆఫ్ థింకింగ్‌లోకి వచ్చేయడమే… నేను చెయ్యగలిగినంత వరకూ అది ఎఫెక్షన్ గానీ, హెల్ప్ గానీ అవతలి వాళ్లకు చెయ్యడం, వదిలేయడం అంతే..!! ఇప్పుడు ప్రాణానికి హాయిగా ఉంది. మన లైఫ్‌ని మన స్టైల్లో బ్రతకాలి గానీ మనల్ని నిరంతరం శత్రువులు చుట్టుముట్టినట్లు ఇన్సెక్యూర్డ్గా బ్రతుకుతూ పోతే, కన్పించిన ప్రతీ వ్యక్తి గురించి అవసరానికి మించి ఎక్కువ ఆలోచించేసి వాళ్ల బిహేవియర్నీ, సైకాలజీనీ అర్థం చేసుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తే అస్సలు మనకేం మిగులుతుంది జీవితం?
లైఫ్ అన్న తర్వాత కొన్నిసార్లు కొన్ని రిస్కులు ఉంటాయి. అలాగని లైఫంతా రిస్కులే అని ఓవర్‌గా రియాక్ట్ అయ్యేలా మనం సొసైటీని చేస్తున్నాం.. దాంతో ప్రతీ ఒక్కరూ ఎవరి shellలో వాళ్లు ముడుచుకుపోయి పిరికిగా బ్రతికేస్తూ పోతున్నారు.
ఫ్రీ బర్డ్‌లా ఉండడం అదృష్టం.. అది జీవితం.. మనం ఎవర్నీ అపార్థం చేసుకోకుండా ఉంటే మనల్నీ ఎవరూ అపార్థం చేసుకోరు. మనం ఒకళ్లని అపార్థం చేసుకుని… తద్వారా చేసే actions ఫలితంగానే వాళ్లూ మనల్ని అపార్థం చేసుకుంటున్నారన్న విషయం అర్థం చేసుకుంటే కనీసం ఇప్పటికైనా లైఫ్ హాపీగా ఉంటుంది.. ఎవరి లైఫ్ వాళ్లం సంతోషంగా ఉంటాం.
– నల్లమోతు శ్రీధర్